Hyper Aadi : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన చాలా స్పెషల్ కమెడియన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ కి కొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చిన హైపర్ ఆది అద్భుతమైన కామెడీ చేస్తాడంటూ ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా సినిమాల్లో కూడా ఆయన కామెడీ చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. గత రెండు సంవత్సరాలుగా వరుసగా సినిమా ల్లో నటిస్తున్నాడు. హీరోగా కూడా ఆఫర్లు వస్తున్నా వాటిని కాదని కమెడియన్గా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఆది ప్రస్తుతం భారీ మొత్తం లో పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడని సమాచారం అందుతోంది.
ఇటీవల ఒక చిన్న నిర్మాత తన సినిమా కోసం హైపర్ ఆది డేట్లు అడిగేందుకు వెళ్లాడట. 8 నుండి 10 రోజుల డేట్లు అడిగిన నిర్మాతకు హైపర్ ఆది భారీ పారితోషికం డిమాండ్ చేసి షాక్ ఇచ్చాడని సమాచారం అందుతోంది. పది రోజుల రేట్ల కు ఏకంగా పాతిక లక్షల రూపాయల పారితోషకాన్ని హైపర్ ఆది అడిగాడని నిర్మాత అన్నాడు. రోజుకు రెండు లక్షల చొప్పున ఇస్తానన్న కూడా అందుకు నిరాకరించినట్లు గా చెప్పుకొచ్చాడు. తన సినిమాలో నటిస్తున్న హీరో కూడా అంత పారితోషికం లేదని దాంతో చేసేది ఏం లేక హైపర్ ఆది ని కాకుండా మరో కమెడియన్ తో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా సదరు నిర్మాత ఆఫ్ ది రికార్డ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇలా ఎంతో మంది నిర్మాతలకు తన పారితోషికంతో హైపర్ ఆది షాక్ ఇస్తున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిజానికి హైపర్ ఆది ప్రస్తుతం స్టార్ గా కొనసాగుతున్నాడు. ఆయన పారితోషికం రోజు కు 5 లక్షల అయినా కూడా పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. అలాంటిది రెండున్నర లక్షలకు కూడా ఒప్పుకుంటున్నాడు. నిర్మాత ఆ పారితోషికాన్ని కూడా ఎక్కువ అనడం అవివేకం అంటూ కొందరు హైపర్ ఆది అభిమానుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా ను బట్టి.. స్టార్ ని బట్టి… వచ్చే అవకాశాన్ని బట్టి… పారితోషికం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని మరి కొందరు వ్యక్తం చేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా హైపర్ ఆది కూడా తనకు క్రేజ్ ఉన్నది కనుక అధిక పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ఇందులో తప్పేం లేదు. ఆయన మాత్రమే ఇలా చేయడం లేదు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.