RRR Movie : బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తోన్న ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా ఈ సినిమా విడుదలపై అనుమానులు వ్యక్తం అయినా.. తాజాగా అలాందేమి లేదని చిత్ర యూనిట్ మరోసారి స్పష్టం చేసింది. పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీలలో కూడా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా గురించే చర్చ జరుగుతుంది. జనవరి 7న విడుదల కానున్న ట్రిపుల్ ఆర్‌కు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. అయితే సినిమాలకు వందల కోట్లు ఖర్చు చేయించే జక్కన్న.. ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్ కోసం కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారట.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం బృందం.. ప్రమోషన్ కార్యక్రమాలను జోరు మీద చేస్తున్నారు. తాజాగా హిందీలో కపిల్ శర్మ షోలో పాల్గొనగా.. ఇటు సౌత్ లో కేరళ, తమిళనాడు అని ఖాళీ అనేదే లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఇదిలా ఉండగా.. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రమోషన్స్ కోసం పెడుతోన్న ఖర్చుతో టాలీవుడ్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందించవచ్చునని ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. తాజాగా లీక్ అవుతున్న సమాచరం బట్టి రాజమౌళి చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కోసమే ఏకంగా 52 కోట్లు ఖర్చు చేసారట. ఈ వార్త సినీ అభిమానులు అవాక్కవుతున్నారు. కేవలం ప్రమోషన్స్ కోసమే అంత ఖర్చు పెడుతున్నారంటే.. ఈ మూవీతో వందల కోట్లను కొల్లగొడుతామని గట్టి నమ్మకంతో రాజమౌళి ఉన్నాడేమే అని అంటున్నారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. గోండు వీరుడు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటించగా.. అల్లూరి సీతారామరాజు రోల్‌లో రామ్ చరణ్ కనిపించనున్న ఈ చిత్ర ట్రైలర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.