Karthika Deepam 18 June Today Episode : తింగరే హిమ అని నిరుపమ్ ఇంట్లో జ్వాలకు తెలుస్తుందా? హిమపై తన పగను జ్వాల ఎలా తీర్చుకుంటుంది?

Authored By Varun G | The Telugu News | Updated on : 18 June 2022, 10:30 am

Karthika Deepam 18 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 జూన్ 2022, శనివారం ఎపిసోడ్ 1382 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో అమ్మ నీ కోడలు జాగ్రత్తగా చూసుకో అని హిమను తీసుకొచ్చి స్వప్నతో అంటుంది సౌందర్య. పెళ్లి పనులు ప్రారంభం అవుతాయి. హిమకు ఏం చేయాలో అర్థం కాదు. నిరుపమ్ సంతోషంగా ఉంటాడు. శోభకు పిచ్చెక్కుతుంది. సౌందర్య, ఆనంద రావు చాలా సంతోషంగా ఉంటారు. తర్వాత స్వప్న, సౌందర్య కలిసి పసుపు దంచుతారు. స్వప్న.. ఈ పసుపు దంపుడు పాటలు ఏమైనా వచ్చా నీకు అని అడుగుతుంది సౌందర్య. దీంతో నాకు పాటలు ఏవీ రావు కానీ.. నన్ను వదిలేయ్ అంటుంది స్వప్న. తర్వాత కాబోయే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును పిలుస్తుంది సౌందర్య.

karthika deepam 18 june 2022 full episode

karthika deepam 18 june 2022 full episode

దీంతో ఇద్దరు కలిసి పసుపు దంచుతూ ఉంటారు. ఇంతలో జ్వాల అక్కడికి వస్తుంది. నడుచుకుంటూ లోపలికి వస్తుంటుంది. మరోవైపు హిమ, నిరుపమ్ ఇద్దరూ కలిసి పసుపు దంచుతూ ఉంటారు. దీంతో శోభకు పిచ్చెక్కి కిందికి వస్తుంది. అప్పుడే జ్వాల రావడాన్ని చూస్తుంది శోభ. వామ్మో.. ఇదేంటి ఇక్కడికి వస్తుంది. దీన్ని గుర్తుపడితే అందరూ ఒక్కరు అవుతారు. హిమతో కాకపోతే దీనితో అయినా నిరుపమ్ పెళ్లి చేస్తారు. నాకున్న అవకాశం కూడా పోతుంది అని అనుకుంటుంది శోభ. ఇంతలో జ్వాల ఇంటి పై మెట్లు ఎక్కుతుంటుంది. ఇంతలో జ్వాలకు ఫోన్ వస్తుంది. ఎవరు అంటే.. నేను జ్వాల.. హిమను అంటుంది శోభ. మళ్లీ శోభనే తనకు ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావే చెప్పు అని అడుగుతుంది. దీంతో నీ ఆటోలోనే ఉన్నాను అంటుంది. దీంతో పరిగెత్తుకుంటూ తన ఆటో దగ్గరికి వెళ్తుంది.

ఇంతలో తన ఆటో స్టార్ట్ చేసి తీసుకెళ్లిపోతుంటుంది శోభ. దీంతో ఆటో వెనుక పరిగెడుతుంది జ్వాల. కానీ.. ఆటో దొరకదు. దీంతో ఏం చేయాలో అర్థం కాదు. బయటికెళ్లి ఆటోను ఆపుతుంది. దీంతో మళ్లీ పరుగెడుతుంది జ్వాల. జ్వాల పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోలో చూస్తే ఎవ్వరూ ఉండరు. దీంతో చుట్టు పక్కన చూస్తుంది కానీ.. ఎవ్వరూ కనిపించరు.

Karthika Deepam 18 June Today Episode : సౌందర్యను వేడుకున్న హిమ

మిస్సయిపోయింది అని అనుకుంటుంది. మరోవైపు ఆనంద రావు గారు.. మీరు, మీ అల్లుడు వచ్చి పసుపు దంచండి అంటుంది సౌందర్య. దీంతో ఇద్దరూ వచ్చి పసుపు దంచుతారు. మరోవైపు జ్వాల రాలేదేంటి అని మనసులో అనుకుంటాడు నిరుపమ్. కట్ చేస్తే పసుపు దంచుడు కార్యక్రమం అయిపోతుంది.

వీళ్లను ఎలా ఆపాలి అని అనుకుంటుంది హిమ. రేపో ఎల్లుండో పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేలా ఉన్నారు అని అనుకుంటుంది హిమ. శౌర్య, నిరుపమ్ బావ పెళ్లి చేసేదెలా అని అనుకుంటుండగానే సౌందర్య హిమ దగ్గరికి వస్తుంది. ఏమైంది నానమ్మ అని అడుగుతుంది.

నాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి. నా మనవరాలికి, నా మనవడికి పెళ్లి జరుగుతుంటే నాకేం సమస్యలు ఉంటాయి అని అంటుంది సౌందర్య. నా మనవడు రమ్మంటే వచ్చాను అంటుంది సౌందర్య. నా చేతుల మీదుగా పెళ్లి ముహూర్తం పెట్టమన్నాడు అంటుంది సౌందర్య.

ఏంటి నానమ్మ నన్ను అర్థం చేసుకోరా మీరు.. నేను చచ్చిపోబోతున్నాను. కనీసం నా చివరి కోరిక కూడా తీర్చరా. ఈ పెళ్లి వద్దు అంటుంది హిమ. నా మాట విను ప్లీజ్. నాకు ఈ హెల్ప్ చేయి. ప్లీజ్ నానమ్మ నీకు దండం పెడతాను. ఈ పెళ్లి ఆపు అంటుంది. బావ జీవితం ఎటూ కాకుండా పోతుంది అంటుంది హిమ.

ఇంతలో నిరుపమ్ వస్తాడు. తన మాటలేవీ పట్టించుకోద్దు అంటాడు సౌందర్యతో. నువ్వు ఏ టైమ్ ఫిక్స్ చేస్తే ఆ టైమ్ కే మా పెళ్లి అంటాడు. మాకు ఉన్న పెద్ద దిక్కు నువ్వే కదా అంటాడు నిరుపమ్. మంచి ముహూర్తం పెట్టించు అంటాడు. దీంతో బావా ఆపుతావా అంటుంది హిమ.

కట్ చేస్తే జ్వాల డాక్టర్ సాబ్ కు సారీ చెప్పాలనుకుంటుంది. అందుకే ఆసుపత్రికి వస్తుంది. అదే సమయంలో మీరు మీరే తేల్చుకోండి అని చెప్పి సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో నిరుపమ్, హిమ దగ్గరికి జ్వాల వస్తుంది. వీళ్లిద్దరూ ఇలా ఉన్నారేంటి అని అనుకుంటుంది.

దీంతో అసలేంటి నీ సంగతి. నిన్ను ఫంక్షన్ కు రమ్మని పిలిచాను కదా ఎందుకు రాలేదు అని అడుగుతాడు నిరుపమ్. నేను మీ ఇంటికి వచ్చాను అంటుంది. లోపలికి అడుగు పెట్టబోతుండగా ఫోన్ కాల్ వచ్చింది అని చెబుతుంది జ్వాల. చివరి నిమిషంలో వెనక్కి వెళ్లిపోయాను అంటుంది జ్వాల.

ఈ ఫోన్ కాల్స్ గొడవ ఏంటి అని అడుగుతాడు నిరుపమ్. దీంతో మీ దగ్గర దాచడం ఎందుకు.. ఆరోజు మీకు చెప్పాను కదా హెచ్ అనే అక్షరం నా శత్రువుది అని. కరెక్ట్ టైమ్ లో నా శత్రువు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతోంది అని అంటుంది జ్వాల. దీంతో హిమ ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Korean Kanakaraju Censor Review : కొరియన్ కనకరాజు సెన్సార్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే..?"

  2. "TTN SPECIAL ANALYSIS : బంకీపూర్ లో అంత ఈజీ గా ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచాడు ?"

  3. "Indiramma House: పేదలకు బంపర్ ఛాన్స్.. రూ.40 లక్షల ఫ్లాట్.. కేవలం రూ.6 లక్షలకే .. అర్హతలు, అప్లై విధానం, పూర్తి వివరాలివే..!"

  4. "PM-KISAN : రైతులకు భారీ శుభవార్త.. 23 విడతల్లో రూ.4.47 లక్షల కోట్లు జమ.. కొత్త లబ్ధిదారులపై కేంద్రం కీలక ప్రకటన"

  5. "Pradeep Rawat : టాలీవుడ్ స్టార్ విలన్ ప్రదీప్ రావత్.. కోట్ల ఆస్తి వెనుక అసలు కథ..!"

  6. "Karthika Deepam 2 Today Episode August 05 : సూరజ్‌ను దత్తత తీసుకుంటానన్న శ్రీధర్.. జ్యోత్స్నకు భారీ షాక్!"

  7. "Gold Rate Today : గుడ్‌న్యూస్‌.. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. ఆగస్టు 5 తాజా గోల్డ్ రేట్లు ఇవే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp