kalki Movie : క‌ల్కి క్లైమాక్స్ ఊహ‌కంద‌ని విధంగా ఉంద‌ట‌.. ఇక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఊచ‌కోతే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

kalki Movie : క‌ల్కి క్లైమాక్స్ ఊహ‌కంద‌ని విధంగా ఉంద‌ట‌.. ఇక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఊచ‌కోతే..!

kalki Movie : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన తాజా చిత్రం క‌ల్కి. ఇప్ప‌టికే ఈ మూవీ ప్రీమియ‌ర్ షోస్ ప‌డగా, మూవీకి సంబంధించిన రివ్యూలు ఒక్కొక్క‌టిగా వ‌స్తున్నాయి.నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ ముందు నుంచి భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. కలి యుగాంతంలో అవతరించే కల్కి అవతారాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు అంతేకాకుండా మొత్తం మూడు కొత్త ప్రపంచాలను సృష్టించినట్లు చెప్పుకొచ్చారు నాగ్. రూ.600 కోట్ల బడ్జెట్ తో భారీ […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 June 2024,10:00 am

kalki Movie : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన తాజా చిత్రం క‌ల్కి. ఇప్ప‌టికే ఈ మూవీ ప్రీమియ‌ర్ షోస్ ప‌డగా, మూవీకి సంబంధించిన రివ్యూలు ఒక్కొక్క‌టిగా వ‌స్తున్నాయి.నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ ముందు నుంచి భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. కలి యుగాంతంలో అవతరించే కల్కి అవతారాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు అంతేకాకుండా మొత్తం మూడు కొత్త ప్రపంచాలను సృష్టించినట్లు చెప్పుకొచ్చారు నాగ్. రూ.600 కోట్ల బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. నాలుగున్నరేళ్ల నిరీక్షణ తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్స్‌లోకి రావ‌డంతో ఫ్యాన్స్ మూవీని చూసి ఫుల్ ఖుష్ అవుతున్నారు.

kalki Movie క్లైమాక్స్ కేక‌..

కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంట్రీ 20 నిమిషాల సమయంలో ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పారు. భైరవ (ప్రభాస్) ఎంట్రీకి అందరూ అరుపులు పెట్టడం ఖాయమని తెలిపారు. సాధారణంగా తాను థియేటర్లలో కేకలు పెట్టనని, కానీ భైరవ ఎంట్రీకి అరుస్తానని అన్నారు.ఆయ‌న చెప్పిన‌ట్టుగానే ప్ర‌భాస్ ఎంట్రీకి ప్ర‌తి ఒక్క‌రు కేక‌లు పెడుతున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా క్లైమాక్స్ ప్రభాస్‍కు కూడా సర్‌ప్రైజ్‍గా ఉంటుందని నాగ్ అశ్విన్ చెప్పారు. క్లైమాక్స్‌లో వచ్చే పాట ఆల్‍టైమ్ ఫేవరెట్‍గా మారుతుందని తెలిపారు. ఈ మూవీ క్లైమాక్స్‌లో ఓ భారీ ట్విస్ట్ ఉంటుందని కొంతకాలంగా రూమర్లు వస్తుండగా.. ఇప్పుడు నాగీ కూడా అలానే చెప్పారు.

kalki Movie క‌ల్కి క్లైమాక్స్ ఊహ‌కంద‌ని విధంగా ఉంద‌ట‌ ఇక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఊచ‌కోతే

kalki Movie : క‌ల్కి క్లైమాక్స్ ఊహ‌కంద‌ని విధంగా ఉంద‌ట‌.. ఇక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఊచ‌కోతే..!

ఫస్ట్ హాఫ్ లో పాత్రలని పరిచయం చేస్తూ నెమ్మదిగా కథని నడిపించిన నాగ్ అశ్విన్ ఇంటర్వెల్ బ్లాక్ లో ఒక్కసారిగా విస్ఫోటనం సృష్టించాడు. ఫస్ట్ హాఫ్ లో విజువల్స్ అయితే ఇండియన్ సినిమాలో ఇంతవరకు చూడని విధంగా ఉన్నాయి. అదే విధంగా నాగ్ అశ్విన్ సెట్ చేసిన సెటప్ కూడా చాలా కొత్తగా ఉంది.స్టోరీ లైన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ నాగ్ అశ్విన్ స్క్రీన్ ప్లే చాలా స్లో. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ కి తక్కువ స్క్రీన్ స్పేస్ దొరకడం కూడా ఒక మైనస్. సెకండ్ హాఫ్ లో యాక్షన్ సన్నివేశాలు ప్రధానంగా ఉంటాయి. డ్రామా నడిపిస్తూనే యాక్షన్ కూడా కళ్ళు చెదిరేలా ఉంటుంది. దీపికా పదుకొనె ఇన్వాల్వ్ అయిన యాక్షన్ సీన్ కూడా సెకండ్ హాఫ్ లో ఉంది. ఇక క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా స్వరూపాన్ని క్లైమాక్స్ మార్చేసింది అని చెప్పొచ్చు. గూస్ బంప్స్ తెప్పించే విధంగా నాగ్ అశ్విన్ క్లైమాక్స్ ని సిద్ధం చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది