kalyaan dhev post viral in social media
Sreeja Kalyan Dhev : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ డైవోర్స్ గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు కారణం శ్రీజనే. ఆమె ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ నేమ్ ‘శ్రీజ కల్యాణ్’.. ఉండగా దానిని ‘శ్రీజ కొణిదెల’గా మార్చేసింది. దాంతో వీరిరువురు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. అయితే, ఈ విషయమై మెగా ఫ్యామిలీ మెంబర్స్ కాని శ్రీజ కాని కల్యాణ్ దేవ్ కాని ఇప్పటి వరకు ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే ఇవ్వలేదు.శ్రీజ ఇటీవల తన అన్నయ్య రామ్ చరణ్ తేజ్ తో కలిసి ముంబైకి హాలీ డే ట్రిప్‌నకు వెళ్లింది.
అక్కడ దిగిన ఫొటోలు ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది కూడా. కాగా, అక్కడ కల్యాణ్ దేవ్ ఎందుకు లేడు? అని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. ఈ సంగతులు అలా ఉంచితే.. తాజాగా కల్యాణ్ దేవ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. తాను ఎంతో సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. ఎన్నో ఆశలతో, ప్రేమతో ఆనందంగా ముందుకు సాగుతున్నానని చెప్పాడు. ఇదంత తన బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ గురించి రాసుకొచ్చాడు. ఈయితే, ఈ పోస్టును కల్యాణ్ దేవ్ క్రిస్మస్ రోజున పోస్ట్ చేశాడు. తాజాగా మళ్లీ రీ పోస్ట్ చేశాడు.
kalyaan dhev post viral in social media
అలా మొత్తంగా కల్యాణ్ దేవ్ తన పక్కన శ్రీజ లేకపోయినప్పటికీ తాను సంతోషంగా ఉన్నానని చెప్పకనే చెప్తున్నాడా? అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. శ్రీజ ముంబైలో రామ్ చరణ్ తో ఉండగా, కల్యాణ్ దేవ్ తన నెక్స్ట్ ఫిల్మ్ షూట్ లో బిజీగా ఉన్నాడని ఈ సందర్భంగా అర్థమవుతోంది. ఇకపోతే కల్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన ‘సూపర్ మచ్చి’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఫ్లాప్ అయింది. ‘విజేత’ చిత్రం కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా, కల్యాణ్ దేవ్ ప్రస్తుతం ‘కిన్నెరసాని’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు.
Palm Candy Benefits | ప్రాచీన కాలం నుంచీ మన వంటగదిలో ఒక ముఖ్యమైన స్థానం పొందిన తాటి బెల్లం,…
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
This website uses cookies.