Karthika Deepam 17 Sep Today Episode : మోనితను కోర్టుకు తీసుకెళ్లిన రోషిణి.. కోర్టుకు వచ్చిన కార్తీక్, దీప, సౌందర్య.. మోనితకు యావజ్జీవ శిక్ష పడుతుందా? లేక ఉరి శిక్ష వేస్తారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 17 Sep Today Episode : మోనితను కోర్టుకు తీసుకెళ్లిన రోషిణి.. కోర్టుకు వచ్చిన కార్తీక్, దీప, సౌందర్య.. మోనితకు యావజ్జీవ శిక్ష పడుతుందా? లేక ఉరి శిక్ష వేస్తారా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :17 September 2021,9:20 am
karthika deepam 17 september 2021 friday episode 1147 highlights

karthika deepam 17 september 2021 friday episode 1147 highlights

Karthika Deepam 17 Sep Today Episode :  కార్తీక దీపం 17 సెప్టెంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈ రోజు ఎపిసోడ్ 1147 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల బొమ్మలు నేను తీసుకురావడం ఏంటి.. అసలు ఎవరు తెచ్చారు.. అంటూ ఆదిత్య.. కార్తీక్, దీపను అడుగుతాడు. నేను చెబుతానురా.. అంటూ శ్రావ్య.. ఆదిత్యను తీసుకొని వెళ్తుంది. బాధపట్టే నిజం చెప్పడం కన్నా… సంతోషపెట్టే అబద్ధం చెప్పడమే మేలు.. అని కార్తీక్ దీపతో అంటాడు. కానీ.. అబద్ధాలు ఎక్కువ రోజులు ఆగవు. బయటపడుతూనే ఉంటాయి.. ఏం పర్లేదు నువ్వేం నేరం చేయలేదు అని తనకు సర్దిచెబుతాడు కార్తీక్.

karthika deepam 17 september 2021 friday episode 1147 highlights

karthika deepam 17 september 2021 friday episode 1147 highlights

కట్ చేస్తే.. పోలీస్ స్టేషన్ లో ఏసీపీ రోషిణి.. రెడీ అవుతుంది. మోనితను కోర్టుకు తీసుకెళ్లేందుకు అన్నీ సిద్ధం చేయాలంటూ కానిస్టేబుల్స్ కు చెబుతుంది. రత్నసీత.. ఈ కేడీ లేడిని కోర్టుకు తీసుకెళ్లాలి.. గుర్తుందా? అని అడుగుతుంది. గుర్తుంది మేడం.. ఇప్పుడే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాం అంటుంది. ఇంతలో చిన్న రిక్వెస్ట్ మేడమ్.. అంటుంది మోనిత. నేను మీ వాహనంలో వస్తాను మేడమ్ అని అడుగుతుంది ఎందుకు.. నేనే చంపానని ఇంకో నాటకం ఆడటానికా.. అని అడుగుతుంది. మీతో కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడాలి అంటుంది. దీంతో నేను నీలాంటి పాములకు లిఫ్ట్ ఇవ్వను.. అని చెప్పి వెళ్లబోతుండగా.. ఒక్క నిమిషం మేడమ్.. అంటుంది మోనిత.

ఏలాగూ నేను భూమికి భారం అని అంటున్నారు. నేను చేసిన పాపానికి ఉరి శిక్ష వేసినా వేస్తారు. ఉరి శిక్ష వేసే ఖైదీకి చివరి కోరిక అంటూ ఒకటి ఉంటుంది కదా. మీ వెహికిల్ లో రావడమే నా చివరి కోరిక.. అని చెబుతుంది మోనిత. దీంతో సరే.. అని చెప్పి తీసుకెళ్తుంది ఏసీపీ.

Karthika Deepam 17 Sep Today Episode : కార్తీక్, దీపకు ముచ్చెమటలు పట్టించిన శౌర్య, హిమ

కట్ చేస్తే.. హిమ, శౌర్య.. ఇద్దరూ ఇంట్లో కూర్చొని మళ్లీ వాళ్ల తల్లిదండ్రుల గురించి డిస్కస్ చేస్తుంటారు. మళ్లీ అమ్మ ఎక్కడికి వెళ్లింది. నాన్నతో కలిసి ఎక్కడికి వెళ్తున్నారు. అబద్ధం చెప్పి మళ్లీ ఎక్కడికి వెళ్తున్నారు.. అని ఇద్దరూ అనుకుంటారు. ఇప్పుడు నువ్వే చూడు అమ్మానాన్న వచ్చి ఏం చెబుతారో విందాం.. అని అంటుంది శౌర్య. వీళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పలేం.. అబద్ధం చెప్పలేం.. అని అంటుంది దీప. ఏంటి రౌడీ.. టోల్ గేట్ లా అడ్డంగా కూర్చున్నారు.. అనగానే మీరు వస్తారని తెలియదు కదా నాన్నా తెలియక ఇక్కడ కూర్చున్నాం అంటారు పిల్లలు.

