kalyan dev beautiful video with daughter
Kalyan Dev : ఇటీవల సెలబ్రిటీలు చిన్న చిన్న కారణాలతో విడిపోతున్నారు. సమంత,నాగ చైతన్య తర్వాత చాలా మంది పెళ్లి పెటాకులు అయింది. శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిపోయినట్లు కొన్ని నెలలుగా కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయంపై అటు మెగా ఫ్యామిలీ నుండి కానీ కళ్యాణ్ దేవ్ నుండి కానీ ఎటువంటి ప్రకటన రాలేదు. శ్రీజ, కళ్యాణ్ దేవ్ లు విడాకుల వార్తలను ఖండించడం లేదా సమర్ధించడం చేయలేదు. మొదటగా శ్రీజ తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించింది. అలాగే ఆయన్ని అన్ ఫాలో చేసింది. దీంతో శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకుల రూమర్స్ బయలుదేరాయి. అలాగే కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీతో కళ్యాణ్ దేవ్ కనిపించడం లేదు.ఆ ఫ్యామిలీ గెట్ టు గెదర్ పార్టీలకు కళ్యాణ్ వెళ్లడం లేదు.
శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమవుతుందని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. త్వరలోనే ఆమె ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి. ఇక కళ్యాణ్ దేవ్ కూడా ఎక్కడ కనిపించకపోవడం.. స్పందించకపోవడం ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసాయి. అయితే రీసెంట్గా కళ్యాణ్ దేవ్ శ్రీజ కుమార్తె నవిష్క ఒక్కసారిగా తన తండ్రి వద్దకు వెళ్ళింది.ఈ క్రమంలోనే కళ్యాణ్ కూతురుతో కలిసి ఉన్న ఫోటోలను, వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కూతురితో ఆడుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు కళ్యాణ్ దేవ్. ఇది చూసి శ్రీజ, కళ్యాణ్ దేవ్ కలిసిపోయారా అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం కేవలం తన కూతురు తన తండ్రి వద్దకు వెళ్లిందా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.
kalyan dev beautiful video with daughter
ఇకపోతే భార్య భర్తలు ఇద్దరూ విడాకులతో విడిపోయిన పిల్లలను చూసుకునే బాధ్యత ఇద్దరికీ ఉంటుందని కోర్టు అనుమతితో కళ్యాణ్ దేవ్ తన కూతురిని కలిసి ఉండవచ్చు అని కూడా కొందరు అభిప్రాయ పడుతున్నారు. విజేత అనే సినిమాతో ఆయన గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా హిట్ కాకపోయినా నటుడిగా కళ్యాణ్ దేవ్ కి మంచి పేరు తీసుకొచ్చింది. మెగా కుటుంబం కావడంతో ఆయనకు వరుస సినీ అవకాశాలు లభించాయి. అలాగే ఆయన సూపర్ మచ్చి, కిన్నెరసాని వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే కిన్నెరసాని సినిమా నేరుగా జీ 5 ద్వారా విడుదలైంది, సూపర్ మచ్చీ సినిమా సంక్రాంతికి ధియేటర్లలో విడుదలైంది కానీ ప్రమోషన్స్ కి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.