nirmala sitharaman urges for 8th cpc about da rate
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. కరవు భత్యం మరోసారి పెరగబోతోంది. ఆగస్టు నెలలో జరిగే కేబినెట్ భేటీలో కీలకమైన ప్రకటన రానుంది. ఉద్యోగుల జీతం ఏకంగా 40 వేల వరకూ పెరగనుంది. ఏఐసీపీఐ గణాంకాల ప్రకారం డీఏ ఈసారి 5-6 శాతం పెరగడం ఖాయమని తెలుస్తోంది. తుది ప్రకటన మాత్రం ఆగస్టు 3వ తేదీన జరగనున్న కేబినెట్ భేటీ అనంతరం వెలువడనుంది. కేబినెట్ భేటీ తరువాత కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయనుందని సమాచారం. ఈ భేటీలో డీఏతో పాటు ఉద్యోగుల జీతం విషయంలో కూడా అప్‌డేట్ రానుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు 18 నెలల డీఏ ఎరియర్స్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.
రెండో డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) సవరణను జూలై 31 (నేడు)లోపు ప్రకటిస్తారని మునుపటి నివేదికలు సూచించగా, తాజా నివేదికల ప్రకారం ఆగస్టు 3 నాటికి ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు. 5 లేదా 6 శాతం డీఏ పెంపు ఉంటుందని ముందుగా ప్రచారం జరిగింది. కాని 4 శాతం డీఏ మాత్రమే పెరగనుందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అంతకుముందు సంవత్సరం ప్రారంభంలో 3 శాతం డీఏ పెంపు లభించింది . అంతకు ముందు సంవత్సరం 2020 జనవరి , జూన్ 2020, జనవరి 2021 కరవు భత్యాన్ని కరోనా మహమ్మారి నేపధ్యంలో నిలిపివేశారు. ఆ తరువాత ఆమోదముద్ర లభించినా..ఇప్పటికీ ఆ 18 నెలల డీఏ క్లియర్ కాలేదు.
7th Pay Commission 4 da hike 18 months arrears coming soon
డీఏలో 4 శాతం పెంపుదల రూ. 18,000 బేసిక్ జీతం కోసం సంవత్సరానికి రూ. 8,640 మరియు రూ. 56,000 బేసిక్ జీతం కోసం సంవత్సరానికి రూ. 27,312 పెరుగుతుంది. ప్రస్తుతం, రూ.18,000 బేసిక్ జీతం కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 34 శాతం అంటే నెలకు రూ.6120 డీఏ లభిస్తుంది. ఈ మొత్తం నెలకు రూ. 6,840కి పెరిగే అవకాశం ఉంది, దీని ప్రకారం నెలవారీ డీఏ రూ.720 మరియు సంవత్సరానికి రూ.8,640 పెరుగుతుంది. రూ. 56,000 బేసిక్ జీతం కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రస్తుతం నెలవారీగా అందుతున్న డీఏ రూ.19,346 కాగా, డీఏ పెంపు నెలకు రూ.2,276 పెరిగి రూ.21,622కి చేరుకుంటుంది.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.