karthika deepam 17 september 2021 friday episode 1147 highlights

karthika deepam 17 september 2021 friday episode 1147 highlights

రా నాన్నా మనం క్రికెట్ ఆడుకుందాం.. అంటుంది శ్రావ్య. ఇప్పుడు ఆడలేం.. అంటే ఎందుకు అని అడుగుతుంది.. బయటికి వెళ్తున్నాం.. అంటాడు. దీంతో సరే.. మేము కూడా వస్తాం అంటారు. లేదురా కుదరదు.. ఓ పని మీద వెళ్తున్నాం.. ఆ తర్వాత మీతోనే ఎప్పుడూ అందుబాటులో ఉంటాం.. అని చెబుతాడు కార్తీక్. ఆపవే.. ఏం మాట్లాడుతున్నావు.. మాటలు కొంచెం హద్దుల్లో పెట్టుకొని మాట్లాడండి.. అని సౌందర్య పిల్లలను హెచ్చరిస్తుంది.

karthika deepam 17 september 2021 friday episode 1147 highlights

karthika deepam 17 september 2021 friday episode 1147 highlights

తర్వాత కార్తీక్ వెళ్లబోతుండగా.. కార్తీక్ చేయి పట్టుకుంటుంది శౌర్య. నువ్వు బయటికి వెళ్తుంటే నాకెందుకో భయం వేస్తుంది నాన్నా.. అంటుంది. నీకు మళ్లీ ఏమన్నా అవుతుందా? మళ్లీ ఇంటికి వచ్చేస్తావుగా.. అని అడుగుతుంది. నిన్ను పోలీసులు పట్టుకెళ్లరు కదా.. అని అడుగుతుంది. ఏం కాదు.. ఇక నుంచి మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్లను.. అని చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్.

Karthika Deepam 17 Sep Today Episode : ఏసీపీతో కారులో కోర్టుకు బయలుదేరిన మోనిత

కట్ చేస్తే ఏసీపీతో కలిసి కారులో వెళ్తుంటుంది మోనిత. దీప అండ్ పార్టీ కలిసి కోర్టు దగ్గర వెయిట్ చేస్తుండగా.. నేను మాత్రం వీఐపీలా ఈ కారులో నుంచి దిగుతా.. అప్పుడు అదిరిపోతుంది. అందుకే కదా.. కష్టపడి మరీ.. ఈవిడ కారు ఎక్కింది అని అనుకుంటుంది మోనిత. ఇంతలో ఓ రెండు బిస్కెట్లు వేద్దాం అని అనుకుంటుంది. మేడమ్.. నేను మీ అభిమానిని మేడమ్ అని అంటుంది. దీంతో రోషిణికి అర్థం అయి.. ఎన్ని బిస్కెట్లు వేద్దామనుకుంటున్నావు.. అని అడుగుతుంది రోషిణి. దీంతో షా అవుతుంది మోనిత.

karthika deepam 17 september 2021 friday episode 1147 highlights

karthika deepam 17 september 2021 friday episode 1147 highlights

అదేంటి మేడమ్ నేను మీ అభిమానిని అంటే అలా బిస్కెట్ అంటున్నారు. ఎందుకు అని అడగొచ్చు కదా.. అంటే నీ గురించి ఎవరు చెప్పినా నమ్మలేదు. నా సర్వీస్ లోనే నా అంచనాలను తలకిందులు చేసిన క్రిమినల్ వు నువ్వు. నా కెరీర్ లో నువ్వు తగలడం వల్ల నాకు మంచే జరిగింది. బేసికల్ గా నాకు కాస్త ఈగో ఎక్కువ. ఇప్పుడు ఆ ఈగో పోయింది. ఇక నుంచి ఎంత షార్ప్ గా, ఎంత అలర్ట్ గా పనిచేయాలో నీ క్రిమినల్ బ్రెయిన్ నాకు నేర్పించింది. అలాంటి నువ్వు.. ఇలాంటి నాకు.. అభిమాని అని అందమైన బిస్కెట్ వేసినంత మాత్రాన కరిగిపోయి దారిలోనే దింపేస్తా అని అనుకున్నావా.. అంటుంది రోషిణి.

karthika deepam 17 september 2021 friday episode 1147 highlights

karthika deepam 17 september 2021 friday episode 1147 highlights

Karthika Deepam 17 Sep Today Episode : నువ్వు అసలు మనిషివే కాదు.. అంటూ మోనితపై సీరియస్ అయిన ఏసీపీ

మీరు నన్ను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు మేడమ్. నేను గొప్ప ప్రేమికురాలిని. ఒక లైలా.. ఒక జూలియట్.. ఒక మోనిత. నిజంగా సాటి మనిషిగా చెప్పండి.. ఒక పోలీస్ గా కాకుండా చెప్పండి.. నా మీద మీ అభిప్రాయం ఏంటి.. అని అడుగుతుంది మోనిత. మృగం నాతో పాటు కారులో వస్తూ నేనెవరిని… అంటూ క్రూరంగా అడుగుతున్నట్టు ఉంది. నా దృష్టిలో నువ్వు అసలు మనిషివే కాదు. పైశాచికత్వానికి పరాకాష్ట నువ్వు.. అంటుంది. మనిషిలో దయ, జాలి ఉంటాయి. మనిషి అంటే దీపను చూసి నేర్చుకోవాలి. హుందాగా ఎలాగా ఉండాలో సౌందర్య గారిని చూసి నేర్చుకోవాలి. మనిషిలా ఎలా బతకాలన్నది కార్తీక్ ను చూసి నేర్చుకోవాలి. అందుకే.. నువ్వు అన్నీ మూసుకొని కూర్చుకో.. అంటుంది రోషిణి.

karthika deepam 17 september 2021 friday episode 1147 highlights

karthika deepam 17 september 2021 friday episode 1147 highlights

రాక్షసత్వానికి రంగు వేయకు.. బాగా చదువుకొని.. ఇలాంటి పనా చసేది. మనసును అదుపులో పెట్టుకోకుండా.. నువ్వు చేసిందేంటి. పెళ్లయిన వాడిని ప్రేమించి.. అతడి కాపురంలో నిప్పులు పోశావు.. అంటూ మోనితకు ఎడాపెడా క్లాస్ పీకుతుంది రోషిణి.

దీంతో.. అయిపోయింది.. అంతా అయిపోయింది. నా జీవితంలో ఇక కార్తీక్ అధ్యాయం ముగిసిపోయింది.. అని చెబుతుంది మోనిత. అసలు.. నా బతుకే అర్థం లేకుండా పోయింది. నా ప్రేమ పైశాచికత్వంగా కనిపిస్తోందా? నా తప్పులు క్రూరంగా కనిపిస్తున్నాయా? ఎవరు అర్థం చేసుకుంటారు. మోనిత మనసులో కార్తీక్ కు ఎంత గొప్ప స్థానం కల్పించిందో? ఎవరికి కావాలి.. మోనిత ఏళ్ల తరబడి ప్రేమించినా.. బూడిద అయిందని.. అనగానే నిన్ను నువ్వు సమర్థించుకోకు మోనిత. నీ ప్రేమ అధమమైనది.. అంటుంది రోషిణి.

నా ప్రేమ మీద నేను చాలా క్లారిటీతో ఉన్నాను మేడమ్. ఎక్కడ ఉండాల్సిన నేను ఎక్కడ ఉన్నాను.. ఎక్కడ ఉండబోతున్నాను. నా జీవితం ఇలా తయారు కావడానికి నా స్వార్థం కాదు.. నా ప్రేమ. నా ప్రేమను కార్తీక్ కు అర్థం చేసుకోలేకపోయాడు. మీరే కాదు.. నన్ను ఈ లోకంలో ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అందరూ ఆడవాళ్ల లాగా పెళ్లి చేసుకొని పిల్లలను కని.. వాళ్ల ఆలనా పాలనా చూసుకోవాల్సిన దానిని కానీ.. జైలుకు పోతున్నాను.. అంటూ ఏదో చెప్పబోయే సరికి.. సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది రోషిణి.

Karthika Deepam 17 Sep Today Episode : మోనితాసుర నాటకం స్టార్ట్ కాబోతోంది.. అని అన్న సౌందర్య

కట్ చేస్తే కోర్టుకు కార్తీక్, దీప, సౌందర్య.. ముగ్గురు వస్తారు. తన గురించి వెయిట్ చేస్తుంటారు. మోనితాసుర నాటకం ఇక స్టార్ట్ అవుతుంది చూడండి అంటుంది సౌందర్య. ఇంకా తన నాటకాలు ఎన్ని చూడాలో అని అంటుంది దీప. ఇంతలో అక్కడికి వచ్చిన మోనిత.. సౌందర్యను చూసి.. నమస్కారం అందమైన అత్త గారు అంటుంది. దీంతో మోనిత మీదికి సీరియస్ గా వెళ్తుంది సౌందర్య. వద్దు అత్తయ్య అంటుంది దీప. అబ్బ మొహాలు చూడండి.. చిచ్చుబుడ్డుల్లా వెలిగిపోతున్నాయి.. అనగానే ఒకసారి ఇటు చూడు.. ఈమె నా భార్య దీప. నువ్వు ఎన్ని సార్లు ప్రయత్నించినా.. మేం విడిపోం.. అదే భార్యాభర్తల బంధం అంటే అని అంటాడు కార్తీక్.

karthika deepam 17 september 2021 friday episode 1147 highlights

karthika deepam 17 september 2021 friday episode 1147 highlights

పోవే.. ఇక్కడి నుంచి.. రొట్ట మొహమా.. కాకి మెడ వేసుకొని చూసింది చాలు అంటుంది దీప. సరిపోయిందా.. నేను నీకు పెట్టిన గడ్డి సరిపోలేదా? ఇక్కడికి వచ్చి కూడా తినాలా.. అంటూ రోషిణి కూడా మోనితకు గడ్డి పెడుతుంది. ఇంతలో దీప దగ్గరికి మోనిత సీరియస్ గా వెళ్లి ఏదో చెప్పబోతుంది. ఇంతలో సీరియల్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే.. తరువాయి భాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది