Upasana : ఉపాసనకి జన్మలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి.. ఇది చూసి ఏడ్చేసిన రామ్ చరణ్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Upasana : ఉపాసనకి జన్మలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి.. ఇది చూసి ఏడ్చేసిన రామ్ చరణ్..!

Upasana : ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కొణిదెల ఉపాసన గురించే చర్చ. తను ఇప్పుడు గర్భిణీ. తను త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది అంటే అది మామూలు విషయం కాదు. ఇండస్ట్రీకే పెద్ద దిక్కు అయితే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి వారసుడు రాబోతున్నాడు. అందుకే ఈ హడావుడి అంతా. ఇటీవల ఉపాసన సీమంతం ఫంక్షన్ కూడా జరిగింది. ఈ వేడుకకు ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరయ్యారు. అందులో జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్, […]

 Authored By kranthi | The Telugu News | Updated on :4 May 2023,5:00 pm

Upasana : ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కొణిదెల ఉపాసన గురించే చర్చ. తను ఇప్పుడు గర్భిణీ. తను త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది అంటే అది మామూలు విషయం కాదు. ఇండస్ట్రీకే పెద్ద దిక్కు అయితే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి వారసుడు రాబోతున్నాడు. అందుకే ఈ హడావుడి అంతా. ఇటీవల ఉపాసన సీమంతం ఫంక్షన్ కూడా జరిగింది. ఈ వేడుకకు ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరయ్యారు. అందులో జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుసు కదా. ఆర్ఆర్ఆర్ సినిమా అప్పటి నుంచే కాదు..

Junior NTR wife lakshmi pranathi gives gift to upasana

Junior NTR wife lakshmi pranathi gives gift to upasana

అంతకుముందు నుంచి కూడా ఇద్దరూ మంచి ఫ్రెండ్సే. ఎన్టీఆర్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా రామ్ చరణ్ ఫ్యామిలీ వెళ్తూ ఉంటుంది. రామ్ చరణ్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా జూనియర్ ఎన్టీఆర్ వెళ్తుంటారు. ఆయన కూడా తన ఫ్యామిలీతో వెళ్తుంటారు. రామ్ చరణ్ ప్రతి పుట్టినరోజుకు జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా వెళ్తుంటారు. అలా.. ఉపాసన సీమంతం ఫంక్షన్ కు లక్ష్మీ ప్రణతి తన చేతులతో చేసిన స్వీట్స్ ను బహుమతిగా ఇచ్చిందట. లక్ష్మీ ప్రణతి స్వీట్స్ బాగా చేస్తుందట. తన చేత్తో చేసిన స్వీట్స్ అంటే ఉపాసనకు చాలా ఇష్టమట.

upasana comment on nandamuri Pranathi

upasana comment on nandamuri Pranathi

Upasana : లక్ష్మీ ప్రణతికి థాంక్స్ చెప్పిన ఉపాసన

అందుకే.. ఉపాసన కోసం ప్రత్యేకంగా స్పెషల్ గా స్వీట్స్ చేసి గిఫ్ట్ గా ఇచ్చిందట లక్ష్మీ ప్రణతి. తన మీద ప్రేమతో ఇంతలా కష్టపడి స్వీట్స్ తయారు చేసి తీసుకొచ్చిన లక్ష్మీ ప్రణతికి థాంక్స్ చెప్పిందట ఉపాసన. ప్రణతి పంపించిన గిఫ్ట్ బాక్స్ లో రెండు రకాల స్వీట్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ తో పాటు రకరకాల స్వీట్స్ ను తయారు చేసి పంపించిందట. లక్ష్మీ ప్రణతికి ఉపాసన అంటే ఎంత ఇష్టమో. ఎంతో కష్టపడి స్వీట్స్ అన్నీ తయారు చేసి పంపించింది అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది