Karthika Deepam 10 August 2022 Episode : శోభాని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన సౌర్య.. మారిపోయి సత్యంతో ప్రేమగా ఉంటున్న స్వప్న..

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: August 10, 2022, 10:30 am

కార్తీకదీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 10 బుధవారం ఎపిసోడ్ 1427 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. సత్యం నిరూపముని పెళ్ళికొడుగ్గా రెడీ చేసి తీసుకొని వస్తాడు. అప్పుడు నిరూపం నీ చూసి స్వప్న సంతోష పడిపోతూ ఉంటుంది. స్వప్న నిర్పంతో ఫొటోస్ దిగుతుంది. కట్ చేస్తే హిమ ఏడుస్తూ ఉంటుంది. సౌందర్య, ఆనందరావు వచ్చి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. నేను అనుకున్నదంతా జరిగిపోయింది. నిరుపం బావ పెళ్లి శోభతో జరిపించేస్తుంది స్వప్నత్త అంతా అయిపోయింది నాయనమ్మ. అని ఏడుస్తూ ఉండగా.. శౌర్య అక్కడికి వస్తుంది. వచ్చి శౌర్య ఏంటి ఈ నాటకాలు ఆపుతావా అని హిమాని అంటుంది. అప్పుడు సౌందర్య ఫోన్ ఇచ్చి నిరూపం పెళ్ళికొడుకుగా రెడీ అయిన ఫోటోలు చూపిస్తారు. అప్పుడు సౌర్య ఈ ఒక్క ఫోటోకి ఎందుకు కంగారుపడుతున్నారు . ఆ పెళ్లి జరగదు ఆ పెళ్లి ఈ మహా నటి తోనే జరిపిస్తానని చెప్పు నాయనమ్మ అంటుంది శౌర్య.

అప్పుడు హిమ నేను బాధపడేది నా గురించి కాదు నీ గురించి సౌర్య అని అంటుంది. చాల్లే ఆపు అని సౌర్య అంటుంది. అప్పుడు సౌందర్య ఏంటి మీ గొడవలు మమ్మల్ని అర్థం చేసుకోరా ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. మీరు కంగారు పడకండి నాయనమ్మ ఆ పెళ్లిని నేను ఆపుతాను. మీరు నాతో రండి అని స్వప్న వాళ్ళ ఇంటికి వాళ్ళని తీసుకొని వెళుతుంది శౌర్య. కట్ చేస్తే శోభ సెల్ఫీలు దిగుకుంటూ నేను అనుకున్నది జరుగుతుంది ఈ ఆస్తంతా నాదే అని సంతోష్ పడుతూ ఉంటుంది అంతలో అక్కడికి ఒక రౌడీని తీసుకొని శౌర్య వస్తుంది. సౌర్య స్వప్నని పిలుస్తుంది. ఏంటి మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి వీడెవడు అని అంటుంది. అప్పుడు శౌర్య రౌడీని నాలుగు పీకి సౌర్యను కిడ్నాప్ చేసిన విషయాన్ని వాడితోనే చెప్పిస్తుంది. అప్పుడు స్వప్న అయితే ఏంటి ఈ ఆటోదాన్ని బాధబరించలేక కిడ్నాప్ చేయించింది దానిలో తప్పేముంది అని అంటుంది స్వప్న. నువ్వు సూపర్ అత్త నీకు మంచి చేయాలి అనుకునే వాళ్లందర్నీ వదిలేసి.

Karthika Deepam 10 August 2022 Full Episode

Karthika Deepam 10 August 2022 Full Episode

నిన్ను మోసం చేయాలి అని వచ్చిందాన్ని నువ్వు నమ్ముతున్నావు. అసలు నీకు దీని గురించి ఏం తెలుసు అని అంటుంది శౌర్య.అప్పుడు హిమ శౌర్య గురించి నీకేం తెలుసు అత్త అని అంటుండగా.. శౌర్య నా గురించి ఇక్కడ నీతులు వల్లించాల్సిన అవసరం లేదు. నువ్వు ఆగు అని అంటుంది శౌర్య. అప్పుడు శోభ ఏదో అనుకుని వచ్చారు. కానీ ఏదో అయింది. ఇక ఎక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటుంది. అప్పుడు సౌర్య ఆఫీసర్లను కూడా పిలుస్తుంది. వాళ్లు ఏంటి శోభ మేడం మీరు అప్పు తీసుకొని తప్పించుకుని తిరుగుతున్నారు. అప్పు కట్టమని అడిగితే ఎవరో డాక్టర్ని పెళ్లి చేసుకుంటున్న వాళ్ళ అమ్మని బుట్టలో వేసుకున్న తీరుస్తా అని అన్నారు. మరి ఆ పెళ్లి కూడా ఆగిపోయేలా ఉందట.

అప్పుడు సౌందర్య ఇకనైనా కళ్ళు తెరువు సప్న అది నీ మీద ప్రేమ, నీ కొడుకు మీద ప్రేమతో కాదు పెళ్లికి ఒప్పుకుంది. హాస్పిటల్ కోసం చేసిన అప్పు తీరడం కోసం అది ఈ డ్రామాలన్నీ ఆడుతుంది అని అంటుంది. అప్పుడు శోభ ఇదంతా నమ్మకండి ఆంటీ ఆ ఆఫీసర్లు కూడా నిజమైన వాళ్ళు కాదు అని అంటుంది. అప్పుడు స్వప్న శోభ చెంప పగలగొడుతుంది. తనని బయటికి వెళ్లగొడుతుంది. శోభ శౌర్యకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అప్పుడు అందరూ మీలాంటోళ్ళని చాలామందిని చూశాం వెళ్ళు అని అంటారు. అప్పుడు స్వప్న అందరితో కలిసిపోతుంది. కట్ చేస్తే స్వప్న మారి సత్యంతో ప్రేమగా ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp