Karthika Deepam 15 Feb Today Episode : మోనిత బాబాయి ఎంట్రీ.. బస్తీకి వెళ్దామనుకున్న దీపకు భారీ షాక్.. మోనిత విషయంలో కార్తీక్ షాకింగ్ నిర్ణయం

Karthika Deepam 15 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 ఫిబ్రవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 1276 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అన్ని దారులు మూసుకుపోయాక మరో కొత్త నాటకం మొదలైందా రవి గారు అంటుంది దీప. నేను నిజాయితీగా కార్తీక్ మంచి కోసమే కష్టపడ్డాను అంటుంది మోనిత. దీంతో క్రూర మృగం అహింస గురుంచి చెబుతున్నట్టుగా ఉంది అంటుంది దీప. నాటకాలు ఆడటం నీకు కొత్త కాదు కదా. నిన్ను ఎవ్వరూ నమ్మరు కానీ.. అత్తయ్య గారు చెప్పినట్టు భోం చేసి వెళ్లు. వంటలు నేనే చేశాను. భోజనం చాలా రుచిగా ఉంటుంది అంటుంది దీప. నేనేం భోజనం చేయడానికి రాలేదు అంటుంది మోనిత. మర్యాదగా వెళ్లిపో. లేదంటే నీకు ఇష్టమైన.. అర్థమైన భాషలోనే చెబుతాను అంటుంది దీప.

karthika deepam 15 february 2022 full episode

దీంతో నీచేతులతోనే తాళి కట్టించుకుంటా. ఆరోజు త్వరలోనే వస్తుంది కార్తీక్ అని మనసులో అనుకుంటుంది దీప. ఏం ఆలోచిస్తున్నావు మోనిత. మా ఇద్దరితో సెల్ఫీ తీసుకుంటావా.. తీసుకో.. ఆదిత్య ఫోన్ ఇటు ఇవ్వు అంటూ సెల్ఫీ తీస్తుంది దీప. దీంతో అక్కడి నుంచి చిరాకుగా వెళ్లిపోతుంది మోనిత. ఇంటికి వెళ్లాక.. కార్తీక్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది మోనిత. దీప చెప్పిన విషయాలనే ఆలోచిస్తూ ఉంటుంది. అసలేంటిది.. దూరంగా వెళ్లినా వీళ్లిద్దరి బంధం మరింత బలపడింది. వచ్చీ రాగానే వీళ్ల అనుబంధం ఏంటో.. పెళ్లి సందడి ఏంటో.. పెళ్లి ఏంటో.. అసలు ఏం అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి.. మోనిత అంటే ఏంటో వీళ్లకు మరోసారి తెలిసేలా చేయాలి అని అనుకుంటుండగానే తన బాబాయి ఫోన్ చేస్తాడు.

బాబాయిని ఎందుకు వాడుకోకూడదు. వాడకంలో మన తర్వాతనే ఎవరైనా కదా. బాబాయినే దీనికి వాడుకోవాలి.. అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో బాబాయి.. ఎలా ఉన్నారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది బాబాయి అంటుంది. ఆరోగ్యం గురించి ఏం అడుగుతావమ్మా.. నేను ఆశలు వదిలేసుకున్నాను అంటాడు.

ఎందుకు బాబాయి అలా మాట్లాడుతున్నావు. నేను ఉన్నాను కదా.. నీకోసం నేను ఏదైనా చేస్తాను అంటుంది. డాక్టర్ కార్తీక్ అయితే సర్జరీ చేస్తారని విన్నాను. ఆయన అపాయింట్ మెంట్ దొరుకుతుందా అని అడుగుతాడు. దీంతో ఏం మాట్లాడుతున్నావు బాబాయి. కార్తీక్ మీ అల్లుడు అంటుంది. ఫోన్ లో ఇంకా ఏవో విషయాలు చెబుతుంది.

బాబాయి నీ కష్టం ముందు నా కష్టం ఎంత. మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. మీరు ఇక్కడికి వచ్చేయండి బాబాయి. కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నాకంటూ ఇంకెవరు ఉన్నారు.. అంటుంది. నేను ఇంకా నమ్మలేక ఉన్నాను. కార్తీక్, నువ్వు పెళ్లి చేసుకున్నారంటే నమ్మలేకపోతున్నాను అంటాడు.

Karthika Deepam 15 Feb Today Episode : కార్తీక్ కు దగ్గరవడం కోసం తన బాబాయిని వాడుకున్న మోనిత

కార్తీక్ కు దగ్గరవ్వడానికి బాబాయిని వాడుకుంటాను అని అనుకుంటుంది మోనిత. కార్తీక్ నీ బిడ్డను కని.. నాకు నేను తాళి కట్టుకొని.. నాకు నేను నీ భార్యగా ప్రపంచానికి చెబుతుంటే.. నువ్వు మాత్రం పట్టించుకోవా. ఇద్దరూ కలిసి బయటికి వెళ్లిపోతారా. తిరిగి వచ్చాక పెళ్లి రోజులు జరుపుకుంటారా అంటూ తనలో తాను అనుకుంటుంది.

కట్ చేస్తే దీప రెడీ అయి బస్తీకి వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. అత్తయ్య నేను ఒక సారి బస్తీకి వెళ్లి వస్తాను అంటుంది దీప. దీంతో సౌందర్య షాక్ అవుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. మీరు ఇక్కడ లేనప్పుడు చాలా విషయాలు జరిగాయి అంటుంది సౌందర్య.

అవును వదిన.. ఆ మోనిత వచ్చి చాలా గొడవ చేసింది అంటాడు ఆదిత్య. తన బాబును ఆదిత్య ఎత్తుకెళ్లాడని గొడవ చేసింది అంటుంది శ్రావ్య. అంతే కాదు వదిన.. తన హాస్పిటల్ ను అమ్మేసి.. బస్తీలో మీరు ఉన్న ఇంటిని కొనుక్కొని అక్కడ ఆసుపత్రి పెట్టింది అని చెబుతాడు ఆదిత్య.

ఇలాంటప్పుడు నువ్వు బస్తీకి వెళ్తే అది అక్కడే ఉంటుంది అని చెబుతుంది సౌందర్య. కోరి కొరివితో తలగోక్కోవడం ఎందుకు చెప్పు అంటుంది సౌందర్య. అవును వదిన ఇప్పుడు వెళ్లకండి అంటాడు ఆదిత్య. మొదటి నుంచి మనం చేస్తున్న తప్పు ఇదే ఆదిత్య.

మన తప్పు లేకున్నా మనకు భయపడుతున్నాం. ఇది కరెక్ట్ కాదు. ముందు తనకు భయపడటం ఆపేయాలి అంటుంది దీప. మోనిత బాబు నిజంగా తప్పిపోయాడా… లేక అబద్ధాలు ఆడుతోందా.. ఏంటో ఏం అర్థం కావడం లేదు అని అనుకుంటాడు కార్తీక్.

మరోవైపు మోనిత బాబాయి ఇంటికి వస్తాడు. కానీ.. ఆయనకు అస్సలు మోనితను చూసి నమ్మబుద్ధి కాదు. అతడిని నమ్మించడం కోసం ఏడుపు యాక్టింగ్ మొదలు పెడుతుంది. బాబాయి.. గతంలో నిన్ను నేను ఏదైనా అని ఉంటే అవన్నీ మనసులో పెట్టుకోకు బాబాయి. నన్ను క్షమించు బాబాయి.. అంటూ తన కాళ్ల మీద పడుతుంది.

దీంతో ఏంటమ్మా ఇది లే.. అని అంటాడు. అప్పుడు కానీ.. మోనితను నమ్మడు. నీకు కొంచెం కోపం ఎక్కువ.. ప్రేమ కూడా ఎక్కువేనమ్మా అంటాడు. మరోవైపు కార్తీక్.. తొలిసారి హాస్పిటల్ కు వస్తాడు. దీంతో అందరూ కార్తీక్ కు వెల్ కమ్ చెబుతారు.

వెళ్లి తన సీటులో కూర్చుంటాడు. తనకు అన్నీ గుర్తొస్తాయి. ఇంతలో మీరు హాస్పిటల్ కు రాగానే మోనిత గారు గుర్తు చేయమన్నారు. మీరు వచ్చినట్టు చెప్పాలా వద్దా అని రిసెప్షనిస్ట్ వచ్చి అడుగుతుంది. దీంతో అవసరం లేదు అంటాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

29 minutes ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

12 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

15 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

19 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

22 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

1 day ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

2 days ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

2 days ago