Kalyan Ram : బాబాయ్ వల్లే చదువుకోలేకపోయానన్న కళ్యాణ్ రామ్..?

Authored By aruna | The Telugu News | Published on: August 15, 2022, 2:20 pm

Kalyan Ram : నందమూరి నటవారసుడు, హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ తన బాబాయ్ బాలకృష్ణపై సంచలన కామెంట్స్ చేశారు. బాబాయ్ వల్లే తను చిన్నతనంలో చదువుకోలేకపోయానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.అంతలా ఏం జరిగింది. ఎన్నడూ లేనిది కళ్యాణ్ రామ్ బాలయ్య బాబుపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంటని అంతా షాక్ అవుతున్నారు.అసలు ఏం జరిగిందో కళ్యాణ్ రామ్ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. కళ్యాణ్ రామ్ రీసెంట్‌గా బింబిసార మూవీతో బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. పటాస్ హిట్ అనంతరం చాలా కాలం తర్వాత మళ్లీ కళ్యాణ్ రామ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పడింది.

ఈ సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ళ పరంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌ అని అంటున్నారు. దీంతో బింబిసార సినిమా మూవీ యూనిట్ మొత్తం సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే మూవీ యూనిట్‌తో పాటు సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవితో స్పెషల్ చిట్ చాట్‌లో పాల్గొన్నాడు కళ్యాణ్ రామ్. ఈమూవీలో బేబీ శ్రీదేవి శాంభవి అనే పాత్రలో అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే.ఈ పాప చుట్టే బింబిసార మూవీ మొత్తం తిరుగుతుంది. తాజాగా శ్రీదేవితో కళ్యాణ్ రామ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..

Kalyan Ram said he could not study because of his father..?

Kalyan Ram said he could not study because of his father..?

తన కెరియర్ కూడా ఇలాగే బాల నటుడిగా ప్రారంభమైందని గుర్తుచేసుకున్నాడు.శ్రీదేవి తన స్టడీస్ గురించి చెప్తుండగా..కళ్యాణ్ రామ్ కూడా తన స్కూల్ డేస్ గురించి చెప్పుకొచ్చాడు.తన బాబాయ్ బాలకృష్ణ తనను బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడని ఆయన వల్లే సినిమాల్లోకి వచ్చినట్టు చెప్పాడు. ఆ రోజుల్లో నేను సినిమాల్లో నటించేటప్పుడు కోక్ కావాలి, చాక్లెట్ ఇస్తానే షూటింగ్‌కు వస్తానని బెదిరించే వాడిని.షూటింగ్ అనంతరం ఇంటికి వెళ్లిపోయేవాడిని.అంతేగాని ఒక్క బుక్కు కూడా చదివే వాడిని కాదు. దాంతో నా స్టడీస్ మొత్తం పోయాయి. మాకు అప్పట్లో 45 వస్తే పాస్. నాకు 46, 47మార్కులు వచ్చేవి.అలా బాబాయ్ తనను సినిమాల్లోకి తీసుకుని రావడంతో నా చదువు మొత్తం పోయిందంటూ కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

aruna

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp