Sudigali Sudheer : తెలుపు అంటే అనసూయ అంట.. సుడిగాలి సుధీర్ మామూలోడు కాదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudigali Sudheer : తెలుపు అంటే అనసూయ అంట.. సుడిగాలి సుధీర్ మామూలోడు కాదు

 Authored By prabhas | The Telugu News | Updated on :18 June 2022,10:00 am

యాంకర్ అనసూయ, సుడిగాలి సుధీర్ కలిసి ఇప్పుడు స్టార్ మాలో సింగింగ్ షోకు హోస్టులుగా చేస్తోన్న సంగతి తెలిసిందే. అనసూయ అయితే అన్ని చానెల్స్‌లో షోలు చేస్తుంటుంది. అది వేరే విషయం. కానీ సుధీర్ మాత్రం అలా కాదు.సుడిగాలి సుధీర్ కేవలం ఈటీవీలోనే కనిపిస్తుంటాడు. మల్లెమాల షోలు మాత్రమే చేస్తుండేవాడు. అలా మొత్తానికి సుధీర్‌లో మార్పు వచ్చింది. స్టార్ మాలోని స్పెషల్ ఈవెంట్లకు రావడం మొదలుపెట్టేశాడు. మొదటగా రష్మీనే వచ్చింది. ఆ తరువాత ఓ ఈవెంట్లో ఈ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. అలా మొత్తానికి సుధీర్ పూర్తిగా మారిపోయాడు. ఈటీవీ, మల్లెమాలకు రాం రాం చెప్పేశాడు. స్టార్ మాకు వచ్చేశాడు.

ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్నీ వదిలేసుకున్నాడు. కారణం ఏంటో ఇంత వరకు బయటకు రాలేదు. సినిమాల వల్ల బిజీగా ఉండి అలా చేశాడా? అని అనుకుందామంటే.. స్టార్ మాలో ఓ షోను చేస్తున్నాడు. మరి అది ఎలా సాధ్యమవుతుంది. అలా మొత్తానికి మల్లెమాలకు సుధీర్‌కు మధ్య గ్యాప్ వచ్చిందనే విషయం మాత్రం అర్థమవుతోంది. ఇక ఇప్పుడు సుధీర్ మొత్తంగా స్టార్ మాలో ఉంటున్నాడు. స్టార్ మా సింగింగ్ షోలో సుధీర్, అనసూయ, మనో వంటి వారు తెగ సందడి చేస్తున్నారు. ఇక పిల్లలతో కలిసి ఆటలు, పాటలు అంటూ సుధీర్, అనసూయ హంగామా చేస్తున్నారు.

Sudigali Sudheer Praises on Anasuya Beauty

Sudigali Sudheer Praises on Anasuya Beauty

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అనసూయను సుడిగాలి సుధీర్ పొగిడేశాడు. తమ తమ కంటెస్టెంట్లు తాము పాడే పాటలకు తగ్గట్టుగా క్యాస్టూమ్ ధరిస్తారు. అయితే అందులో సుధీర్‌ టీంకు చెందిన ఓ పాప తెలుపు దుస్తులను వేసుకుంటుంది. ఆ పాట ఏంటో చెప్పమని సుధీర్‌కు టాస్క్ వచ్చినట్టుంది. తెలుపు అంటే నీకేం గుర్తుకు వస్తుంది? అని సుడిగాలి సుధీర్‌ను అడుగుతారు. తెలుపు అంటే.. అనసూయ అని అనడంతో ఆమె షాక్ అవుతుంది. ఇంకా అని అంటే.. తన మనసు అని సుధీర్ చెప్పడంతో అందరూ పగలబడి నవ్వుతుంటారు. అనసూయ మాత్రం అవాక్కై చూస్తుంటుంది. అలా మొత్తానికి సుధీర్, అనసూయ మాత్రం షోను బాగానే నడిపిస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది