Karthika Deepam 17 August 2022 Episode : కార్తీక్, దీపలు ఎలా బ్రతికారో గతమంతా చెప్తున్న వారణాసి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 17 August 2022 Episode : కార్తీక్, దీపలు ఎలా బ్రతికారో గతమంతా చెప్తున్న వారణాసి..

 Authored By prabhas | The Telugu News | Updated on :17 August 2022,10:30 am

Karthika Deepam 17 August 2022 Episode : కార్తీకదీపం సీరియల్ ఈ సీరియల్ తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1433 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. దీప డాక్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. పెద్దావిడ దీపకు ధైర్యం చెబుతూ ఉంటుంది. ఆ పెద్దావిడ రాంపండులను పిలిచి వంట చేయండి మన ఇంటికి అతిథి వచ్చారు. అని చెబుతుంది. అప్పుడు వాళ్లు ఏమైనా స్పెషల్ చేయమంటావా చికెన్, గారెలు లాంటివి అని అంటారు. అప్పుడు పెద్దావిడ మా ముఖాలకి స్పెషల్ కూడానా ఏదో గతిలేక మీ వంటలు మేము తింటున్నాం. అని అంటుంది. అప్పుడు దీప నేను చేస్తానమ్మా వంట గది ఎక్కడ అని అంటుంది. అయ్యో వద్దులే అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో అని పెద్దావిడ అంటుంది. లేదమ్మా నేను చేస్తాను ఏం పర్లేదు అని దీప వంటగదిలోకి వెళ్లి వంట చేస్తుంది. కట్ చేస్తే సౌర్య నీ వాళ్ల బాబాయ్ ,పిన్నులు నచ్చజెప్పి వాళ్ళ ఇంటికి పంపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.

మేము ఏదో పొట్ట కోసం దొంగతనాలు చేసుకొని బ్రతికే వాళ్ళం.. ఆ డబ్బులతో నిన్ను సాదాలంటే కష్టం అమ్మ తల్లి. నువ్వు పెద్దింటి బిడ్డవి ఏ కష్టాలు నువ్వు పడలేవు. అయినా అమ్మానాన్న దూరమైనందుకు నువ్వు ఎంత బాధ పడుతున్నావో అక్కడ మీ నాయనమ్మ, తాతయ్యలు కూడా అలాగే బాధపడుతూ ఉంటారు. నువ్వు దూరమైనందుకు హిమ ఇష్టం లేకపోతే హేమాతో మాట్లాడకు అంతేగాని వాళ్లకి దూరం అవ్వకు తల్లి అని అంటారు. నా కూతురు ఇలాగే చిన్నప్పుడు మాకు దూరమైపోయింది. తనకోసం మేము ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాం. నువ్వు అర్థం చేసుకో తల్లి అని చెప్పగానే శౌర్య కొంచెం ఆలోచించి సరే వెళ్తాను అని అంటుంది. అప్పుడు హైదరాబాద్ కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటారు. కట్ చేస్తే దీప చేసిన వంట చాలా బాగుంది. అని పెద్దావిడ దీపం పొగుడుతూ ఉంటుంది. అప్పుడు దీప మరి అంతగనం పొగడకు తల్లి. ఇది పొగడ్త కాదమ్మా..

Karthika Deepam 17 August 2022 Full Episode

Karthika Deepam 17 August 2022 Full Episode

ఈన్నాళ్లు ఈ చప్పటి కూడు తిని తిని ఇవాళ ఎంత రుచికరమైన భోజనం చేస్తుంటే ఊపిరి ఒక్కసారిగా లేచినట్లుగా ఉందమ్మా. అని అంటుంది. అప్పుడు దీప కార్తీక్ ను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ ఆ పెద్దావిడ తనకి ధైర్యం చెప్పి నువ్వు హైదరాబాద్ వెళుతున్నావా అని ఆ డాక్టర్ అంటాడు. వెళ్లి పిల్లలను తీసుకొని ఇక్కడకొచ్చి డాక్టర్ బాబు ని వెతుకుతాను అని అంటుంది దీప. సరే నువ్వు వెళ్ళు నేను కూడా ఇక్కడ వెతుకుతాను అని అంటాడు. దీప హైదరాబాద్ కు వెళ్తూ పిల్లల గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ బస్సు ఎక్కుతుంది. అదే బస్సు సౌర్య వాళ్ళ పిన్ని బాబాయ్ లు కూడా ఎక్కుతారు. కానీ ఒకరినొకరు చూసుకోరు. కట్ చేస్తే సౌందర్య వాళ్లు అమెరికా వెళ్లడానికి దీప కార్తిక ఫోటోలను సర్దుతూ వాటిని చూస్తూ బాధపడుతూ ఉంటారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది