
Karthika Deepam 07 September 2022 Full Episode
Karthika Deepam 07 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1451 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్ మౌనితని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు. ఇక మౌనిత దీప గురించి అడుగుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఆవిడ ఇక కనపడదు నేను చడమడ తిట్టేసాను.. అని నీకోసం ఏమైనా తీసుకొస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అని వెళ్ళిపోతాడు కార్తీక్. దాంతో మౌనిత తెగ సంబర్ పడిపోతూ ఉంటుంది. కట్ చేస్తే హిమ, సౌర్య ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అంతలో సౌందర్య, ఆనంద్ రావు వస్తారు. వాళ్లని హిమ మనం శౌర్య దగ్గరికి వెళ్దాం నాయనమ్మ తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం అని అంటుంది. అప్పుడు సౌందర్య వద్దు ఈరోజు నీ పుట్టినరోజు అక్కడికి వెళ్తే నువ్వు ఇంకా బాధపడాల్సి వస్తుంది.
కాబట్టి మనం అనాధ శరణాలయానికి మాత్రం వెళ్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే దీప గుడికి వచ్చి ఇద్దరు పిల్లల మీద అర్చన చేయిస్తూ..కార్తీక్ బాబు తనకి గతం గుర్తొచ్చి నా పిల్లలతో నాతో సంతోషంగా ఉండేలా చెయ్ దేవుడా అని దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. అంతలో శౌర్య వారణాసి అక్కడికి వస్తారు. అదే గుడిలో ఒకపక్క దీప దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకొకపక్క సౌర్య దండం పెట్టుకుంటూ ఉంటుంది. కానీ ఒకల్ని ఒకళ్ళు చూసుకోరు. అంతలో కార్తీక్, మౌనిత ఇద్దరు అదే గుడికి వస్తారు. అప్పుడు కార్తీక్ అడుగుతాడు. ఎందుకు గుడికి తీసుకొచ్చావు ఏమైనా స్పెషల్ ఉందా అని అడుగుతాడు. అప్పుడు మౌనిత నువ్వు వంటలు అక్కని కలవను, మాట్లాడను అని ప్రమాణం చేయాలి అని అంటుంది. అప్పుడు కార్తీక్ నీకేమైనా పిచ్చా .ఈ కాలంలో ఆ ప్రమాణాలు ఏంటి ఒకవేళ నేను ప్రమాణం చేసి కూడా తనతో మాట్లాడితే అంటే నాకు గుర్తు ఉండదు కదా అని అంటాడు. అప్పుడు మోనిత దేవుడి మీద ప్రమాణం చేస్తే మర్చిపోరు అని అంటూ..
Karthika Deepam 07 September 2022 Full Episode
తప్పదు చేయాలి అని తనని లాక్కెళ్తూ ఉంటుంది. గుడిలోకి. అప్పుడు దీప వాళ్ళని చూసి వాళ్ళ వెనకనే వెళుతుంది. కట్ చేస్తే హిమ శౌర్య గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు సౌందర్య నువ్వు ప్రతిక్షణం దాని గురించి ఆలోచిస్తావు.. కానీ అది నిన్ను అర్థం చేసుకోదు. అది ఏనాడో ఒకనాడు నిన్ను అర్థం చేసుకునే రోజు వస్తుంది. కాబట్టి నువ్వు అప్పటివరకు బాధపడకు అని అంటుంది. కట్ చేస్తే మౌనిత కార్తీక్ ని గుళ్లోకి తీసుకెళ్లి ప్రమాణం చేయమని అడుగుతూ ఉంటుంది. కార్తీక్ చేస్తూ ఉండగా దీప ఆగండి డాక్టర్ బాబు మీరు ఎందుకు ప్రమాణం చేస్తున్నారు.. నేనేం తప్పు చేశాను అని అంటుంది. నువ్వు తప్పు చేయలేదా నాకు విషయం పెట్టి చంపాలనుకున్నావు కదా అని అంటుంది మోనిత. అప్పుడు నేను ఏ తప్పు చేయలేదు అని ఇప్పుడే నా పిల్లల మీద ప్రమాణం చేస్తాను అని ఒక్కసారిగా దీప ప్రమాణం చేస్తుంది.
అప్పుడు కార్తీక్ బాబు అది చూసి చూసావు కదా తను ప్రమాణం చేసింది చూడు.. ఇకనైనా తనని నమ్ము అని అంటాడు. అప్పుడు మౌనిత నేను నమ్మను అంటుంది. అప్పుడు దీప డాక్టర్ బాబు, నేను చేశాను కదా తన చేత చేయించండి అని అంటుంది. అప్పుడు మౌనిత చెయ్యి మౌనిత అని అంటాడు కార్తీక్. అప్పుడు మౌనిత కంగారుపడుతూ.. దిక్కులు చూస్తూ ఉండగా అక్కడ సౌర్య కనపడుతుంది. తనని చూసి దేవుడా వీళ్ళందరూ ఒక దగ్గరే ఉన్నారు. నేను ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో కార్తీక్ మౌనితని తిట్టి.. తనని వదిలేసి వెళ్లిపోయి ఇంట్లో కూర్చుని ఉండగా.. దీప తనకి మసాజ్ చేస్తూ ఉంటుంది. మోనిత కంగారుపడుతూ ఇంటికి వచ్చి చూస్తే.. కార్తీకి దీప మసాజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అని అంటుండగా దీప సైలెంట్ అని అంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.