K. Viswanath : టాలీవుడ్ లో మరో విషాదం కె. విశ్వనాథ్ కన్నుమూత..!!
K. Viswanath ; తెలుగు చలనచిత్ర రంగంలో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు మరణించారు. ఈ ఏడాది జనవరిలో సీనియర్ హీరోయిన్ జమున మరణించడం తెలిసిందే. ఇలా ఉంటే ఫిబ్రవరి రెండవ తారీకు గురువారం రాత్రి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కే.విశ్వనాథ్ (92) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గురువారం ఆరోగ్యం మరింత క్షణించటంతో చికిత్స పొందుతూ రాత్రి తొమ్మిది శ్వాస విడిచారు. భారతీయ చలనచిత్ర రంగంలో… భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కథలుగా మలుచుకునే అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. తన సినిమాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మంచి పేరు తీసుకొచ్చారు. ఆయన తెరకెక్కించిన సినిమాలలో శంకరాభరణం కి జాతీయ పురస్కారం కూడా లభించింది. దర్శకుడిగా 50 సినిమాలకు పైగానే అయినా తీయడం జరిగింది.
1992లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అదే సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. ఆ తర్వాత 2016 వ సంవత్సరంలో కే.విశ్వనాధ్ కీ దాదే సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం జరిగింది. దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా పలు సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో వయసు రీత్యా వచ్చినా అనారోగ్యాలతో.. బాధపడుతూ ఫిబ్రవరి 2వ తారీకు గురువారం రాత్రి అపోలో ఆసుపత్రిలో మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కళాతపస్వి కే.విశ్వనాథ్ మరణ వార్త విని సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.