Kamal Haasan : హీరో ప్రభాస్ అని తెలిసినా ఆ సినిమా లో చెయ్యడానికి ఆ అమౌంట్ ఇవ్వాల్సిందే అన్న కమల్ హాసన్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kamal Haasan : హీరో ప్రభాస్ అని తెలిసినా ఆ సినిమా లో చెయ్యడానికి ఆ అమౌంట్ ఇవ్వాల్సిందే అన్న కమల్ హాసన్ !

Kamal Haasan : ‘ బాహుబలి ‘ తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘ ఆదిపురుష్ ‘ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదల అయింది. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. రామాయణం కథ అందరికీ తెలిసిందే కానీ డైరెక్టర్ ఈ సినిమాను విజువల్ వండర్ గా చూపించాడు. దీంతో ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది. ఇకపోతే ప్రభాస్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :17 June 2023,3:00 pm

Kamal Haasan : ‘ బాహుబలి ‘ తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘ ఆదిపురుష్ ‘ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదల అయింది. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. రామాయణం కథ అందరికీ తెలిసిందే కానీ డైరెక్టర్ ఈ సినిమాను విజువల్ వండర్ గా చూపించాడు. దీంతో ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది. ఇకపోతే ప్రభాస్ వరుసగా ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులు చేస్తూ వస్తున్నాడు. అందులో ఒకటే ‘ ప్రాజెక్ట్ కె ‘. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్, దీపిక పదుకొనే, దిశా పటాని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ‘ ప్రాజెక్ట్ కె ‘ సినిమాలో నటించేందుకు లోకనాయకుడు కమల్ హాసన్ ఓకే చెప్పాడు అని ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన డేట్ లు కూడా ప్రకటించారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఆగస్టు నెలలో 30 రోజులు కమల్ హాసన్ డేట్లు కేటాయించారు అని తెలుస్తుంది. ఆ 30 రోజుల్లోనే షూటింగ్ అయిపోయేలా ప్లాన్ వేసుకున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ నెగిటివ్ పాత్రలో కనిపించునున్నారట. అయితే దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ వార్త మాత్రం తెగ వైరల్ అవుతుంది.

Kamal Haasan high remuneration to project k movie

Kamal Haasan high remuneration to project k movie

అయితే ప్రాజెక్ట్ కె సినిమాలో నటించేందుకు కమల్ హాసన్ 100 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా కూడా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమాలో నటిస్తున్నాడు. భారతీయుడు సినిమాకి సీక్వెల్ ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది