
kajal aggarwal shares interesting note
Kajal Aggarwal : గత కొద్ది రోజులుగా కాజల్ అగర్వాల్ నిత్యం వార్తలలో నిలుస్తూ వస్తుంది. ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి కాజల్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె మాతృత్వ అనుభూతిని ఆస్వాధిస్తోంది. అంతేకాదు ఈ ఆనందాన్ని తన ఫ్యాన్స్, ఫాలోవర్స్‌తో పంచుకుంటూ బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఇలా ప్రతి క్షణాన్ని సంతోషంగా గడుపుతున్న కాజల్ తాజాగా భర్త గౌతమ్ కిచ్లుపై ఎమోషనల్ నోట్ రాసింది. ఈమేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేస్తూ భర్తపై ప్రశంసలు కురిపించింది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రెండేండ్ల కిందనే ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే గతేడాది చివరల్లో కాజల్ ప్రెగ్నెన్సీ ని తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది.కాజల్ తన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు అన్ని విధాలా సిద్ధమవుతోంది. ఇందుకు స్పెషల్ వర్క్ అవుట్స్, స్ట్రెచింగ్ ఎక్సర్ సైజులు కూడా చేస్తోంది. పౌష్టికాహారం తీసుకుంటూ హెల్త్ ను కాపాడుకుంటోంది. తాజాగా కాజల్ ఓ నోట్ రాయగా, ‘ఒక అమ్మాయి అడగగలిగే గొప్ప భర్త మరియు కాబోయే తండ్రి అయినందుకు ధన్యవాదాలు. చాలా నిస్వార్థంగా ఉన్నందుకు, నాతో పాటు ప్రతి ఉదయం, రాత్రి మేల్కొన్నందుకు… నేను ప్రశాంతంగా నిద్రించేందుకు వారాలపాటు నాతో మంచం మీదే విడిది చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
kajal aggarwal shares interesting note
ప్రతి రోజు రాత్రి నాతో పాటు మెలకువగా ఉండి.. మార్నింగ్ సిక్‌నెస్‌లో కూడా ఎలాంటి విసుగు లేకుండా నన్ను కంఫర్ట్ చేశావు. ఆస్వస్థతగా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్లకు సమాచారం ఇచ్చావు. అసౌకర్యంగా అనిపిస్తే నా పుట్టింటికి తీసుకెళ్లావు. ఇలా ప్రతి విషయంలో నా పక్కనే ఉన్నావు. నేను ఇబ్బంది పడకుండా నాకు అన్ని సౌకర్యాలను అందించావు’ అంటూ రాసుకొచ్చింది. గత 8 నెలలుగా నీలో ఓ గొప్ప తండ్రిని చూస్తున్నాను. పుట్టబోయే బిడ్డను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, అప్పుడే ఆ బిడ్డ సంరక్షణ కోసం నువ్వు ఏం చేయాలో అది చేశావు. ఇలా నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. పరిమితులు లేని తండ్రి ప్రేమను మన బిడ్డ పొందబోతున్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. మన బిడ్డకు నువ్వు ఎప్పుడూ ఒక ప్రేరణగా ఉండాలని కోరుకుంటున్నా’ అని పేర్కొంది కాజల్.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.