K Viswanath : శంకరాభరణం సినిమాతో విశ్వనాథ్‌కి ఎంతో అనుబంధం.. సినిమా రిలీజ్ రోజునే కన్నుమూసిన కళాతపస్వి..!!
K Viswanath : ఇటీవల టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణంరాజ, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, దర్శకుడు సాగర్ ఇలా పలువురు ప్రముఖులు వరుసగా మృతి చెందారు. వారి మృతిని జీర్ణించుకోకముందే తాజాగా లెజండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ కన్నుమూసారు. గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. గత కొద్దీరోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య సమస్య తీవ్ర కావడంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఇండస్ట్రీకి ఏమైంది..
విశ్వనాథ్ పూర్తి పేరు ఆయన పూర్తి పేరు కాశినాథుని విశ్వనాథ్. ఆయన 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించగా, గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. అయితే సినిమాలపై అభిమానంతో చిత్రసీమలో అడుగుపెట్టిన విశ్వనాథ్ 1965లో దర్శకుడిగా మారి ఆత్మగౌరవం సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. ఆయన తెరకెక్కించిన సినిమాలలో శంకరాభరణం చాలా స్పెషల్. ‘శంకరాభరణం’ 1980 ఫిబ్రవరి 2న విడుదలై మెల్లగా మౌత్ టాక్ తో మంచి పేరు సంపాదించి, ఆ యేడాది అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలచింది. ఈ సినిమా 43ఏళ్లు పూర్తిచేసుకున్న రోజున విశ్వనాథ్ తుది శ్వాస విడిచారు.
విశ్వనాథ్ ను కళాతపస్విగా నిలిపిన ఫిబ్రవరి 2వ తేదీనే ఆయన తనువు చాలించారని తెలిసి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. డైరెక్టర్ గానే కాకుండా.. నటుడిగా కూడా తన సత్తా చాటుకున్నారు. తొలిసారి శుభసంకల్పం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన ఆయన ..వజ్రం, కలిసుందాంరా, నరసింహనాయుడు, సీమసింహం, నువ్వులేకనీను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్ వంటి పలు చిత్రాల్లో తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులని గెలుచుకున్నారు. విశ్వనాథ్‌కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఆయనకు దక్కింది. చివరి మూవీ శుభ ప్రదం. తెలుగు తెరకు ఇటువంటి సేవ మళ్లీ దొరకునా అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు