Karthika Deepam 16 Feb Today Episode : బాబాయిని అడ్డం పెట్టుకొని మోనిత మరో ప్లాన్.. కార్తీక్ ను మరోసారి ఇరికించబోతోందా? మరోవైపు మోనితకు దీప భారీ షాక్

Karthika Deepam 16 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 ఫిబ్రవరి, 2022 బుధవారం ఎపిసోడ్ 1277 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంట్లోని వస్తువులన్నింటినీ సర్దుతుంది దీప. దీంతో సౌందర్య వచ్చి తనను చూస్తుంటుంది. ఏంటి అత్తయ్య నన్ను అలా చూస్తున్నారు అంటుంది దీప. చూడనీయు.. ఏమవుతుంది.. అంటుంది. ఇష్టమైన వాళ్లు వెళ్లిపోతే ఎంత బాధుంటుందో మీరు వెళ్లాకే తర్వాత అర్థమైంది అంటుంది సౌందర్య. మీరు వచ్చారు అన్నీ శుభాలే కలుగుతున్నాయి. కార్తీక్ హాస్పిటల్ కు వెళ్లాడు కానీ.. ఇంతకాలం సంపాదించుకున్న డబ్బు, పేరు పోయింది దీప అంటుంది సౌందర్య. డబ్బుదేముంది అత్తయ్య. డబ్బు సంపాదించాలి అనుకుంటే డాక్టర్ బాబు ఎంతైనా సంపాదించవచ్చు.. అంటుంది దీప.

karthika deepam 16 february 2022 full episode

వాడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో తెలియదు కానీ.. నువ్వు వాడికి భార్యగా దొరికావు అంటుంది సౌందర్య. మరోవైపు ఆసుపత్రిలో తన కుర్చీలో కూర్చొని దీనంగా ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. ఇంతలో మోనిత వస్తుంది. లోపలికి రావచ్చా అంటుంది. సారీ సారీ.. మనకు మనకు పర్మిషన్లు ఏంటి చెప్పు అంటుంది. లోపలికి వచ్చి కంగ్రాట్స్ మిస్టర్ కార్తీక్. వెల్ కమ్ బ్యాక్. మీ రాకకు ఈ మోనిత సంతోషిస్తుంది అంటుంది మోనిత. నా ప్రేమను తెలపాలంటే.. ఈ భూమి మీద ఉన్న పూలను ఇచ్చినా కూడా సరిపోవు కార్తీక్ అంటుంది మోనిత. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి మోనిత అని అడుగుతాడు కార్తీక్. కాళ్లు లాగుతున్నాయి కార్తీక్ కూర్చొని మట్లాడుతా అంటుంది మోనిత.

కార్తీక్.. నిన్ను ఇలా డాక్టర్ గా మళ్లీ చూడటం బాగుంది. బాగలేనిది ఏంటంటే.. దీపక్క పేరు మీద వంటలక్క ప్రజా వైద్యశాల అని పేరు పెట్టానా.. నా కార్తీక్ ఆశీస్సులతో అని రాయించాను. అదే బోర్డు కింద డాక్టర్ మోనిత కార్తీక్ అని రాయించాను. ఇంట్లో ఒక ఫోటో కూడా పెట్టించాను.. అంటూ చెబుతుండగానే మోనిత ఇక ఆపుతావా. ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు అంటాడు కార్తీక్.

అక్కడ హాస్పిటల్ పెట్టి.. బోర్డు పెట్టి.. ఇంట్లో మేకు పెట్టి మన ఫోటో అందరికీ కనిపించేలా ఎందుకు పెట్టానో తెలుసా.. మన మధ్య ఉన్న అనుబంధం, అనురాగం అందరికీ తెలియాలని అంటుంది. మోనిత నువ్వు ఎక్కువ చేస్తున్నావు అంటాడు కార్తీక్. అవును.. నేను ఎక్కువ చేస్తాను కానీ.. నువ్వు మాత్రం ఏం తెలియనట్టు ప్రవర్తిస్తున్నావు అంటుంది మోనిత.

మోనిత ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు. ఇక ఆపేయ్ అంటాడు కార్తీక్. దీంతో అవన్నీ ఆపేయడానికే వచ్చాను అంటుంది మోనిత. బస్తీలో ఆసుపత్రి ఉండదు. బోర్డు ఉండదు. ఇంట్లో ఫోటో ఉండదు. అవన్నీ ఆపేస్తా. అవన్నీ చేయాలంటే నువ్వు ఒక పని చేయాలి. నాకు ఒక మాట ఇవ్వాలి కార్తీక్ అంటుంది మోనిత.

Karthika Deepam 16 Feb Today Episode : వారణాసికి పని అప్పజెప్పిన దీప

అలా అనుమానంగా చూడకు కార్తీక్. నేనేమీ పెద్ద పెద్ద కోరికలు కోరనులే. ఇవన్నీ నేను చేసినందుకు బదులుగా నువ్వు మా బాబాయికి హార్ట్ ఆపరేషన్ చేయాలి అంటుంది మోనిత. పాపం మా బాబాయి.. చాలా సీరియస్ స్టేజ్ లో ఉన్నాడు. అమెరికాలో అయితే ఎక్కువ ఖర్చు అవుతుందని ఇక్కడికి వచ్చాడు అని చెబుతుంది మోనిత.

నువ్వు ఆపరేషన్ చేస్తే మా బాబాయి బతుకుతాడు అంటుంది. దీంతో ఆపరేషన్ చేస్తే.. నువ్వు చెప్పినవన్నీ చేస్తావా అని అడుగుతాడు కార్తీక్. నేను మాటంటే మాటే కార్తీక్.. అంటుంది మోనిత. దీంతో సరే అంటాడు కార్తీక్. ఆపరేషన్ డేట్ తొందరగా ఫిక్స్ చేయి.. పేషెంట్ ను తీసుకొస్తాను అంటుంది మోనిత.

మరోవైపు.. మన అబ్బాయిని ఎవరో ఎత్తుకెళ్లారు అంటుంది మోనిత. నీకు తెలుసు కదా. ఎంతైనా తల్లిని కదా. నువ్వు ఎంతైనా తండ్రివే కదా అంటుంది మోనిత. వాడు కూడా నీ కొడుకే కదా కార్తీక్ అంటుంది. మామయ్య గారి పేరే పెట్టాను అంటుంది మోనిత.

సర్లే.. ఆనంద రావు గారిని నేనే వెతుక్కుంటాను. బాబాయి ఆపరేషన్ సంగతి త్వరగా చూడు కార్తీక్.. అని చెబుతుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త.. అని చెప్పి వెళ్లబోతుంది. మొత్తానికి మాటిచ్చావు కదా. ఇక నా ఆట నేను ఆడుతాను అని అనుకుంటూ వెళ్లిపోతుంది మోనిత.

మరోవైపు దీప.. వారణాసికి ఫోన్ చేస్తుంది. అక్క.. అక్క నువ్వేనా. ఎక్కడున్నావు అక్క.. ఎలా ఉన్నావు అక్క. ఏంటక్కా ఇలా చేశారు అంటాడు వారణాసి. మేము బాగానే ఉన్నాం. ఇంటికి వచ్చాం అంటుంది. నేను అన్ని విషయాలు తర్వాత చెబుతా కానీ.. నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతుంది.

దీంతో బస్తీలోనే ఉన్నాను అక్క అంటాడు వారణాసి. దీంతో మోనిత ఆసుపత్రికి ఎంత దూరంలో ఉన్నావు అని అడుగుతుంది. రెండు అడుగులే అక్క అంటాడు వారణాసి. దీంతో అక్కడికి వెళ్లి వీడియో కాల్ చేయి అంటుంది దీప. దీంతో సరే అంటాడు.

అక్కడికి వెళ్లి ఫోన్ చేస్తాడు. బోర్డు చూస్తుంది దీప. ఆ బోర్డును మొత్తం నాశనం చేయి అని చెబుతుంది దీప. దీంతో ఆ బోర్డును ముక్కలు ముక్కలుగా చేస్తాడు. ఇంతలో మోనిత బాబాయి వస్తాడు. బస్తీ వాసులు అక్కడికి వస్తారు. నువ్వు చెప్పినట్టే చేశాను అక్క అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

మరోవైపు మోనిత గురించే ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. ఏం చేయాలో అర్థం కాదు. మోనిత చెప్పినట్టు వాళ్ల బాబాయికి ఆపరేషన్ చేస్తే తప్పేంటి అని అనుకుంటాడు కార్తీక్. ఒక డాక్టర్ గా పేషెంట్ ను బతికించానన్న తృప్తి ఉంటుంది. మోనిత చెప్పినట్టు అవన్నీ ఆపేస్తే బెటర్ కదా అనుకుంటాడు కార్తీక్. ఈ విషయం ఒకసారి దీపతో మాట్లాడితే బెటర్ ఏమో అనుకుంటాడు కార్తీక్.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Bonalu In Telangana : బోనాల పండుగలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి… అవేంటో తెలుసా…?

Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…

8 minutes ago

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

9 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

10 hours ago

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

11 hours ago

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!

Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…

12 hours ago

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్

Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…

13 hours ago

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, పండుగ సాయ‌న్న మ‌ధ్య బాండింగ్ ఏంటి.. అస‌లుఎవ‌రు ఇత‌ను..?

Hari Hara Veera Mallu : పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…

14 hours ago

Jagadish Reddy : క‌విత‌ని ప‌ట్టించుకోన‌వ‌సరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

15 hours ago