Venu Swamy : జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన వేణు స్వామి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venu Swamy : జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన వేణు స్వామి…!

 Authored By anusha | The Telugu News | Updated on :9 January 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Venu Swamy : జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన వేణు స్వామి...!

Venu Swamy : ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు బాగా వినిపిస్తుంది.తనదైన శైలిలో సినీ, రాజకీయ ప్రముఖుల జ్యోతిష్యాలు చెబుతూ వేణు స్వామి బాగా పాపులర్ అయ్యారు.తాజాగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో దోషం ఉందని చెప్పి సంచలనం సృష్టించారు. ఎన్టీఆర్ జాతకం గురించి వేణు స్వామి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. గతంలో వేణు స్వామి ఎన్టీఆర్ తల్లి శాలిని తిరుమల లో కలిశారట. అక్కడ ఎన్టీఆర్ జాతకం గురించి తల్లి శాలినితో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఆ సమయంలో వేణు స్వామి చెప్పిన మాటలకు ఆమె ఆశ్చర్యపోయారట. ఎన్టీఆర్ పుట్టుక విషయంలో ఒక పెద్ద సమస్య ఉందని వేణు స్వామి తల్లి శాలినీకి వివరించారట.

అప్పటికే ఎన్టీఆర్ కు ఉన్న దోషం తెలిసిన తల్లి శాలిని అంత కరెక్ట్ గా కొడుకు జాతకం గురించి ఎలా చెప్పుతున్నారని ఆశ్చర్యపోయారట. ఆ సమస్య ఏంటో నాకు తెలుసు అని ఎన్టీఆర్ కు ఉన్న పుట్టుక దోషం గురించి వేణు స్వామి క్లియర్ గా చెప్పారట. ఎన్టీఆర్ కు ఉన్న దోషం గురించి పెద్ద ఎన్టీఆర్ తో పాటు శాలినీకి మాత్రమే తెలుసు అని, మూడో వ్యక్తికి ఎవరికి తెలియదు అని, అలాంటిది ఈ విషయం వేణు స్వామికి ఎలా తెలుసు అని ఎన్టీఆర్ తల్లి శాలిని ప్రశ్నించిందట. నాకు అన్ని విషయాలు తెలుసంటూ వేణు స్వామి సమాధానం ఇచ్చారట. అయితే ఆ సమస్య ఏంటనేది మాత్రం బయటికి చెప్పలేదు. జూనియర్ ఎన్టీఆర్ ది మఖా నక్షత్రం అని, జయలలిత ది కూడా అదే నక్షత్రమని వేణు స్వామి చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉందని, ఖచ్చితంగా 2030 వరకు ఆయన్ను రాజకీయాల్లోకి రానివ్వకుండా వాళ్ళ అమ్మగారు అడ్డుపడుతున్నారని వేణు స్వామి పేర్కొన్నారు. తాత గారికి రాజయోగం ఎలా పట్టిందో, మనవడు జూనియర్ ఎన్టీఆర్ కి కూడా అలాగే రాజయోగం పడుతుంది అని వేణు స్వామి చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ జాతకం లో కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే యోగ్యం ఉందని, కానీ ఆయనకు దోషం ఉందని వేణు స్వామి తెలిపారు. అయితే ఆ దోషం ఏంటనేది చెప్పకపోవడంతో నందమూరి అభిమానులు భయపడుతున్నారు

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది