Karthika Deepam : కార్తీక్, దీపకు ప్రమాదం.. చెడు శంకించిన పూజారి.. దీంతో సౌందర్య ఏం చేస్తుంది? కార్తీక్, దీప ఎటువంటి ప్రమాదంలో పడనున్నారు?

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 7 మార్చి 2022, ఎపిసోడ్ 1292 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా తమ్ముడు నాకు కావాలి అని హిమ ఇంట్లో రచ్చ రచ్చ చేస్తుంది. కానీ.. ఎవ్వరూ ఆనంద్ గురించి మాట్లాడరు. తమ్ముడి గురించి ఎవ్వరూ ఎందుకు మాట్లాడటం లేదు. మీకు తమ్ముడంటే ప్రేమ  లేదా. అయినా మీరెప్పుడు నిజాలు చెప్పారని ఎప్పుడూ అబద్ధాలే. మీరు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా. నేను తమ్ముడిని వెతికి పట్టుకుంటాను. శౌర్య.. నీకు తమ్ముడి మీద ప్రేమ లేనే లేదు కదా.. అని చెప్పి అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతుంది హిమ. మరోవైపు నేను చేసిన పనికి నన్ను క్షమించు పెద్దోడా అని కార్తీక్ ను వేడుకుంటుంది సౌందర్య. పిల్లలను తీసుకొని కొన్నాళ్లు ఎక్కడికైనా వెళ్లిరండి అంటుంది సౌందర్య.

karthik and deepa family on vacation in chikmagaluru

మరోవైపు మోనితకు చాలా కోపం వస్తుంది. నా ప్లాన్ అంతా సర్వనాశనం చేశారు.. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటుంది మోనిత. నలుగురిలో అవమానిస్తే చూస్తూ ఊరుకోవడానికి అందరిలాంటి దాన్ని అనుకున్నారా. ఊరి జనం ముందు నన్ను.. అవమానిస్తారా? చేతగాని దాన్ని చేసి నలుగురిలో నా పరువు తీస్తారా? నాకు కావాల్సింది నాకు దక్కకుండా.. మీకు కావాల్సింది మీరు తీసుకోవాలి అనుకుంటే చూస్తూ ఊరుకుంటానా. మోనితతో పెట్టుకుంటే ఎవ్వరికైనా మోక్షమే.. అని అనుకుంటుంది మోనిత. వెంటనే గన్ తీసి ఏదో ప్లాన్ వేస్తుంది మోనిత.

నా ఆవేశం ఎప్పుడూ కార్తీక్ ప్రేమనే కోరుకుంది. కానీ.. ఈరోజు బలి కోరుకుంది అని అనుకుంటుంది మోనిత. మరోవైపు కార్తీక్, దీప, పిల్లలు అందరూ కలిసి చిక్ మగళూరుకు వెళ్తారు. హిమ మాత్రం.. ఇంకా ఆనంద్ ను మరిచిపోలేకపోతుంది.

కార్తీక్, దీప, శౌర్య  ఆనందంగా ఉంటారు. అమ్మ.. మనం ఇలా వెళ్తున్నామంటే నాకు ఇప్పటికీ నమ్మకంలా లేదు తెలుసా అంటుంది శౌర్య. మనం ఇలా కారులో లాంగ్ టూర్ వెళ్లి చాలా రోజులు అయింది కదా అంటుంది శౌర్య. నీకే కాదు.. నాకూ చాలా ఆశ్చర్యంగా ఉంది. డాక్టర్ బాబు.. ఇక ఈ సంతోషాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి కదా అని అడుగుతుంది దీప.

అవును దీప.. ఒక రాక్షసపర్వం ముగిసింది. ఇక నుంచి మనం చాలా సంతోషంగా ఉంటాం అంటాడు కార్తీక్. అయితే.. వీళ్లకు తమ్ముడు దూరం అయ్యాడన్న బాధ అస్సలు లేదు అని అనుకుంటుంది హిమ. అన్నింటినీ తలుచుకుంటున్నారు.. కానీ.. ఆనంద్ ను అందరూ మరిచిపోయారు అంటుంది హిమ.

Karthika Deepam : చిక్ మగళూరు వెళ్లినా కూడా ఆనంద్ గురించే ఆలోచించిన హిమ

ఏంటి.. ఎవ్వరూ మాట్లాడరు అంటుంది హిమ. ఆనంద్ ను మీరందరూ మరిచిపోయారు కదా అంటుంది హిమ. ఆనంద్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అని అనుకుంటుంది దీప. మనిద్దరం కలుసుకున్నాక మనం ఎంత సంతోషించామో నువ్వు ఒకసారి గుర్తు చేసుకో అంటుంది దీప.

ఆనంద్.. ముద్దుగా ఉంటాడు. మంచివాడు. ఎప్పుడో ఒకసారి ఆకలి వేస్తేనే ఏడ్చేవాడు. ఆందరికీ వాడంటే ఇష్టమే.. అంటుంది దీప. ఏదో మన దగ్గరికి చేరాడు. కానీ.. పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి చేరితేనే సంతోషిస్తారు కదా..  అవునా కాదా అని హిమను అడుగుతుంది దీప.

వాడు మనతో బాగా కలిసిపోయాడు. కానీ.. ఇప్పుడు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటాడు అంటుంది దీప. వాడు ఆనందంగా ఉండటం మనకూ హ్యాపీనే కదా అంటాడు కార్తీక్. దీంతో అవును అంటుంది హిమ. బాబు అంటే అందరికీ ఇష్టమే. నీకు చాలా ఇష్టం. కానీ.. మనం అదే టాపిక్ పదే పదే మాట్లాడుకూడదు అంటుంది దీప.

ఆనంద్ గురించి మాట్లాడుకుంటే తాడికొండ గుర్తొస్తుంది. మీ డాడీ, మనం పడ్డ కష్టాలు గుర్తొస్తాయి.. అంటుంది దీప. అందరం సంతోషంగా ఇలా చిక్ మగళూరు వెళ్తున్నాం కదా. సరదాగా ఉన్నప్పుడు డాడీని బాధపెడతామా. తప్పు కదా అంటుంది దీప.

దీంతో సర్లేండి.. నేను ఇక నుంచి మాట్లాడను అంటుంది హిమ. దీంతో అలిగావా అంటుంది దీప. హిమ అలక ఎలా తీర్చాలో నాకు తెలుసు అని కారు ఆపి.. హిమ ముందుకురా అంటాడు కార్తీక్. డ్రైవింగ్ నేర్చుకుంటా అన్నావు కదా. నేను నేర్పిస్తానురా.. ఇద్దరం కలిసి డ్రైవింగ్ చేద్దాం అంటాడు కార్తీక్.

కార్తీక్ మీద కూర్చొని హిమ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. కానీ.. దీపకు భయం వేస్తుంది. హిమ మాత్రం స్పీడ్ గా తోలుతూ ఉంటుంది. మరోవైపు సౌందర్య, ఆనంద్ రావు ఇద్దరూ గుడికి వెళ్తారు. పూజారిని కలుస్తారు. మా ఇంట్లో ఇప్పుడు సంతోషాలు వెల్లివిరిశాయని అంటారు.

కార్తీక్, పిల్లలు సరదాగా విహారయాత్ర వెళ్లారు అంటుంది సౌందర్య. ఎక్కడైతే వాళ్ల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయో.. అక్కడికే వెళ్లారు. చిక్ మగళూర్ కు వెళ్లారు అని చెబుతుంది సౌందర్య. దీంతో పూజారికి ఏదో అనుమానం వస్తుంది.

వెంటనే పంచాంగం చూసి అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది అంటాడు పూజారి. ఎందుకు పంతులు గారు అంటుంది సౌందర్య. కాలం బలమైంది.. ఎంతటి పనినైనా చేయిస్తుంది. ఎక్కడైతే కార్తీక్, దీప మధ్య అనుమానాలు మొదలయ్యాయో.. ఎక్కడైతే వాళ్ల బంధం బీటలు వాలాయో మళ్లీ అదే చిక్ మగళూరు వెళ్లి పొరపాటు చేశారనిపిస్తోంది అంటాడు పూజారి.

కొన్ని స్థల ప్రభావాలు విచిత్రంగా ఉంటాయి. నాకెందుకో మనసులో అలజడిగా అనిపిస్తోంది అంటాడు పూజారి. జాగ్రత్తగా ఉండమని చెప్పండి. వీలైతే వెనక్కి వచ్చేయమని చెప్పండి అని చెప్పి పూజారి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Trump : మిత్రుడు అంటూనే ఇండియా పై ట్రంప్ సుంకాలపై బాగా..!

Trump  : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…

36 minutes ago

Spicy Food : కారం తిన్న వెంటనే నోరు మండుతుంది ఎందుకు? దీని వెనుక‌ శాస్త్రీయ కారణం ఇదే!

Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…

2 hours ago

Vastu Tips : ఇంట్లో పావురాల గూడు శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏమంటుంది తెలుసా?

Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…

4 hours ago

Sleeping : నిద్ర భంగిమ‌ల‌తో మీరు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయోచ్చు.. అది ఎలాగంటే..!

Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…

5 hours ago

Raksha Bandhan : 2025 రాఖీ పండుగ ప్రత్యేకత ఏంటి.. 95 ఏళ్ల తర్వాత అరుదైన యోగాల కలయిక !

Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…

6 hours ago

Varalakshmi Vratam : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఎప్పుడు.. పూజా స‌మ‌యం, ఇత‌ర విశేషాలు ఇవే..!

Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…

7 hours ago

Astrology : ఏ రాశి వారికి ఏ రంగు .. ఏ రాశి వారు ఏ రంగు వ‌స్తువులు కొన‌డం బెట‌ర్..!

Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…

8 hours ago

Mark Zuckerberg : 24 ఏళ్ల కుర్రాడికి 2,196 కోట్ల జీతం ఇస్తున్న మార్క్ జుకర్‌బర్గ్.. ఎందుకో తెలుసా…?

Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…

17 hours ago