
Kangana Ranaut praise Allu Arjun
Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇటీవలి కాలంలో చేస్తున్న కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆమె సౌత్ హీరోలని పైకి లేపుతూ బాలీవుడ్ హీరోలని తగ్గించి మాట్లాడుతుంది. బాలీవుడ్ తనను భరించలేదన్న మహేశ్ వ్యాఖ్యలకు కంగనా రనౌత్ స్పందిస్తూ.. ‘అవును మహేశ్ బాబు అన్నది నిజమే.ఆయన్ను బాలీవుడ్ భరించలేదు. ఎందుకంటే బాలీవుడ్ నుంచి ఎంతోమంది ఆయనతో సినిమా కోసం సంప్రదించారో నాకు తెలుసు. ప్రస్తుతం టాలీవుడ్ దేశంలోనే నెం1 ఇండస్ట్రీగా ఉంది. కాబట్టి ఆయనకి తగిన రెమ్యునరేషన్‌ని బాలీవుడ్ ఇవ్వలేదు. మహేశ్ చేసిన కామెంట్స్‌ని ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారో అర్థం కావట్లేదు.
టాలీవుడ్‌పై, తన పనిపైనా మహేశ్‌బాబు గౌరవం చూపడం వల్లే ఆయన ఈ స్థాయిలో ఉండగలిగారు అని పేర్కొంది.కంగనా కాంట్రవర్సీస్..ఇక తాజాగా అల్లుఅర్జున్‌ని ఆకాశానికి ఎత్తింది. పుష్ప సినిమాలో సాధారణ కూలీ పాత్రను పోషించడానికి ఇప్పుడున్న బాలీవుడ్ హీరోలు ఎవరు ఇష్టపడరని తెలిపింది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ప్రేక్షకులు తమను చూసుకున్నారు కాబట్టి ఆ సినిమా దేశవ్యాప్తంగా ఆదరణ దక్కించుకొని బ్లాక్‌బస్టర్ అయిందన్నారు. బాలీవుడ్ స్టార్ కిడ్స్‌ను ‘బాయిల్డ్ ఎగ్స్’ అంటూ హేళన చేశారు.అలాగే బాలీవుడ్‌పై తనకున్న అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాలీవుడ్ తనకు సపోర్ట్ చేయదని ఎప్పటినుంచో చెప్పుకొస్తుంది కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్.
Kangana Ranaut praise Allu Arjun
తాజాగా ‘అజయ్ దేవగణ్ నా సినిమాను ఎప్పటికీ ప్రమోట్ చేయడు. కానీ ఇతర చిత్రాలను ప్రమోట్ చేస్తాడు. ఇక అక్షయ్ కుమార్ నాకు కాల్ చేసి తలైవి సినిమా బాగుందని చెబుతాడు. కానీ ఆ మూవీ ట్రైలర్‌ను షేర్ చేయడం, ట్వీట్ చేయడం మాత్రం చేయడు. అలాగే అమితాబ్ బచ్చన్ నా సాంగ్ టీజరన్‌ను ట్వీట్ చేసి వెంటనే దాన్ని తొలగించారు. ఆ విషయం గురించి కూడా నేను మాట్లాడను. అజయ్ దేవగణ్ ఇతరులు చేసిన మహిళా ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తారు. కానీ చిత్రాల్లో నటించరు. ఎందుకంటే నా సినిమాల్లో నాకే ఎక్కువ పేరు వస్తుందని. ఇప్పుడు నా సినిమాకు సపోర్ట్ చేసిన అర్జున్ రాంపాల్‌పై ఎలా కృతజ్ఞతతో ఉంటానో, నా సినిమాలో అజయ్ దేవగణ్ నటించిన అలాగే గొప్పగా ఫీల్ అవుతా.’ అని తెలిపింది కంగనా రనౌత్.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.