
Kamal Hassan : సేనాపతి పాత్రకి కమల్ హాసన్ అంత కష్టపడ్డారా.. కుర్ర హీరోలు కూడా చేయలేరేమో.!
Kamal Hassan : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన క్రేజీ ప్రాజెక్ట్. ఇండియన్2. తెలుగులో భారతీయుడు 2 పేరుతో విడుదల కానుంది. అయితే 28 ఏళ్ల తర్వాత వస్తున్న భారతీయుడు సినిమా సీక్వెల్‌పై ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపుతున్నారు. ఇండియన్ 2 సినిమాలో కమల్ హాసన్, ఎస్‌జె సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్ జయరాం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహ, జాకీర్ హుస్సేన్, పియుష్ మిశ్రా, గురు సోమసుందరం, డిల్లీ గణేష్, జయప్రకాష్, మనోబాల, అశ్వినీ తంగరాజ్ తదితరులు నటించారు.
ఇక చిత్రానికి మ్యూజిక్ అనిరుద్ రవిచంద్రన్ అందించగా, ఎడిటింగ్ ఎ.శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: రవివర్మన్ బాధ్యతలను నిర్వర్తించారు. 28 ఏళ్ల ముందు భారతీయుడు చిత్రంతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసిన కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఇండియన్ 2లో శంకర్ ఏం చెప్పాడు? సేనాపతి క్యారెక్టర్‌ను కమల్ ఎలా హ్యాండిల్ చేశారనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఇండియన్ 2 సినిమాలోని ఐకానిక్ క్యారెక్టర్ సేనాపతి పాత్ర కోసం కమల్ అయితే చాలా కష్టపడ్డారు. ఈ వయసులో కూడా ఆయన ఉదయం 3 గంటలకు లేచి ప్రోస్తటిక్ మేకప్ సిద్దమయ్యారు. అలాగే సాయంత్రం వరకు ఆయన అదే మేకప్‌లో ఉండి తనకు నటనపై ఉన్న తపనను చూపించారు అని చిత్ర యూనిట్ తెలిపింది.
Kamal Hassan : సేనాపతి పాత్రకి కమల్ హాసన్ అంత కష్టపడ్డారా.. కుర్ర హీరోలు కూడా చేయలేరేమో.!
దర్శకుడు శంకర్‌తో పాటు పలువురు ఆర్టిస్ట్‌లు కూడా కమల్ హాసన్ తన పాత్ర కోసం ఎంత కష్టపడతాడో అనేది తెలియజేశారు. కమల్ హాసన్ ఇండియన్ 2లో ఇరగదీసాడని, సేనాపతిగా ఆయన పర్‌ఫార్మెన్స్ అద్భుతంగా అని అంటున్నారు. ఈ సినిమా తొలి రోజు 60 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన భారతీయుడు 2 లో ప్రపంచవ్యాప్తంగా ఓ సరికొత్త మైలురాయిని క్రియేట్ చేస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ జూలై 12న ఇండియన్ 2 పేరుతో తమిళంలో, భారతీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.