Sarkaru Vaari Paata Movie Review : సర్కారు వారి పాట మూవీ రివ్యూ, రేటింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sarkaru Vaari Paata Movie Review : సర్కారు వారి పాట మూవీ రివ్యూ, రేటింగ్

 Authored By aruna | The Telugu News | Updated on :12 May 2022,8:23 am

Sarkaru Vaari Paata Movie Review : భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. లాంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హ్యాట్రిక్ కొట్టాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ మూడు సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. ఆ తర్వాత సుమారు రెండున్నర ఏళ్ల గ్యాప్ తర్వాత మహేశ్ బాబు నటించిన చిత్రం సర్కారు వారి పాట. కోవిడ్ కారణంగా సినిమా విడుదల లేట్ అయినప్పటికీ.. ఫుల్ ప్యాక్ తో ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ ను అందించేందుకు మహేశ్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. గీత గోవిందం సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించుకున్న పరుశరామ్.. ఈ సినిమాకు డైరెక్టర్. మహేశ్ సరసన.. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించగా.. తమన్ సంగీతం అందించాడు. హ్యాట్రిక్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించిన మహేశ్.. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధించాడా? అసలు ఏంటి ఈ సర్కారు వారి పాట. ఈ సినిమా కథ ఏంటి.. తెలుసుకుందాం రండి.

Sarkaru Vaari Paata Movie Review కథ

ఈ సినిమాలో మహేశ్ బాబు పేరు కూడా మహేశే.. కాకపోతే అందరూ ముద్దుగా మహీ అని పిలుస్తారు. తను ఒక వడ్డీ వ్యాపారీ. తనకు ఒక మహీ ఫైనాన్సియల్ కార్పొరేషన్ అనే ఫైనాన్స్ షాపు ఉంటుంది. దాని ద్వారా అందరికీ డబ్బులు వడ్డీకి ఇస్తుంటాడు. కాకపోతే చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు మహీ. తను ఎవరికి డబ్బులు ఇచ్చినా సమయానికి వాళ్లు ఇవ్వకపోతే వాళ్ల నుంచి ఎలా వసూలు చేయాలో కూడా మహీకి తెలుసు. డబ్బు వసూలు చేయడం కోసం ఎంత దూరం అయినా వెళ్తాడు? తర్వాత ఓసారి డబ్బులు వసూలు చేయడం కోసం మహీ యూఎస్ కు వెళ్లాల్సి వస్తుంది. అక్కడే మహీకి కీర్తి సురేశ్ పరిచయం అవుతుంది. తన పేరు కళావతి. తన చదువు కోసం మహీ నుంచి కొంత డబ్బును అప్పుగా తీసుకుంటుంది. మహీ.. తనను చూడగానే ప్రేమలో పడతాడు. తను ఎంత డబ్బు అడిగినా ఇచ్చేస్తు ఉంటాడు. కట్ చేస్తే బడా వ్యాపారవేత్త సముద్రఖని(రాజేంద్రనాథ్)తో మహికి గొడవ జరుగుతుంది. ఆ తర్వాత రాజేంద్రనాథ్ స్కామ్ ను మహీ బయటపెడతాడు. రాజేంద్రనాథ్ కు, మహీకి మధ్య తర్వాత ఎలాంటి వార్ జరుగుతుంది? రాజేంద్రనాథ్ కు, మహీ తండ్రికి ఉన్న సంబంధం ఏంటి? మహీ చిన్నప్పుడు ఏం జరిగింది? మహీ తండ్రి అన్నీ వదిలేసుకొని కేవలం ఒక రూపాయి బిళ్లతో ఎందుకు వెళ్తాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెర మీద చూడాల్సిందే.

Sarkaru Vaari Paata Movie Review and Rating in Telugu

Sarkaru Vaari Paata Movie Review and Rating in Telugu

Sarkaru Vaari Paata Movie Review : సినిమా పేరు : సర్కారు వారి పాట

నటీనటులు : మహేశ్ బాబు, కీర్తి సురేశ్, సముద్రఖని, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, నదియ, శౌమ్య మీనన్, అజయ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, మహేశ్ మంజ్రెకర్, రవి ప్రకాశ్, సత్యం ప్రకాశ్ తదితరులు
డైరెక్టర్ : పరుశరామ్
కథ : పరుశరామ్
నిర్మాతలు : నవీన్ ఎర్నేనీ, వై రవి శంకర్, రామ్ అచంట, గోపిచంద్ అచంట
ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేశ్
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్ తమన్
బడ్జెట్ : రూ.60 కోట్లు
రన్నింగ్ టైమ్ : 160 నిమిషాలు
ప్రొడక్షన్ హౌసెస్ : మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్, జీ మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్
రిలీజ్ డేట్ : 12 మే 2022

Sarkaru Vaari Paata Movie Review : విశ్లేషణ

ఈ సినిమాను ఒన్ మ్యాన్ షోగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహేశ్ మాత్రం జీవించేశాడు. మహేశ్ మాస్ డైలాగ్స్ తో పాటు కామెడీ టైమింగ్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో మహేశ్ ఎనర్జీ కూడా సూపర్బ్ అనిపించింది. కీర్తి సురేశ్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. తన అందాలను ఆరబోసింది. కమెడియన్ గా వెన్నెల కిషోర్ అదరగొట్టేశాడు. సముద్రఖని.. తన విలనిజాన్ని పండించాడు.సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. సినిమాకు ముందే విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన పాటలు స్క్రీన్ మీద మరింత బెస్ట్ గా కనిపించాయి. ఓవర్ ఆల్ గా సినిమాను పరుశరామ్.. అద్భుతంగా తెరకెక్కించడంతో పాటు ప్రేక్షకులకు సరికొత్త మహేశ్ బాబును పరిచయం చేశాడు.

ప్లస్ పాయింట్స్

సినిమాకు ప్లస్ పాయింటే మహేశ్ బాబు. ఆయన లేని సినిమాను ఊహించలేం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్లే, కామెడీ, హీరోయిన్ కీర్తి.. వీళ్లంతా సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యారు.

మైనస్ పాయింట్స్

ఈ సినిమాకు ఎడిటింగ్ మైనస్ పాయింట్. అలాగే.. సెకండ్ హాఫ్ కొద్దిగా సాగదీసినట్టుగా ఉంటుంది.

కన్ క్లూజన్

చివరగా చెప్పొచ్చేదేంటంటే… మహీ పాత్రను దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు. మాస్, క్లాస్ అభిమానులకు నచ్చేలా.. మహేశ్ ను తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. అలాగే.. సినిమా ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ గా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే.. సర్కారు వారి పాట తెలుగు ప్రేక్షకులకు ఒక విందు భోజనంలా అనిపిస్తుంది. రెండున్నర గంటల సేపు కేవలం మహేశ్ ను చూస్తూ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.
దితెలుగున్యూస్ రేటింగ్ : 3.25 / 5

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది