Kalki 16 Days Collections : కల్కి 16వ రోజు కలెక్షన్స్.. తెలుగు కన్నా అక్కడే ఎక్కువ.. ఆ సినిమాల ఎఫెక్ట్ లేడు కానీ..?
Kalki 16 Days Collections : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా ప్రపంచవ్యప్తంగా సూపర్ హిట్ టాక్ తో దూసుకెల్తుంది. సినిమా నిన్నటితో రెండు వారాలు పూర్తి చేసుకుని సక్సెస్ ఫుల్ గా 3వ వారం లోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో విజువల్స్ అన్నీ మళ్లీ మళ్లీ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని థియేటర్ బాట పట్టేలా చేసింది. ఇక ఈ సినిమా ప్రభాస్ ఖాతాలో మరో 1000 కోట్ల సినిమాగా నిలిచింది.బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన కల్కి 2898 ఏడి సినిమా 1000 కోట్లు అందుకుంది. ఐతే ఈ సినిమా 16వ రోజు కూడా భారీ వసూళ్లను రాబట్టింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం కల్కి 16వ రోజు కూడా ఇండియా మొత్తం మీద 6.5 కోట్ల రూపాయలను వసూళు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్లు. తమిళంలో 50 లక్షలు, హిందీలో 3.2 కోట్లు రాబట్టింది. కన్నడలో 60 లక్షలు మలయాళంలో 40 లక్షలు రాబట్టింది.
ఇక ఓవరాల్ గా కల్కి కలెక్షన్స్ ఇప్పటివరకు ఏరియా వైజ్ ఎంత వచ్చాయో చూస్తే.. తెలుగు రాష్ట్రాలో 255 కోట్లు, హిందీ వెర్షన్ 233 కోట్లు రాబట్టగా తమిళంలో 32 కోట్లు రాబట్టింది. మలయాళంలో కూడా కల్కి 26 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. టోటల్ గా 646.5 కోట్ల షేర్ రాబట్టింది. ఐతే ఈ సినిమా ఓవర్సీస్ లో భారీ వసూళ్లను సాధించింది. సినిమా ఇప్పటికే అక్కడ 20 మిలియన్లకు దగ్గరగా ఉన్నట్టు తెలుస్తుంది.
Kalki 16 Days Collections : కల్కి 16వ రోజు కలెక్షన్స్.. తెలుగు కన్నా అక్కడే ఎక్కువ.. ఆ సినిమాల ఎఫెక్ట్ లేడు కానీ..?
ప్రభాస్ కల్కి సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేశాడు. కల్కి చూసిన రెబల్ ఫ్యాన్స్ ఇంతకన్నా గొప్ప సినిమా ప్రభాస్ తో ఎవరు తీయలేరని చెప్పుకుంటున్నారు. ఐతే కల్కి 1 తోనే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిన ప్రభాస్ కల్కి 2 తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ఐతే ఈ వీకెండ్ రిలీజైన భారతీయుడు 2, అక్షయ్ కుమార్ సర్ఫిరా సినిమాలు అంత గొప్ప టాక్ ఏమి తెచ్చుకోలేదు. కాబట్టి 3వ వారం లో కూడా కల్కినే బాక్సాఫీస్ టాప్ గా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.