
Kanika kapoor about Her Bad day In Corona time
కరోనా వైరస్ అంటే ఏంటి అనేది అప్పుడప్పుడు భారతీయులు తెలుసుకుంటున్న సమయం అది. ఒకటి రెండు కేసులు మాత్రమే నమోదవుతున్న తరుణంలో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. కనికా కపూర్ ఎయిర్ పోర్ట్‌లో టెస్టులు చేసుకోకుండా తప్పించుకుని రావడం, ఆ తరువాత రెండు పెద్ద పార్టీల్లో పాల్గొనడం అందులో సినీ రాజకీయ ప్రముఖులు ఉండటం అప్పట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
Kanika kapoor about Her Bad day In Corona time
ఇక కనికా కపూర్‌కు కరోనా వైరస్ అని తేలడంతో పార్లమెంట్ కూడా దద్దరిల్లింది. ఆ సమయంలో కనికా నిర్లక్ష్యంపై దేశ ప్రజలు మండిపడ్డారు. ఆమెను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎందుకంటే అప్పుడు కరోనా అంటే అంత భయంతో ఉండేవారు. తాజాగా కనిక కరోనా సమయంలో తాను అనుభవించిన నరకాన్ని బయటకు చెప్పేసింది. నాటి పరిస్థితులను తలుచుకుని ఎమోషనల్ అయింది.
‘నాకు కరోనా వచ్చిన సమయంలో నా కుటుంబం, పిల్లలు ఎంతో బాధాకరమైన సంఘటనలు ఎదుర్కొన్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా నా పిల్లల్ని లండన్‌లో వదిలి ఇండియాకు రావాల్సి వచ్చింది. వాళ్లు ప్రతిరోజూ ఫోన్ చేసి.. ‘అమ్మ ఎలా ఉన్నావు? మా దగ్గరకి ఎప్పుడు వస్తావు?’ అని అడిగేవాళ్లని చెప్పుకొచ్చింది. నా పిల్లలు, పేరెంట్స్‌కు నెటిజన్లు బెదిరింపులు ఎదురయ్యాయి. చనిపోండంటూ పిచ్చి సలహాలు కూడా ఇచ్చారు. అలాంటి క్షణాల్లోనూ నా కుటుంబం నాకు తోడుగా నిలిచింది. అందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని కనికా కపూర్ ఎమోషనల్ యింది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.