Kalyan Ram : నందమూరి హరికృష్ణ పాత్ర చేయనున్న బాలకృష్ణ .. క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kalyan Ram : నందమూరి హరికృష్ణ పాత్ర చేయనున్న బాలకృష్ణ .. క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..!

 Authored By anusha | The Telugu News | Updated on :18 December 2023,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Kalyan Ram : నందమూరి హరికృష్ణ పాత్ర చేయనున్న బాలకృష్ణ .. క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..!

Kalyan Ram : గతేడాది ‘ బింబిసార ‘ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ, హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా, కొత్త కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ, వాళ్లందరికీ తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా అవకాశమిస్తూ ముందుకు దూసుకెళుతున్నారు. ‘ బింబిసార ‘ తర్వాత చేసిన ‘ అమిగోస్ ‘ సినిమా అంతగా హిట్ అవ్వలేదు. ఇప్పుడు ‘ డెవిల్ ‘ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ఈనెల 29న విడుదల కాబోతుంది. సలార్ సినిమా విడుదలైన వారం తర్వాత డెవిల్ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను కూడా ఇటీవల విడుదల చేశారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పైన ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమా తర్వాత పవన్ సాథినేని అనే డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా చాలా స్పెషల్ అని తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన కథను గురించి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ఒక లెజెండరీ పాత్ర కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఆ పాత్ర ఎవరో కాదు నందమూరి హరికృష్ణ. గతంలో పవన్ సాథినేని ‘ ప్రేమ ఇష్క్ కాదల్ ‘ సినిమాను దర్శకత్వ వహించారు. దేవ అనే వెబ్ సిరీస్ కూడా చేశారు. కళ్యాణ్ రామ్ తో గతంలోనే అతను సినిమా చేయాల్సి ఉందట. కొన్ని కారణాల వలన ఆలస్యం కావడంతో ఇప్పుడు ఈ సినిమా ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. డెవిల్ తర్వాత ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో లెజెండరీ పాత్ర అయినా హరికృష్ణతో ఈ సినిమా చేయాలని డైరెక్టర్ ఎప్పుడు అనుకున్నారట. కానీ ఆయన మరణించడంతో ఈ కథ అక్కడే ఆగిపోయిందట. అయితే ఇప్పుడు ఆ పాత్ర ఎవరు పోషిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమా మల్టీ స్టారర్ గా తెరకెక్కబోతుంది. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో తీసుకోవాలని అనుకుంటున్నారట. కళ్యాణ్ రామ్, విజయ్ సేతుపతి మల్టీ స్టారర్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. పాన్ ఇండియా రేంజ్ లో ఈ కంటెంట్ ఉండబోతుందని తెలుస్తుంది. అయితే హరికృష్ణ పాత్రలో విజయ్ సేతుపతిని తీసుకున్నారంట. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. హరికృష్ణ పాత్రలో విజయ్ సేతుపతి ఎలా నటిస్తారో అని అందరిలో ఆసక్తి నెలకొంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది