Karthika Deepam 16 March Today Episode : హిమ, శౌర్య మధ్య వైరం.. ఎంత దూరం వెళ్తుంది.. మోనిత కొడుకే ఆనంద్ అని తెలుసుకొని హిమ షాకింగ్ నిర్ణయం
Karthika Deepam 16 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 మార్చి 2022, బుధవారం ఎపిసోడ్ 1301 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హిమ.. చిక్ మగళూరు నుంచి హైదరాబాద్ వస్తుంది. హిమ ఫోటోను అప్పుడే శౌర్య బయటికి విసిరేస్తుంది. హిమ ఫోటోను బయటకు విసిరేయడం చూసి షాక్ అవుతుంది హిమ. తన కాళ్ల దగ్గర పడుతుంది. తన ఫోటోను విసిరేయడంతో ఏడుస్తుంది. హిమ వచ్చిన విషయాన్ని ఇంటి వాళ్లు చూడరు. తన బయటి నుంచే వాళ్లను చూస్తుంది. దాని గుర్తులు ఏవీ ఈ ఇంట్లో ఉండకూడదు అంటుంది శౌర్య.
అమ్మానాన్నలను మింగేసిన రాక్షసి అది. ఇంకా అమ్మానాన్నల పక్కన ఎలా పెడతారు అంటుంది శౌర్య. హిమ పరాయిదే అంటుంది. పరాయిదే అంటుంది. దీంతో హిమ వెక్కి వెక్కి ఏడుస్తుంది. నాకు అమ్మానాన్నలను లేకుండా చేశాక.. అది నాకు ఎప్పటికీ ఏమీ కాదు అంటుంది శౌర్య. ఈ మాటలు విని హిమ బాధపడుతుంది. కారు డ్రైవ్ చేయాలన్న హిమ కోరికే అమ్మానాన్నను చంపేసింది అంటుంది శౌర్య. వద్దు వద్దు అన్నా మొండిగా డ్రైవ్ చేసింది కాబట్టే.. ఈరోజు అమ్మా నాన్న ఇలా మిగిలిపోయారు అంటుంది శౌర్య. చెల్లెల్లు మీద అంత కోపం పెంచుకుంటే ఎలా శౌర్య అంటుంది సౌందర్య. దీంతో అలాంటి చెల్లి నాకొద్దు అంటుంది శౌర్య.
నానమ్మ అది నా చెల్లెలు అని ఎవ్వరికీ చెప్పొద్దు. నేనూ ఎవ్వరికీ చెప్పను అంటుంది శౌర్య. నాకు అమ్మానాన్నలను లేకుండా చేసిన అలాంటి రాక్షసి.. నాకు చెల్లెలు అని ఎలా చెప్పుకోమంటారు అంటుంది శౌర్య. నువ్వు నమ్మినట్టే హిమ బతికి ఉండి తిరిగి వస్తే కాదనగలవా? నా చెల్లెలు నాకు వద్దు అనగలవా అంటుంది సౌందర్య.
నిజంగా హిమ బతికి బట్టకట్టినా.. నా కళ్ల ముందుకు రాకపోతేనే మంచిది. వస్తే నాకున్న కోపానికి నేను ఏం చేస్తానో నాకే తెలియదు అంటుంది శౌర్య. కళ్ల ముందే అమ్మ నాన్నాల చావుకు కారణమైంది అది. నాకు తెలుసు హిమ బతికే ఉంటుంది అంటుంది శౌర్య. ఏదో ఒక రోజు నాకు ఎదురు పడుతుంది. ఆ రోజు మాత్రం నేను హిమను వదిలిపెట్టను నానమ్మ అంటుంది శౌర్య.
Karthika Deepam 16 March Today Episode : హిమను చంపేస్తా.. అన్న శౌర్య
ఏంటే ఆ మాటలు అంటుంది సౌందర్య. కనిపిస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది సౌందర్య. దీంతో చంపేస్తాను అంటుంది శౌర్య. దీంతో అందరూ షాక్ అవుతారు. తప్పు చేసిన వాళ్ల గురించి తప్పుగా మాట్లాడకుండా ఇంకెలా మాట్లాడుతారు. వద్దు నానమ్మ. హిమ గురించి ఎవ్వరూ మాట్లాడొద్దు అంటుంది శౌర్య.
దాని వస్తువులేవీ నా కళ్ల ముందు ఉంచొద్దు. నాకు ఏ చెల్లెలూ లేదు. ఉన్నా అది చెల్లెలు కాదు అంటుంది శౌర్య. మీకు హిమే కావాలి అనుకుంటే.. నేను కూడా అమ్మనాన్నల దగ్గరికి వెళ్లిపోతాను అంటుంది శౌర్య. దీంతో అందరూ షాక్ అవుతారు.
నేను కూడా మీకు మిగలను అంటుంది శౌర్య. మళ్లీ దాని పేరు ఈ ఇంట్లో ఎత్తితే నేను మీకు దక్కను అంటుంది శౌర్య. దక్కను.. అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. దీంతో హిమ ఇంట్లోకి రాకుండా వెనకడుగు వేస్తుంది. ఇంట్లోకి రాకుండా.. అక్కడి నుంచి అటే వెళ్లిపోతుంది.
ఇంటికెళ్తే శౌర్య నన్ను తిడుతుంది. నేను ఎక్కడికి వెళ్లాలి అని అనుకొని బస్తీకి వస్తుంది. మోనిత ఇంటికి వెళ్తుంది హిమ. ఆంటి… అని పిలుస్తుంది. కానీ.. అక్కడ ఎవ్వరూ ఉండరు. మోనిత ఇంట్లో కార్తీక్, మోనిత.. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను చూస్తుంది హిమ.
మోనిత ఆంటి, డాడీ కలిసి ఏం పూజ చేశారు. నాకు తెలియనే తెలియదు.. అని అనుకుంటుంది హిమ. మరోవైపు ఆనంద్ ను మోనిత ఎత్తుకొని ఉన్న ఫోటోను కూడా చూస్తుంది హిమ. అసలు తమ్ముడు ఫోటోను ఆంటి ఎందుకు ఎత్తుకుంది. నాకేం అర్థం కావడం లేదు అని అనుకుంటుంది హిమ.
అబద్ధాలు చెప్పడం అందరికీ అలవాటే కదా.. అని అనుకుంటుంది హిమ. తమ్ముడు మోనిత ఆంటి కొడుకా. అయితే.. తమ్ముడు నాకు నిజంగానే.. అసలు ఏం అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. ఇంతలో పోలీస్ వచ్చి ఇంద్రుడు, చంద్రమ్మను చూసి అనుమానం వచ్చి అడుగుతాడు.
ఇంతలో హిమ వచ్చి అంకుల్ వీళ్లు మా పిన్ని, బాబాయి అంటుంది. దీంతో పోలీస్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మమ్మల్ని భలే కాపాడావురా అంటుంది చంద్రమ్మ. ఇంతకీ మీ వాళ్లను కలిశావా అని అడుగుతుంది చంద్రమ్మ. దీంతో కలవలేదు అంటుంది.
నేను ఎప్పటికీ మీతో ఉండొచ్చా అని అడుగుతుంది హిమ. దీంతో చంద్రమ్మ దగ్గరికి తీసుకొని ఎంత మాట నువ్వు అంటే.. మేము ఎలా కాదంటాము తల్లి. మాతోనే ఉండు.. నిన్ను కన్నబిడ్డలా చూసుకుంటాం అంటుంది చంద్రమ్మ. ఇక నుంచి మన బిడ్డ.. మనతోనే ఉంటది. ఇక నువ్వు ఏం మాట్లాడకు అంటుంది చంద్రమ్మ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.