Kajal Agarwal and husband finally say good news fans in the New Year
Kajal Agarwal : టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ చెరిగిపోని ముద్ర వేసింది. దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగిన ఈ చందమామ.. దాదాపు అగ్ర హీరోలందరితోనూ నటించింది. అంతేకాకుండా లేడి ఓరియెంటెడ్ మూవీస్‌లోనూ నటించి తానేంటో ప్రూవ్ చేసుకుంది. తాజాగా చిరు ఆచార్య మూవీలో మెరిసింది ఈ బ్యూటీ.. కాజల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందని, తన అందం ఏ మాత్రం చెక్కుచెదరలేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను కాజల్ పెళ్లాడిన విషయం తెలిసిందే.
కాజల్ ప్రస్తుతం సినిమాలు తగ్గించి తన భర్తతో ఏకాంతంగా గడుపుతోంది. వెకేషన్స్‌కు వెళ్లి తన భర్తతో కలిసి దిగిన పిక్చర్స్‌ను సొషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. అయితే, ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. కాజల్ తల్లి కాబోతోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకే కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదని, ఇంతకుముందు ఓకే చెప్పిన నాగార్జున మూవీ ‘ది ఘోస్ట్’ మరో తమిళ మూవీని వదులుకుందని జోరుగా ప్రచారం సాగింది. కాగా, దీనిపై రీసెంట్‌గా కాజల్ స్పందించింది. అలాంటిది ఏమైనా ఉంటే తానే ప్రకటిస్తానని స్పష్టం చేసింది.
Kajal Agarwal and husband finally say good news fans in the New Year
న్యూ ఇయర్ వేడుక సందర్భంగా కాజల్ దంపతులు తమ లేటెస్ట్స్ పిక్స్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందులో గర్భవతి అని అర్థం వచ్చేలా ఏమోజీని జతచేశారు గౌతమ్ కిచ్లూ.. తాము ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న టైం వచ్చిందని.. 2022లో అది జరిగిందని గౌతమ్ పోస్టు పెట్టారు. ఎట్టకేలకు కాజల్ తల్లి కాబోతోందని, ఇన్ని రోజులుగా తనపై రూమర్స్‌కు ఈ దంపతులు చెక్ పెట్టారని అభిమానులు భావిస్తున్నారు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ సంతోషించడంతో పాటు కాజల్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
This website uses cookies.