Karthika Deepam 13 Sep Monday Episode : కార్తీక దీపం సీరియల్ క్లయిమాక్స్ స్టేజ్ కు వచ్చేసినట్టు అనిపిస్తోంది. సోమవారం ఎపిసోడ్ తో సీరియల్ ను డైరెక్టర్ ముగించేస్తాడా? లేదా.. ఆ వారంలో ముగిస్తాడా? అనేది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే.. మోనిత చేతికి దీప దొరికితే.. తన రూమ్ కు తీసుకెళ్లి.. తను రహస్యంగా ఉండే ప్రదేశాన్ని దీపకు చూపించి మోనిత అడ్డంగా దొరికిపోయింది. అలాగే.. చంపేస్తా.. అంటూ దీపకు గురి పెట్టి.. అదీ ఇదీ మాట్లాడుతుండగా.. దీప తెలివితో మోనిత చేతుల్లో నుంచి గన్ లాక్కొని తనకు గురిపెట్టింది.
దీంతో.. ఏం చేయాలో తెలియక తన కాళ్లు పట్టుకుంటుంది మోనిత. నాకు నీ మొగుడు అంటే చాలా ఇష్టం.. నాకు నీ మొగుడు కావాలి.. అందరం హ్యాపీగా ఉందాం. నేను కూడా కార్తీక్ తో ఉంటా.. అంటూ తెగ బాధపడిపోయింది మోనిత. కానీ.. మోనిత ఎత్తులను దీప పట్టించుకోకుండా.. నా మొగుడిని నీకు ఇవ్వడం ఏంటి.. నీ కుట్రలకు ఇక అంతం పడింది.
ఇక నీ పని అయిపోయింది. ఇన్నేళ్లు.. నన్ను పట్టించుకున్నావు కాబట్టి.. నేను ఏమనలేదు కానీ.. నా భర్త జోలికి వస్తే నేను ఊరుకుంటానా? నా భర్తనే జైలుకు పంపించాలని చూస్తావా? అంటూ దీప మోనితపై సీరియస్ అవుతుంది.
మరోవైపు కోర్టులో కార్తీక్ విచారణ జరుగుతుంటుంది. ఇరు వర్గాల లాయర్ల వాదోపవాదాలు విన్న జడ్జి.. తీర్పు వెలువరించేందుకు సన్నద్ధం అవుతాడు. లాయర్ల వాదనతో పాటు.. కార్తీక్ వాదనను, కార్తీక్ తల్లి సౌందర్య వాదనను కూడా వింటాడు. దీంతో కార్తీకే ఈ నేరం చేసినట్టుగా రుజువు అయింది అని అంటాడు.
కార్తీక్ మీద మోపిన అభియోగం.. డాక్టర్ మోనితను చంపాడు.. అని చెప్పడం నిజమే అని నిరూపితమైంది.. అని అంటాడు. నేరం రుజువైనందున కార్తీక్ కు.. ఏ శిక్ష వేయాలో చెప్పబోతుండగానే.. కోర్టుకు దీప వస్తుంది.
ఆగండి.. యువర్ ఆనర్ అంటుంది.. నేను కార్తీక్ భార్యను. బోనులో నిలబడ్డ వ్యక్తి నా భర్త. ఈ కేసుకు సంబంధించి ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరుతున్నట్టు చెబుతుంది. దీంతో.. కోర్టు పర్మిషన్ ఇస్తుంది. జడ్జి కూడా ఓకే ప్రవేశపెట్టండి.. అంటాడు.
దీంతో అందరూ ఎవరా సాక్షి అని అంతా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అసలు.. ఆ సాక్షి ఎవరు? కార్తీక్ నేరం చేయలేదు.. అని చెప్పే అతిముఖ్యమైన సాక్షి ఎవరు? అని అంతా చూస్తుంటారు. ఏసీపీ రోషిణి ఆ సాక్షిని చూసి షాక్ అవుతుంది. సౌందర్య, ఆనంద రావు, ఆదిత్య.. అయితే.. ఒక్కసారిగా ఆ సాక్షిని చూసి నిలబడతారు.
కార్తీక్ కూడా ఆ సాక్షిని చూసి షాక్ అవుతాడు. ఇంతకీ ఆ సాక్షి ఎవరు..? మోనితనే గన్ తో బెదిరించి దీప కోర్టుకు తీసుకొస్తుందా? లేక మోనితను చంపేసి.. తన శవాన్ని తీసుకొస్తుందా? లేక వారణాసి.. మోనితను చూశాడు కాబట్టి.. మోనిత గురించి చెప్పడానికి వారణాసిని తీసుకొస్తుందా? అనే విషయాలు తెలియాలంటే.. సోమవారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
ఒకవేళ.. మోనితను బెదిరించి.. దీప కోర్టుకు తీసుకొస్తే మాత్రం ఇక సీరియల్ అయిపోయినట్టే. సీరియల్ క్లయిమాక్స్ కు చేరుకున్నట్టే. మోనిత జైలుకు వెళ్తుంది. కార్తీక్ రిలీజ్ అవుతాడు. దీప, పిల్లలతో సంతోషంగా ఉంటాడు. ఒకవేళ దీప దగ్గర్నుంచి మోనిత తప్పించుకున్నా.. మోనిత ఉండే ఇల్లు.. అవన్నీ తెలుసు కాబట్టి.. పోలీసులకు చెప్పి వారణాసితో సాక్ష్యం ఇప్పించి మరీ మోనితను పట్టుకునేలా దీప చేస్తుందా? అనే విషయం తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాలి.
అయితే.. శనివారం ఎపిసోడ్ లో కార్తీక్ తప్పు చేశాడని.. మోనితను చంపింది కార్తీక్ అని కోర్టులో రుజువు అవుతుంది. మోనితకు కడుపు చేసి.. కావాలని మోనిత పీడ విరగడ చేసేందుకే చంపాడని.. కార్తీక్ డాక్టర్ కాదు.. అనుమానిత మొగుడు అని.. అందుకే దీపను పదేళ్ల పాటు వదిలేశాడని.. పిల్లలు కూడా తన పిల్లలు కాదన్నాడని మోనిత తరుపు లాయర్ అంటాడు. మరోవైపు దీప తలకు గన్ గురిపెట్టి మోనిత.. తను ఉండే రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి చంపేద్దామని భావిస్తుంది కానీ.. అది కుదరలేదు. తన గన్ ను లాక్కొని దీప.. మోనితకే గురి పెట్టడంతో కథ మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.