Karthika Deepam 1 Nov Today Episode : కనిపించకుండా పోయిన దీప.. టెన్షన్ లో కార్తీక్.. తన కొడుకుకు బారసాల చేస్తున్న మోనిత
Karthika Deepam 1 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. అసలు.. దీప ఎక్కడికి వెళ్లింది అని టెన్షన్ పడుతారు సౌందర్య, ఆనందరావు. అసలు.. ఈ ఇంట్లో ఏం జరుగుతోందో నాకేం అర్థం కావడం లేదు.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆనందరావు. ఇంతలో ప్రియమణి వచ్చి.. నాకు మోనిత ఫోన్ చేసింది అని సౌందర్యతో అంటుంది. ఏం చెప్పింది.. అంటే మోనితకు కొడుకు పుట్టిన విషయం గురించి చెప్పింది. కార్తీకయ్య సంతకం పెట్టిన విషయం కూడా చెప్పింది.. అని అంటుంది ప్రియమణి. మరి.. దీపకు ఈ విషయం చెప్పావా? అంటుంది సౌందర్య. దీంతో లేదమ్మా అంటుంది ప్రియమణి.

karthika deepam 1 november 2021 full episode
కానీ.. పుట్టిన బాబు.. పేగు మెడకు వేసుకొని పుట్టాడంట కదా.. అలా పుడితే మేనమామలకు, కన్నతండ్రికి గండం ఉంటుందట అమ్మ. గండం అంటే మరి కార్తీకయ్యకే కదా అమ్మ. అదేదో శాంతి చేయించాలి అంటారు. కార్తీకయ్యకు గండం అంటే మరి.. అయినా మీకు అన్నీ తెలుసు కదా అమ్మా.. నేను చెప్పాలా అని అక్కడి నుంచి ప్రియమణి వెళ్లిపోతుంది. దీంతో ఇదీ నేను విన్నాను అని అనుకుంటుంది సౌందర్య.
ఇంతలో ప్రియమణి.. మోనితకు ఫోన్ చేస్తుంది. మీరు చెప్పినట్టే నేను చేశానమ్మా.. అంటుంది. మా అత్తగారు ఏమంటున్నారు అంటుంది. షాక్ అయ్యారా? అంటుంది. కంగారు పడ్డారు అమ్మా అంటుంది. దీపమ్మ కనిపించడం లేదు అనుకుంటున్నారు అమ్మా.. అని ప్రియమణి మోనితకు చెబుతుంది. దీపక్క ఎక్కడికి వెళ్లి ఉంటుందిలే.. ఎక్కడో ఒక చోట కూర్చొని కన్నీళ్లు పెట్టుకొని ఉంటుంది అంటుంది మోనిత.
దీప.. ల్యాబ్ కు వెళ్తుంది. మా సార్ వచ్చారు మాట్లాడండి అంటుంది పల్లవి. దీంతో ల్యాబ్ ఓనర్ దగ్గరికి తీసుకెళ్తుంది. కూర్చోండి మేడమ్ అంటాడు. మీరు కార్తీక్ గారి భార్య కదా. పల్లవి అంతా చెప్పింది. నన్ను క్షమించాలి మేడమ్. మీకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నా. కార్తీక్ గారు శాంపిల్ ఇచ్చి వెళ్లారు. మేము రిపోర్ట్ కూడా తయారు చేశాం. ఆయన ఇప్పటి వరకు రాలేదు. రిపోర్టులు తీసుకెళ్లలేదు. ఆ శాంపిల్ మాదగ్గరే ఉంది. ఆయన ఇప్పటి వరకు రాలేదు.. అని చెబుతాడు. ఆ రిపోర్ట్ ను దీపకు ఇస్తాడు ల్యాబ్ ఓనర్.
Karthika Deepam 1 Nov Today Episode : ల్యాబ్ ఓనర్ ను నిలదీసిన దీప
నేను రిపోర్ట్ కోసం రాలేదు. శాంపిల్ ను ఎందుకు మోనితకు ఇచ్చావు అంటుంది దీప. మీరు పొరపాటు పడుతున్నారు మేడమ్. ఆ మోనిత ఎవరో మాకు తెలియదు. మా ల్యాబ్ నుంచి శాంపిల్ వెళ్లలేదు.. వెళ్లదు. ఈ విషయం ఎక్కడికి వచ్చి చెప్పమన్నా నిర్భయంగా చెబుతాను మేడమ్ అంటాడు. దీంతో దీపకు అనుమానం మొదలవుతుంది. అక్కడి నుంచి బయలుదేరుతుంది. ల్యాబ్ నుంచి బయటికి వచ్చి వారణాసి అక్కడే ఉన్నా పట్టించుకోకుండా నడుచుకుంటూ ఎక్కడికో వెళ్లిపోతుంది.

karthika deepam 1 november 2021 full episode
కార్తీక్.. దీప ఎక్కడికి వెళ్లిందో అని తెగ టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో వారణాసి వచ్చి దీప కోసం ల్యాబ్ లో చెక్ చేస్తుంటాడు. కానీ.. తను అప్పుడే వెళ్లిపోయిందని చెబుతుంది పల్లవి. అరె.. నేను బయటే ఉన్నానే.. నాకు చెప్పకుండా అక్క ఎలా వెళ్లింది.. అనుకొని టెన్షన్ పడతాడు వారణాసి.
మోనిత.. తన కొడుకుకు బారసాల ఎలా చేయాలా అని ఆలోచిస్తుంటుంది. భారతితో చెబుతుంది. దీంతో ఇప్పుడు బారసాల అవసరమా? అని భారతి.. మోనితకు సలహాలు ఇస్తుంది. కానీ.. మోనిత మాత్రం తన సలహాలు వినదువ. నువ్వు నాకు సలహాలు ఇవ్వకు భారతి అంటుంది మోనిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.