Karthika Deepam 02 August 2022 Episode : శోభ ప్లాన్ రివర్స్ కొడుతుందా.. నిరుపం శౌర్య ల మధ్య ప్రేమ చిగురిస్తుందా.?

 Authored By prabhas | The Telugu News | Updated on :2 August 2022,10:01 am

Karthika Deepam 02 August 2022 Episode : కార్తీకదీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 2 మంగళవారం ఎపిసోడ్ 1420 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. నిరూపం, సౌర్యలను రూమ్లో అలాగే ఉంచి బయట ప్రేమ్, హిమ ఈ గడియ రావట్లేదు.. అని యాక్టింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దర్నీ ఎలాగైనా కలపాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. రూమ్ లోపల నిరుపం శౌర్య ఏదో ఒకటి చేసి తాళం పగలగొట్టండి. అని అంటారు. మేము కూడా ట్రై చేస్తున్నాం. కానీ ఇది రావట్లేదు అని యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ప్రేమ్, కట్ చేస్తే ఆనందరావు, సౌందర్య బాధపడిపోతూ ఉంటారు. సౌర్య కోసం తన ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏం జరిగిందో అని. ఇంతలో హిమ ఫోన్ చేస్తుంది. సౌర్య కనపడింది. నాయనమ్మ బాగానే ఉంది. మీరు ఇక్కడికి రండి అని అంటుండగా… అంతలో ఫోన్ లాక్కొని ప్రేమ్ వాళ్ళని ఎక్కడికి రమ్మంటావేంటి అని అంటాడు.సౌందర్య తనకు ఏమైందో ఏంటోని చాలా భయమేసింది అండి. ఇప్పుడు నా మనసు కుదుటపడింది.

అని అంటుంది. నిరూపం అసలు అ రౌడీలు నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు సౌర్య అని అడుగుతాడు. అప్పుడు సౌర్య నేను వాళ్ళని ఒకసారి పోలీసులకి పట్టించాను. దొంగతనం చేసి పారిపోతుంటే అని అంటుంది. అప్పుడు బయటనుంచి హిమ తను ఇంత సాహసం చేసినందుకు తనకి అవార్డు కూడా ఇచ్చారు. బావ అని అంటుంది. ఓహో అందుకే నీ మీద పగ తీర్చుకోవడానికి నిన్ను కిడ్నాప్ చేశారా.. అని అంటాడు. నిరూపం, బయట నుంచి ప్రేమ్, హిమ మనిద్దరం ఈ తాళం ఎలా పగలగొట్టాలో చర్చించుకుందాం. పద అని కార్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు నిరుపం ఒరేయ్ ప్రేమ్ ప్రేమ్ అని పిలుస్తూ ఉంటాడు. కట్ చేస్తే శోభ తన ప్లాన్ రివర్స్ అయినందుకు తను చిరాకు పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి. ఈ స్వప్న అంటీ నాకు ఎలాంటి హెల్ప్ చేయడం లేదు. ఏదో ఒకటి చేసి నిరుపంని నేను దక్కించుకోవాలి.. అనుకుంటుంది. కట్ చేస్తే నిరూపం, సౌర్య రూమ్ లో కూర్చుని ఉంటారు. సౌర్య బాగా ఆకలిగా ఉంది అని అంటుంది. నిరూపం ఏంటి శౌర్య ఆకలేస్తుందా…

Karthika Deepam 02 August 2022 Full Episode

Karthika Deepam 02 August 2022 Full Episode

అని అడుగుతాడు. హిమ ఏంటి సౌర్య ఆకలేస్తుందా ఏమైనా తెమ్మంటావా అని అడుగుతుంది. ఆ ఒక చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీ ఇవన్నీ తీసుకురా.. అని ఎటకారం చేస్తుంది. అప్పుడు అందరూ నవ్వుతారు. నిరూపం బయటికి వెళ్లి ఏదైనా తీసుకురా ప్రేమ్ కి అని చెప్తాడు. అప్పుడు సౌర్య ప్రేమ్ కి డబ్బులు ఇచ్చి నాకు ఇడ్లీ తీసుకురా… అని అంటుంది. అప్పుడు ప్రేమ్ ఆ డబ్బులు తీసుకుంటాడు. నిరూపం తను డబ్బులు ఈయడం ఏంటి, నువ్వు తీసుకోవడమేంట్రా అని అంటాడు. అప్పుడు సౌర్య నేను కష్టపడ్డ డబ్బులతోనైతే నేను తింటా నాకు ఎవరి కష్టార్జితం అక్కర్లేదు.. అని అంటుంది. అప్పుడు బయట నుంచి హిమ, సౌర్యకు కోపం తెప్పించకు బావ అని అంటుంది. నిరూపం దోమలు కుడుతున్నాయి. ఇక్కడ ఇన్ని దోమలు ఉన్నాయి. ఏంటి అని అంటూ నీకు కుట్టట్లేదా శౌర్య అని అడుగుతారు. మీరు దోమల కొడుతూనే ఇంత బాధపడుతున్నారు. నన్ను మనుషులు కుట్టారు.

అంటే మోసం చేశారు. నేనెంత బాధపడాలి అని అంటుంది. అప్పుడు నిరుపం నేను దోమ కుట్టింది అని చెప్పాను. తల్లి నాకెందుకు ఎన్ని సూక్తులు చెప్తున్నావు. నీకు దండం అని అంటాడు. నిరుపం, ప్రేమ్ ఇంకా రాలేదేంటి అని అంటుండగా ప్రేమ్ వాళ్లు వస్తారు. ప్రేమ్ ఇల్లు కలవాలని మనం ప్లాన్ చేస్తే వీరిద్దరేంటి ఏం మాట్లాడకుండా కూర్చున్నారు. అని అనుకుంటూ వీళ్ళిద్దరికీ ఒక్కటే పార్సిల్ ఇద్దాం.. అప్పుడు షేర్ చేసుకుంటారు. అని ఒకటే పార్సెల్ను సౌర్యకి ఇస్తాడు. నిరూపం ఇది అన్యాయం రా బాబు తనకి పార్సిల్ ఇచ్చి నాకేమో వాటర్ బాటిల్ ఇస్తున్నావు అని అంటాడు. అప్పుడు ప్రేమ్ శౌర్య తనకి కూడా పెట్టు అని అంటాడు. కానీ నేను పెట్టను అని అంటుంది. సౌర్య ఆ పార్సెల్ తీసుకొని వచ్చి కూర్చొని తింటూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడవలసిందే.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి