Jr Ntr Trivikram : ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కార్తికేయుడి కథ ఇదేనా..?
Jr Ntr Trivikram : అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ చేయాల్సిన సోషియో, మైథలాజికల్ మూవీ ఇప్పుడు ఎన్టీఆర్‌ను వరించిందని సమాచారం. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తుండటంతో ఇక సుదీర్ఘ నిరీక్షణ ఇష్టం లేక త్రివిక్రమ్..ఎన్టీఆర్ వైపు మళ్లారని ఇన్‌సైడ్ టాక్.అయితే ఈ లేటెస్ట్ డెవలప్‌మెంట్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే గతంలో త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో ‘అరవిందసమేత వీరరాఘవ’ వంటి బ్లాక్‌బస్టర్ వచ్చింది…
Jr Ntr Trivikram : ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కార్తికేయుడి కథ ఇదేనా..?
మరోసారి వారిద్దరి కాంబినేషన్ రిపీట్ కాబోతుండటం, అందునా పౌరాణికాలకు పర్‌ఫెక్ట్ ఛాయిస్ ఎన్టీఆర్ అనే పేరు ఉండటంతో ఆయన అభిమానులు హ్యాపీగా ఉన్నారు.ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టిన పోస్ట్‌లు ఈ వార్తను ధృవీకరించేలా ఉన్నాయి. ‘నేను అభిమానించే అన్న.. అత్యంత ఇష్టమైన దేవుడి పాత్రలో..’ ‘గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్’ అంటూ నాగవంశీ పోస్ట్‌లు పెట్టారు. వీటితో పాటు కార్తికేయుడి తాలూకు సంస్కృత శ్లోకాలను రాసుకొచ్చారు.
ఎన్టీఆర్‌ను ఉద్దేశించే ‘ఫేవరేట్ అన్న..’ అని ఆయన పోస్ట్ చేశారని టాక్. ఇక ఈ సినిమా కథ గురించి గతంలోనే వార్తలొచ్చాయి. హిందూ ధర్మంలో యుద్ధం, విజయానికి ప్రతీకలా భావించే శివుడి తనయుడు కార్తికేయుడి కథ ఇదని సమాచారం. పురాణాలకు, నేటి సాంఘిక అంశాలకు ముడిపెట్టి దర్శకుడు త్రివిక్రమ్ అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారంటున్నారు. శివ పురాణం, స్కంధ పురాణం ఆధారంగా కథ రూపొందించి ఉంటారేమో అంటున్నారు. కార్తికేయుని జనానికి కారణం తారకాసురుడు.పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందుతాడు. తారకాసురుడు అమరత్వాన్ని కోరగా, బ్రహ్మ నిరాకరిస్తాడు.
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…
Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని…
Hero Bike : భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో అధిక మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన hero glamour…
This website uses cookies.