kalki Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్ షోస్ పడగా, మూవీకి సంబంధించిన రివ్యూలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి.నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ ముందు నుంచి భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. కలి యుగాంతంలో అవతరించే కల్కి అవతారాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు అంతేకాకుండా మొత్తం మూడు కొత్త ప్రపంచాలను సృష్టించినట్లు చెప్పుకొచ్చారు నాగ్. రూ.600 కోట్ల బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. నాలుగున్నరేళ్ల నిరీక్షణ తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్స్‌లోకి రావడంతో ఫ్యాన్స్ మూవీని చూసి ఫుల్ ఖుష్ అవుతున్నారు.
కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంట్రీ 20 నిమిషాల సమయంలో ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పారు. భైరవ (ప్రభాస్) ఎంట్రీకి అందరూ అరుపులు పెట్టడం ఖాయమని తెలిపారు. సాధారణంగా తాను థియేటర్లలో కేకలు పెట్టనని, కానీ భైరవ ఎంట్రీకి అరుస్తానని అన్నారు.ఆయన చెప్పినట్టుగానే ప్రభాస్ ఎంట్రీకి ప్రతి ఒక్కరు కేకలు పెడుతున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా క్లైమాక్స్ ప్రభాస్‍కు కూడా సర్‌ప్రైజ్‍గా ఉంటుందని నాగ్ అశ్విన్ చెప్పారు. క్లైమాక్స్‌లో వచ్చే పాట ఆల్‍టైమ్ ఫేవరెట్‍గా మారుతుందని తెలిపారు. ఈ మూవీ క్లైమాక్స్‌లో ఓ భారీ ట్విస్ట్ ఉంటుందని కొంతకాలంగా రూమర్లు వస్తుండగా.. ఇప్పుడు నాగీ కూడా అలానే చెప్పారు.
ఫస్ట్ హాఫ్ లో పాత్రలని పరిచయం చేస్తూ నెమ్మదిగా కథని నడిపించిన నాగ్ అశ్విన్ ఇంటర్వెల్ బ్లాక్ లో ఒక్కసారిగా విస్ఫోటనం సృష్టించాడు. ఫస్ట్ హాఫ్ లో విజువల్స్ అయితే ఇండియన్ సినిమాలో ఇంతవరకు చూడని విధంగా ఉన్నాయి. అదే విధంగా నాగ్ అశ్విన్ సెట్ చేసిన సెటప్ కూడా చాలా కొత్తగా ఉంది.స్టోరీ లైన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ నాగ్ అశ్విన్ స్క్రీన్ ప్లే చాలా స్లో. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ కి తక్కువ స్క్రీన్ స్పేస్ దొరకడం కూడా ఒక మైనస్. సెకండ్ హాఫ్ లో యాక్షన్ సన్నివేశాలు ప్రధానంగా ఉంటాయి. డ్రామా నడిపిస్తూనే యాక్షన్ కూడా కళ్ళు చెదిరేలా ఉంటుంది. దీపికా పదుకొనె ఇన్వాల్వ్ అయిన యాక్షన్ సీన్ కూడా సెకండ్ హాఫ్ లో ఉంది. ఇక క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా స్వరూపాన్ని క్లైమాక్స్ మార్చేసింది అని చెప్పొచ్చు. గూస్ బంప్స్ తెప్పించే విధంగా నాగ్ అశ్విన్ క్లైమాక్స్ ని సిద్ధం చేశారు.
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
This website uses cookies.