Bhagavanth Kesari Movie Review : బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Bhagavanth Kesari Movie Review : అసలైన దసరా జాతర ఇప్పుడే మొదలైంది. నట సింహం నందమూరి బాలకృష్ణ Balakrishna హీరోగా, అనిల్ రావిపూడి Anil Ravipudi దర్శకత్వంలో వచ్చిన మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా దసరా కానుకగా ఇవాళ విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందే ప్రివ్యూలు, ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా విడుదల కాకముందే మూవీ బ్లాక్ బస్టర్ అంటూ రివ్యూలు వచ్చాయి. ఇండస్ట్రీలో కొందరు ప్రముఖుల కోసం కూడా ప్రత్యేకమైన […]
Bhagavanth Kesari Movie Review : అసలైన దసరా జాతర ఇప్పుడే మొదలైంది. నట సింహం నందమూరి బాలకృష్ణ Balakrishna హీరోగా, అనిల్ రావిపూడి Anil Ravipudi దర్శకత్వంలో వచ్చిన మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా దసరా కానుకగా ఇవాళ విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందే ప్రివ్యూలు, ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా విడుదల కాకముందే మూవీ బ్లాక్ బస్టర్ అంటూ రివ్యూలు వచ్చాయి. ఇండస్ట్రీలో కొందరు ప్రముఖుల కోసం కూడా ప్రత్యేకమైన షోలు వేశారట. ఆ షోను చూసిన సినీ ప్రముఖులు ఇది మామూలు సినిమా కాదంటూ బాలయ్య బాబును తెగ పొగిడేశారు. అందులోనూ ఈ సినిమాలో లేటెస్ట్ ట్రెండ్ అయిన శ్రీలీల sreeleela నటించడంతో ఈ సినిమాకు హైప్ కాస్త ఎక్కువైంది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అన్నీ అంచనాలకు మించి ఉండటంతో ఇక సినిమా మీద మామూలు ఎక్స్‌పెక్టేషన్స్ లేవు.
ఇది ఒకరకంగా చెప్పాలంటే త్రిపుల్ దమాకా అని చెప్పుకోవాలి. ఓవైపు బాలయ్య.. మరోవైపు అనిల్ రావిపూడి.. ఇంకోవైపు శ్రీలీల. ఈ ముగ్గురి కాంబోలో మూవీ అంటే ఆమాత్రం ఉంటుంది కదా. అనిల్ రావిపూడి సినిమాలంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక పటాస్.. ఒక ఎఫ్2, ఒక ఎఫ్3, ఒక సరిలేరు నీకెవ్వరు ఇలా తన సినిమాలన్నీ ఒక ఫన్ రైడ్ లా ఉంటాయి. మూడు గంటలు థియేటర్ లో ప్రేక్షకుడు రిలాక్స్ అయి వచ్చేలా తన సినిమాలు ఉంటాయి. ఇక వాటన్నింటికీ తోపు ఈ సినిమా. ఎందుకంటే.. ఇది పవర్ ఫుల్ హీరో బాలయ్య నటించిన సినిమా కావడంతో ఇక బొమ్మ బ్లాక్ బస్టర్ అవడం కాదు.. థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి అని ప్రేక్షకులు అంటున్నారు. బాలయ్య బాబు వీరత్వాన్ని, మార్క్ డైరెక్షన్ ను ఈ సినిమాలో అనిల్ మరోసారి చూపించారు. మొత్తానికి ఒక మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని అనిల్ తెరకెక్కించారు. అందులోనూ దసరా బరిలోకి ఈ సినిమా వచ్చిందంటే ఈసారి దసరాకి థియేటర్ల వద్ద జాతరే ఇక. దసరా జాతర ఇప్పుడే మొదలైందా అన్నట్టుగా థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు.
Bhagavanth Kesari Movie Review : ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను మెప్పించిందా?
సినిమా పేరు : భగవంత్ కేసరి
నటీనటులు : బాలకృష్ణ, కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు
డైరెక్టర్ : అనిల్ రావిపూడి
నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్ థమన్
రిలీజ్ డేట్ : 19 అక్టోబర్ 2023
రన్ టైమ్ : 2 గంటల 44 నిమిషాలు
తెలంగాణకు చెందిన వ్యక్తి భగవంత్ కేసరి(బాలకృష్ణ). నేలకొండపల్లి ఆయన ఊరు. అక్కడే గిరిజన ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. చాలా మొండివాడు. తన వాళ్లకు ఏదైనా అయితే మాత్రం అస్సలు తట్టుకోలేడు. తన సొంత వాళ్ల కోసం ఎంత దూరం అయినా వెళ్లే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మరోవైపు తన కూతురును ఆర్మీకి పంపించాలనేది భగవంత్ కేసరి కల. కానీ.. తన కూతురుకు మాత్రం ఆర్మీలోకి వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు. తన కూతురుగా శ్రీలీల(విజ్జి పాప) నటించింది. మరోవైపు తన కూతురు విజ్జి పాప వల్ల కొందరు రౌడీలు, రాజకీయ నాయకులతో భగవంత్ కేసరి గొడవ పెట్టుకుంటాడు. అసలు రాజకీయ నాయకులకు, రౌడీలకు తన కూతురుకు ఏంటి సంబంధం? చివరకు తన కూతురు ఆర్మీకి వెళ్లిందా? ఆ రౌడీల బారి నుంచి తన కూతురును బాలకృష్ణ ఎలా తప్పించాడు? తన భార్యగా నటించిన కాజల్ అగర్వాల్(కాత్యాయిని) ఎవరు? ఆమెకు, కేసరికి ఎలా పరిచయం ఏర్పడింది? అనేది తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.
Bhagavanth Kesari Movie Review : విశ్లేషణ
ఇప్పటి వరకు బాలయ్య నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తు. ఈ సినిమా మరో ఎత్తు. అవును.. ఈ సినిమాలో బాలయ్య బాబును సరికొత్తగా చూపించాడు అనిల్ రావిపూడి. అలాగే.. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి తీసిన సినిమాలు ఒక ఎత్తు.. ఈ సినిమా మరో ఎత్తు. అవును.. కామెడీ మాత్రమే కాదు.. ఎమోషనల్, డ్రామా, యాక్షన్, లవ్, ఇలా అన్నీ కలిపి మిక్స్ చేసి మరీ ఈ సినిమాను తెరకెక్కించాడు అనిల్. అసలు బాలయ్యను ఎలా తన అభిమానులు వెండి తెర మీద చూడాలని అనుకున్నారో డిటో దించేశాడు అనిల్. ఇదంతా ఒక ఎత్తు అయితే బాలయ్య బాబు నటన మరో ఎత్తు. అసలు తన విశ్వరూపం చూపించాడు బాలయ్య. బాలయ్య యాక్టివ్ వేరే లేవల్. ఇరగదీశాడు.. ఈ వయసులో బాలయ్య ఉత్సాహం, ఆ ఎనర్జీ మామూలుగా ఉండదు. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద నడిపించాడు బాలయ్య.
ఇక… తన కూతురుగా నటించిన శ్రీలీల కూడా అంతే. ఇరగదీసేసింది. తన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. మంచి పాత్రలో నటించింది. చాలా సహజంగా శ్రీలీల నటించింది. తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని, వాళ్ల వాత్సల్యాన్ని అనిల్ రావిపూడి చక్కగా చూపించాడు. ఇక.. బాలయ్య బాబు డైలాగ్స్ అయితే అదుర్స్ అని చెప్పుకోవచ్చు. థియేటర్లలో బాంబుల్లా పేలాయి అని చెప్పుకోవచ్చు. నిజానికి బాలయ్య బాబు అంటేనే ఎలివేషన్స్ కు మారుపేరు. డైలాగ్స్ కు మారుపేరు. ఈ సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్స్ ను బాలయ్య బాబుతో అనిల్ చెప్పించాడు. అది కూడా తెలంగాణ యాసలో. ఆ యాసలో బాలయ్య బాబు తొలిసారి ఇరగదీశాడు అనే చెప్పుకోవాలి. పాత్ర తక్కువే అయినా బాలయ్య భార్యగా కాజల్ అగర్వాల్ అదరగొట్టేసింది.
ప్లస్ పాయింట్స్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
బాలయ్య నటన, డైలాగ్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
సెంటిమెంట్ సీన్స్
రొటీన్ స్టోరీ
దితెలుగున్యూస్ రేటింగ్ : 2.75/5