Karthika Deepam 12 May Today Episode : నిరుపమ్ తో పెళ్లి ఇష్టం లేదని నిశ్చితార్థంలో హిమ ఎందుకు చెప్పింది? జ్వాల నిరుపమ్ ను ప్రేమిస్తోందని తింగరికి ముందే తెలుసా?

Authored By Varun G | The Telugu News | Published on: May 12, 2022, 10:30 am

Karthika Deepam 12 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 మే 2022, గురువారం ఎపిసోడ్ 1350 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్వాలను షాపింగ్ నకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి ఐస్ క్రీమ్ షాపునకు తీసుకొస్తుంది తింగరి. ఈరోజు ఎలాగైనా జ్వాలకు అసలు నిజం చెప్పాలని అనుకుంటుంది హిమ. నీకు నేను ఒక ముఖ్యమైన మాట చెప్పాలి అంటుంది హిమ. దీంతో నేను కూడా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి తింగరి అని అంటుంది జ్వాల. డాక్టర్ సాబ్ గురించి తింగరికి చెబితే తప్పేముంది.. ఏదైనా ఐడియా ఇస్తుందేమో అని అనుకుంటుంది జ్వాల. ముందు నువ్వే చెప్పు అంటుంది జ్వాల. లేదు.. ముందు నువ్వే చెప్పు అంటుంది తింగరి.

karthika deepam 12 may 2022 full episode

karthika deepam 12 may 2022 full episode

ఇంతలో జ్వాలకు ఫోన్ వస్తుంది. లోన్ గురించి ఏదో ఫోన్ వస్తుంది. నాకు లోన్ వద్దు.. గీన్ వద్దు అని ఫోన్ పెట్టేస్తుంది జ్వాల. ఈ ఫోన్ చూశావా.. డాక్టర్ సాబ్ గిఫ్ట్ ఇచ్చారు అంటుంది. డాక్టర్ సాబ్ మంచోడు కదా అంటుంది జ్వాల. ఏదో చెబుతా అన్నావు చెప్పు తింగరి అంటుంది జ్వాల. ఇంతలో ఐస్ క్రీమ్ వస్తుంది. ఇలాంటి ఐస్ క్రీమ్ లు ఈ మధ్య కాలంలో తినలేదు. ఒక పట్టు పట్టాల్సిందే అంటుంది జ్వాల. చెప్పు తింగరి.. ఏదో చెప్తా అన్నావు కదా అని అడుగుతుంది జ్వాల.

దీంతో నువ్వు ముందు తృప్తిగా తిను. తర్వాత మనం తీరిగ్గా మాట్లాడుకుందాం అంటుంది జ్వాల. ఇంతలో తన డ్రెస్ మీద ఐస్ క్రీమ్ పడటంతో కడుక్కోవడానికి వాస్ రూమ్ వెళ్తుంది జ్వాల. వచ్చి చూసేసరికి.. తింగరి కనిపించదు తనకు. ఎక్కడికి వెళ్లింది అని అక్కడ ఉన్నవాళ్లను అడిగితే.. తను బిల్ పే చేసి వెళ్లిపోయింది అని అంటారు.

Karthika Deepam 12 May Today Episode : చిరాకులో ప్రేమ్.. హిమను మరిచిపోయేందుకు ప్రయత్నిస్తున్న ప్రేమ్

దీంతో తను ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని అనుకుంటుంది. ఎంత అర్జెంట్ పని ఉందో ఏంటో అని అనుకొని అక్కడి నుంచి జ్వాల కూడా వెళ్లిపోతుంది. మరోవైపు ప్రేమ్ కు చాలా చిరాకు వేస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. గట్టిగా అరుస్తాడు. ఏంటి అమ్మమ్మ ఇలా చేశావు. నా ఆశల మీద నిప్పులు పోశావు. నా ప్రేమను సమాధి చేశావు అని అనుకుంటాడు.

హిమే నా సర్వస్వం అనుకున్నాను.. ఫోటోగ్రఫీ కన్నా ఎక్కువగా ప్రేమించాను అని అనుకుంటాడు. ఆ తర్వాత హిమ ఫోటోలన్నీ తన ఫోన్ లో నుంచి డిలీట్ చేస్తాడు. అమ్మమ్మకు కూడా తెలుసు కదా.. చిన్నప్పటి నుంచి హిమ అంటే ఎంత ఇష్టమో. తెలిసి కూడా ఇలా చేసిందేంటి అని అనుకుంటాడు ప్రేమ్.

ఇంతలో నిరుపమ్, హిమ ఇద్దరి ఎంగేజ్ మెంట్ కోసం రింగ్ కొందాం పదా అడుగుతాడు సత్యం. నేను రాలేను అంటాడు ప్రేమ్. మరోవైపు నీ ఎంగేజ్ మెంట్ కోసం నీ ఫ్రెండ్ ను తీసుకురాకపోయావా అని అడుగుతుంది సౌందర్య హిమను. తర్వాత నిన్ను ఒక మాట అడగొచ్చా అని హిమ.. సౌందర్యను అంటుంది.

దీంతో నువ్వు ఏం అనుకుంటున్నావో నాకు తెలుసు. సడెన్ గా ఈ ఎంగేజ్ మెంట్ ఏంటి అని అంటావా అంటుంది. ఇది కేవలం ఎంగేజ్ మెంట్ మాత్రమే. పెళ్లి శౌర్య దొరికాకే జరుగుతుంది. నీ పెళ్లిలోగా.. శౌర్యను నేనే వెతికి తీసుకొచ్చి అప్పుడే నీ పెళ్లి చేస్తాను అంటుంది.

అయ్యే నానమ్మ.. జ్వాలే శౌర్య అని నీకు తెలియదు. ఆ మాట నీకు చెప్పాలని ఉన్నా.. చెప్పలేని పరిస్థితి నాది అని మనసులో అనుకుంటుంది తింగరి. మరోవైపు జ్వాల చాలా సంతోషంగా ఉంటుంది. హిమ కొనిచ్చిన చీరను చూస్తూ చాలా సంతోషంగా ఉంటుంది.

ఆ చీరను తనకోసం డాక్టర్ సాబ్ పంపించాడని ఫుల్ ఖుషీ అవుతుంది.  ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp