Junior NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ దేవర ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Junior NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ దేవర !

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎన్టీఆర్ 30 అనే టైటిల్ తోనే పిలుస్తున్నారు. సినిమాకు ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే తాజాగా ఈ సినిమాకు ‘ దేవరా ‘ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. సాధారణంగా కొరటాల […]

 Authored By prabhas | The Telugu News | Updated on :9 March 2023,9:00 pm

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎన్టీఆర్ 30 అనే టైటిల్ తోనే పిలుస్తున్నారు. సినిమాకు ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే తాజాగా ఈ సినిమాకు ‘ దేవరా ‘ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. సాధారణంగా కొరటాల తన సినిమాలకు చాలా పవర్ఫుల్ గా ఉండే టైటిల్స్ ని పెడుతుంటాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాకి కూడా

Junior NTR new movie Devara

Junior NTR new movie Devara

మంచి పవర్ఫుల్ టైటిల్ పెట్టాడని తెలుస్తుంది. యాక్షన్ ఫిలిం గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవర అని పవర్ ఫుల్ టైటిల్ పెట్టారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ మూవీ మేకర్స్ కు ఈ టైటిల్ నచ్చితే దీనిని అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆస్కార్ అవార్డు ప్రజెంటేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లారు. అక్కడినుంచి రాగానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా అందాల తార శ్రీదేవి

NTR 30: Is It 'Devara' The Title Of Jr NTR-Koratala Siva's Upcoming Film? -  Filmibeat

కూతురు జాన్వి కపూర్ నటిస్తుంది. ఇటీవల ఆమె బర్త్డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ లుక్ లో జాన్వి కపూర్ ఎంతో అందంగా హార్ట్ నెస్ గా కనిపించింది. ఈ సినిమాకి ఈమె హైలెట్ కాబోతుందని ఆ పోస్టర్ తో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకి దేవర అని టైటిల్ పెట్టడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే టైటిల్ తో ఈ సినిమా ముందుకెళుతుందా లేదా? టైటిల్ ని మారుస్తారా అనేది వేచి చూడాలి. అయితే ఎన్టీఆర్ కి ఈ టైటిల్ కరెక్ట్ గా సూట్ అయిందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది