Home » Entertainment » Kamal Haasan Do You Know This Story That Star Heroine Slapped Kamal Durinig That Film Shooting
Entertainment

Kamal Haasan : కమల్ హాసన్ చెంప చెల్లుమనిపించిన హీరోయిన్ ఎవరో మీకు తెలుసా?

Authored By
mallesh
The Telugu News | Published on: December 31, 2021, 9:50 pm
Advertisement

Kamal Haasan : విశ్వనటుడు కమల్ హాసన్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విలక్షణమైన నటుడిగా విభిన్నమైన సినిమాలు చేసిన కమల్ హాసన్.. సినీ రంగంలో స్పెషల్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డ్యాన్సర్, ఆర్టిస్ట్, సింగర్.. ఇలా ఒక్కటేమిటీ ఫిల్మ్‌లో ఉండే 24 క్రాఫ్ట్స్‌పైన కమల్ హాసన్‌కు మంచి పట్టుంది. కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ సినిమాల్లోనూ కొనసాగుతున్నారు.

Advertisement

తన సినిమా కెరీర్‌లో అందరికంటే ఎక్కువ వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన నటుడిగా కమల్ హాసన్ ఉన్నారు. కమల్ హాసన్ సినిమాలు కేవలం తమిళం భాషలోనే కాదు తెలుగు,  కన్నడ, మలయాళం భాషలతో పాటు నార్త్ భాషల్లోనూ రిలీజ్ అవుతాయి. అక్కడ కూడా విశేష ఆదరణ పొందుతుంటాయి. ఈ సంగతులు అలా ఉంచితే.. ఓ సినిమా షూటింగ్‌లో స్టార్ హీరోయిన్ కమల్ హాసన్ చెంప చెల్లుమనిపించింది.  ఆమె ఎవరంటే..కళా తపస్వి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘శుభసంకల్పం’.

kamal haasan do you know this story that star heroine slapped kamal durinig that film shooting

Advertisement

Kamal Haasan : హీరోయిన్ కొట్టిన దెబ్బకు వాచిన కమల్ చెంప..

ఈ సినిమాలో కమల్ హసన్ సరసన హీరోయిన్స్‌గా ఆమని, ప్రియమణి నటించారు. ఈ పిక్చర్ అప్పట్లో సూపర్ హిట్ అయింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఊహించని ఘటన జరిగింది. ఓ సన్నివేశంలో భాగంగా కమల్ చెంప మీద ఆమని కొట్టాలి. అయితే, అప్పటి వరకు ఆమని కమల్ హాసన్ చెంప మీద జస్ట్ టచ్ చేస్తోంది. ఈ క్రమంలోనే కె.విశ్వనాథ్ టేకులు తీసుకుంటూనే ఉన్నారు. చివరకు విశ్వనాథ్ ఆమనిపై సీరియస్ కావడంతో కమల్ హాసన్ చెంప చెల్లుమనిపించిందట ఆమని. అప్పుడు షాట్ ఓకే అయింది. కానీ, ఆమని చాచి కొట్టిన దెబ్బకు కమల్ హసన్ చెంప వాచిందట. అయితే, నెమ్మదిగా కొట్టాలని తర్వాత కమల్ ఆమనికి చెప్పగా, తాను టెన్షన్‌లో అలా కొట్టానని సారీ చెప్పిందట ఆమని.

 

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి