Karthika Deepam 1 Oct Today Episode : మోనితకు యాపిల్స్ గిఫ్ట్ గా తీసుకెళ్లిన దీప.. అందులో ఏమైనా కలిపిందా? మోనిత కడుపును తీసేందుకు దీప ప్రయత్నిస్తోందా? అందుకే.. జైలులో మోనితను దీప కలిసిందా?

karthika deepam 1 october 2021 friday episode 1159 highlights
Karthika Deepam 1 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్.. 01 అక్టోబర్, 2021 శుక్రవారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈ రోజు ఎపిసోడ్ 1159 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పిల్లలు.. మోనిత ఇంటర్వ్యూ ఉన్న పేపర్ ను చూశారేమో అని తెగ టెన్షన్ పడుతుంది దీప. కానీ.. వాళ్లను అడగలేకపోతుంది. వాళ్లు అలిగి వెళ్లిపోయారంటే దానికి కారణం ఖచ్చితంగా మోనిత గురించి తెలుసుకొని ఉంటారని టెన్షన్ పడుతుంది. వీటన్నింటికీ ఒకటే సమాధానం అని అనుకుంటుంది దీప.

karthika deepam 1 october 2021 friday episode 1159 highlights
Karthika Deepam 1 Oct Today Episode : తన కూతురు స్వప్న ఇంటికి వెళ్లిన దీప
కట్ చేస్తే సౌందర్య.. తన కూతురు స్వప్న ఇంటికి వెళ్తుంది. కానీ.. తను ఏం మాట్లాడదు. ఏం మాట్లాడవేంటి అంటే.. మాట్లాడటానికి మన మధ్య టాపిక్స్ ఏం ఉంటాయి. నువ్వు నాకు చేసింది గతం కాదు.. మరిచిపోలేని గాయం అంటుంది స్వప్న. నేను మారిపోయాను స్వప్న.. అంటే నువ్వు మారావు కానీ.. నేను మారలేదు.. నాకు మారాలని కూడా లేదు.. అంటుంది. నా మీద నీకు ప్రేమ లేదా.. అంటే.. ప్రేమ గురించి నువ్వు మాట్లాడటం విడ్డూరంగా ఉంది.

karthika deepam 1 october 2021 friday episode 1159 highlights
స్వప్ప కూతురు నల్లగా పుట్టిందని దూరం పెడుతుంది సౌందర్య. దీంతో చాలా బాధపడిపోతుంది స్వప్న. ఇంటికొచ్చాక మొహం మీద తలుపు వేయలేను కదా.. పరాయి వాళ్లు వచ్చినట్టు రాగానే కాఫీ ఇచ్చాను.. తాగి వెళ్లు అంటుంది స్వప్న. దీంతో కాఫీ తాగి కాఫీ బాగా కలిపావు అంటుంది. నా మీద నీకు ఎంత కసి ఉంది.. అంటుంది సౌందర్య. నా మనవరాలు ఏది.. అని అడుగుతుంది సౌందర్య. దీంతో నీ మనవరాలు కాదు నా కూతురు అంతే.. అంటుంది.

karthika deepam 1 october 2021 friday episode 1159 highlights
అది అక్కడే ఉండి చదువుకుంటా అంది. ఇండియా రానంది అంటుంది స్వప్న. నా కూతురు ఎలా ఉంది.. ఎక్కడ ఉంది అని అడగకు. నువ్వు నాకు చేసిన అవమానానికి దేవుడు తగిన శాస్తి చేశాడు. అమ్మ.. భూమి గుండ్రంగా ఉందని ఊరికే అనలేదు. నువ్వు ఎదుటివారికి ఏది ఇస్తే.. అదే మళ్లీ తిరిగి వస్తుంది.. అని చెబుతుంది స్వప్న.

karthika deepam 1 october 2021 friday episode 1159 highlights
Karthika Deepam 1 Oct Today Episode : నా కూతురు నల్లగా ఉందని చీదరించుకున్నావు కదా.. అని సౌందర్యకు చెప్పిన స్వప్న
దేవుడు నాకూతురును నల్లగా పుట్టించి వరం ఇచ్చాడో శాపం ఇచ్చాడో తెలియదు కానీ.. నా కూతురును నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టావు. ఇప్పుడు మన ఇంటి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. అందరూ కథలు కథలుగా నీ పుత్రరత్నం గురించి మాట్లాడుకుంటున్నారు కదా.. అని అంటుంది సౌందర్య. ఇంతలో ఆనందరావు ఇద్దరు మనవళ్లను తీసుకొని అక్కడికి వస్తాడు. మమ్మీ.. ఈ తాతా అమ్మమ్మలు మాకు బాగా నచ్చారు మమ్మీ అంటారు. దీంతో కొత్తలో అన్నీ బాగానే ఉంటాయి కానీ.. తర్వాతే అసలు విషయం తెలుస్తుంది అని స్వప్న.. తన పిల్లలతో చెబుతుంది.

karthika deepam 1 october 2021 friday episode 1159 highlights
నేను మారిపోయాను అని చెప్పాను కదా.. మా ఇంటికి రా.. అని అంటే నేను రాను.. ఇక వెళ్లిపోండి అని అంటుంది స్వప్న. నేను మీ కూతురును అని ఎవ్వరికీ చెప్పకుంటే నేను ఇంకా సంతోషిస్తాను అని స్వప్న చెప్పడంతో ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

karthika deepam 1 october 2021 friday episode 1159 highlights
Karthika Deepam 1 Oct Today Episode : భారతితో ఫోన్ లో మాట్లాడిన మోనిత
కట్ చేస్తే.. సుకన్య ఫోన్ తీసుకొని భారతితో.. మోనిత మాట్లాడుతుంది. కార్తీక్ ను కలుసుకోవడం కోసం భారతి ప్లాన్ చేసుకోమ్మంది. కానీ ఏం ప్లాన్ చేయాలి. కొడితే మిస్ అవ్వకూడదు. అలాంటి ప్లాన్ చేయాలి.. అని అనుకుంటుంది మోనిత. నేను ఓడిపోను. నా ప్రేమే నన్ను గెలిపిస్తుంది.. అని అనుకుంటుండగా.. మేడం మీ కోసం ఎవరో వచ్చారు అంటుంది సుకన్య. నన్ను చూడటానికి ఎవరు వచ్చారు అబ్బా.. అని అనుకుంటుంది.

karthika deepam 1 october 2021 friday episode 1159 highlights
కట్ చేస్తే.. కార్తీక్.. ఇంకా తన పిల్లలు ఎందుకు మాట్లాడటం లేదని ఆలోచిస్తుంటాడు. ఇంతలో కార్తీక్ ఆత్మ తనతో మాట్లాడుతుంది. డాక్టర్ కార్తీక్.. అందరికీ వైద్యం చేసి.. అందరినీ బాగు చేసే కార్తీక్ తన జీవితాన్ని బాగు చేసుకోలేకపోతున్నాడా.. అని అనుకుంటాడు. ఇంతలో సౌందర్య వచ్చి.. ఏం చేస్తున్నావురా అంటుంది. ఆత్మ పరిశీలన మమ్మీ.. నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను అంటుంది. పిల్లలు మాట్లాడటం లేదు అనగానే.. పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించకు. వాళ్లు పిల్లలు. వాళ్లకు ఇప్పుడు ఆలోచించే పరిస్థితి ఉండదు కదా. వాళ్లే తర్వాత అర్థం చేసుకుంటారులే అంటుంది. అందుకే ఓసారి ఆసుపత్రికి వెళ్లొస్తాను మమ్మీ అంటాడు కార్తీక్. దీంతో వెరీగుడ్.. వెళ్లిరా అంటుంది. స్వప్నక్క ఏమన్నది అంటే.. తనకు ఇంకా నా మీద ఉన్న కోపం పోలేదు.. అంటుంది. దీప ఎక్కడికి వెళ్లింది అంటే.. ఏదో పని ఉంది అని చెప్పింది అంటాడు.

karthika deepam 1 october 2021 friday episode 1159 highlights
Karthika Deepam 1 Oct Today Episode : మోనితను కలవడానికి జైలుకు వెళ్లిన దీప
మోనితను కలవడానికి దీప.. జైలుకు వెళ్తుంది. వెళ్లి.. మోనితను సీరియస్ గా చూస్తుంది. అరెరె.. దీపక్క నువ్వా.. ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా? అంటుంది. నీకోసం ఎవరూ రారు అంటుంది దీప. ఎవరూ రాకపోయినా పర్లేదులే దీపక్క. నా గుండెల్లో మన కార్తీక్ ఉన్నాడు. నా కడుపులో కార్తీక్ బిడ్డ ఉంది. ఇంకేం కావాలి. ఇంకెవ్వరు రావాలి చెప్పు. ఏంటి ఏదో తెచ్చినట్టున్నావు.. హా.. పుల్లటి మామిడికాయా? పుల్లటివి తినే స్టేజ్ ను దాటిపోయానేమో దీపక్క.. అనగానే నన్ను అలా పిలవకు.. కంపరం వేస్తోంది అంటుంది దీప.

karthika deepam 1 october 2021 friday episode 1159 highlights
నువ్వు. నేను, మన కార్తీక్.. వరుసలు ఇంతే కదా మరి.. అంటుంది మోనిత. తను తెచ్చిన కవర్ మోనితకు ఇస్తుంది. అందులో యాపిల్స్ ఉంటాయి. ఓ యాపిల్స్ తెచ్చావా? థ్యాంక్యూ అంటుంది. కొంపదీసి యాపిల్స్ లో ఏమైనా కలిపావా? అంటుంది. నీలాగా నాది క్రిమినల్ మైండ్ కాదు.. అంటుంది దీప. అందులో ఏం కలపలేదులే తిను. నీకోసమే తెచ్చాను అంటుంది. ఇంతకీ నా కార్తీక్ ఎలా ఉన్నాడు. టైమ్ కు తింటున్నాడా? అంటుంది.

karthika deepam 1 october 2021 friday episode 1159 highlights
నువ్వేం ఘనకార్యం సాధించావని పేపర్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నావు అంటుంది దీప. అయినా కూడా మోనిత పట్టించుకోదు. దీంతో దీప.. ఒక్కసారిగా అరుస్తుంది. అరవకు దీప అంటుంది. ఓవర్ యాక్షన్ చేయకు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటుంది. ఇప్పుడు చూడటానికి వచ్చావు.. హ్యాపీ.. యాపిల్స్ తెచ్చావు డబుల్ హ్యాపీ. ఎందుకు ఈ సౌండ్ పొల్యూషన్ చెప్పు. తోబుట్టువులం కాకపోయినా మన కార్తీక్.. ఇద్దరినీ అక్కా చెల్లెళ్లను చేశాడు.. అంటుంది మోనిత. టాపిక్ డైవర్ట్ చేస్తుంటుంది. దీంతో మోనిత నేను నీ క్షేమ సమాచారాలు తెలుసుకోవడం కోసం రాలేదు అంటుంది.

karthika deepam 1 october 2021 friday episode 1159 highlights
Karthika Deepam 1 Oct Today Episode : పేపర్ లో ఆ పిచ్చి రాతలు మానేయ్.. అంటూ మోనితకు దీప వార్నింగ్
పేపర్ లో ఆ రాతలు మానేయ్. అది చదివి అమాయకంగా ఎవ్వరూ నమ్మరు. అసహ్యంగా ఉమ్మేస్తారు… అనగానే నమ్మటం.. ఉమ్మటం.. రైమింగ్ బాగుంది అక్కోయ్. కానీ.. నా ఇంటర్వ్యూకు బాగా రెస్పాన్స్ వచ్చిందట బయట. ఇక్కడ నా ఫ్యాన్స్ చెప్పారు.. అంటుంది మోనిత.

karthika deepam 1 october 2021 friday episode 1159 highlights
మోనిత.. మాటల గారడీతో జీవితాంతం బతకలేవు గుర్తుంచుకో అంటుంది దీప. నాది కూడా సేమ్ ఫీలింగ్ దీపక్క. కాకిలా కలకాలం బతకాలని లేదు. కార్తీక్ తో కొన్ని రోజులు బతికినా చాలు.. అంటుంది. ఒక విషయం గుర్తుంచుకో మోనిత.. నేను ఉండగా నా భర్తను నువ్వు పొందడం అసాధ్యం అంటుంది దీప.. దీంతో మోనిత షాక్ అవుతుంది.. కార్తీక్ తో నా మెడలో ఒక తాళి కట్టించు.. ఇవన్నీ ఆపేస్తా అంటుంది. డీల్ ఓకేనా.. డీల్ ఓకే కాకపోయినా హ్యాపీ.. నేను చేసేది నేను చేస్తా.. అంటుంది మోనిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

karthika deepam 1 october 2021 friday episode 1159 highlights