Karthika Deepam 19 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 జులై 2022, ఎపిసోడ్ 1408 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిరుపమ్.. హిమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. భోజనం కూడా చేయడు. దీంతో రా నువ్వు భోం చేద్దువురా. తను మంచిగానే తిని ఉంటుంది. నువ్వే బోజనం మానేసి దాని గురించి ఆలోచిస్తున్నావు అంటుంది స్వప్న. మరోవైపు హిమ.. శౌర్య మనసు ఎలా మార్చాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. శౌర్యకు నా మీద కోపం పోదా. బావ మనసు మారదు. శౌర్య కోపం తీరదు. నేను ఏం చేయాలి అని అనుకుంటుంది హిమ. ఇంతలో అక్కడికి సౌందర్య వస్తుంది. ఏంటే ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దీంతో ఏం లేదు నానమ్మ. శౌర్య మనసు మారదా అని అడుగుతుంది. దీంతో తొందరపడకు. రాగానే అన్ని మరిచిపోయి మనతో ప్రేమగా ఉండమనడం తప్పు. కాస్త ఓపిక పడదాం. సరే.. భోం చేద్దాం రా అని అంటుంది సౌందర్య. దీంతో నాకు ఆకలిగా లేదు నానమ్మ. మీరు తినండి అంటుంది హిమ.
దీంతో ఒక డాక్టర్ వై ఉండి నువ్వే ఇలా చేస్తే ఎలా. భోజనం మానేస్తే ఎలా అంటే.. లేదు నానమ్మ నాకు ఆకలిగా లేదు అంటుంది హిమ. మరోవైపు శౌర్య దగ్గరికి వెళ్లి ఆనంద రావు.. భోజనం చేద్దాం పదా అంటాడు. దీంతో నాకు ఆకలిలా లేదు తాతయ్య. మీరు వెళ్లి భోం చేయండి అంటుంది శౌర్య. దీంతో ఆనందరావు.. తను లేనప్పుడు శౌర్య గురించి ఎలా బాధపడ్డామో చెబుతాడు. తాతయ్య.. ఎవరికి ఆకలి వేస్తే వాళ్లు తినాలి. ఇవన్నీ ఆలోచించొద్దు. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతే మీరంతా భోజనం మానేశారా? ఒక్కపూట భోజనం మానేసి ఉంటారు. రెండు పూటలు కన్నీళ్లు కార్చి ఉంటారు. మూడు పూటలు బాధపడి ఉంటారు. ఆ తర్వాత అన్నీ కామనే కదా. వెళ్లండి తాతయ్య. నేను మాట్లాడితే మీరు బాధపడతారు. నా మాట తీరు ఇలాగే ఉంటుంది అంటుంది శౌర్య. దీంతో సౌందర్య, ఆనందరావు ఇద్దరూ హాల్ లోకి వచ్చి ఏం చేయాలి అని ఆలోచిస్తారు.
ఇద్దరినీ కలిపేందుకు ఏదైనా ఒక ప్లాన్ వేద్దాం అంటాడు ఆనంద రావు. దీంతో మనం ఆపరేషన్ వృద్ధాశ్రమాన్ని స్టార్ట్ చేద్దాం అంటుంది. సూట్ కేస్ పట్టుకొని ఎక్కడికో వెళ్తున్నట్టు యాక్ట్ చేస్తారు. హిమ, శౌర్య.. మేము వెళ్తున్నాం అంటారు. దీంతో నానమ్మ ఏంటి ఇది. ఈ లగేజ్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది హిమ.
దీంతో ఇల్లు వదిలి వెళ్లిపోతున్నాం. వృద్ధాశ్రమానికి వెళ్తున్నాం అంటుంది సౌందర్య. అక్కడికి ఎందుకు అని అడుగుతుంది శౌర్య. ఏం చేయమంటావు. మీరా కలిసి ఉండరు. భోజనం చేయమంటే చేయరు.. అంటుంది సౌందర్య. దీంతో అంతమాత్రాన వెళ్తారా? అని అంటుంది శౌర్య.
వెళ్లక ఏం చేయమంటారు. మీరు తినకుండా నేను ఎలా తింటాను. నేను తినకపోతే మీ తాతయ్య ఎలా తింటాడు. చూడండి. మీ తాతయ్యను చూడండి. అసలే నీరసంతో బాధపడుతున్నాడు. చూడండి.. ఎలా బాధపడుతున్నాడో అంటుంది సౌందర్య. దీంతో ఆనంద రావు కూడా యాక్షన్ అదరగొడతాడు.
వెళ్లొస్తాం అని చెప్తారు. దీంతో నానమ్మ ఏంటి నిజంగా వెళ్తున్నారా? మీరు వెళ్లడానికి వీలు లేదు అంటుంది హిమ. నన్ను ఇంట్లోకి రమ్మని మీరు వెళ్తున్నారా అంటుంది శౌర్య. జాగ్రత్తగా ఉండండి. ఈ ముసలి తాతయ్యను ఎప్పుడైనా చూడాలనిపిస్తే.. రా అని శౌర్యతో అంటాడు.
మేం టిఫిన్ తినాలి అంతే కదా అంటుంది శౌర్య. దీంతో భోజనం కూడా కలిసే చేయాలి అంటుంది సౌందర్య. దీంతో సరే కానీ.. లోపలికి రండి. నాకు ఆకలేస్తుంది. లోపలికి పదండి అంటుంది శౌర్య. దీంతో ఇద్దరూ లోపలికి వెళ్లిపోతారు. మరోవైపు శోభ.. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది.
ఇంతలో తనకు బ్యాంక్ వాళ్లు ఫోన్ చేస్తారు. ఎప్పుడు డబ్బులు కడుతారంటూ శోభకు వార్నింగ్ ఇస్తారు. మరోవైపు చంద్రమ్మ.. సౌందర్య ఇంటికి వస్తుంది. ఒకసారి శౌర్యను చూడాలనిపించి వచ్చాను అంటుంది చంద్రమ్మ. దీంతో పర్వాలేదు అంటుంది సౌందర్య.
నువ్వు మా శౌర్యను కంటికి రెప్పలా కాపాడావు. నీకు ధన్యవాదాలు అంటుంది సౌందర్య. బోనాల పండుగకు శౌర్యతో పాటు అందరినీ పిలుస్తుంది చంద్రమ్మ. దీంతో వస్తాం అంటుంది సౌందర్య. బోనాల పండుగ దూం దాంగా చేద్దాం సౌందర్య అంటాడు ఆనంద రావు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
Ind Vs Aus : సొంత గడ్డపై దారుణమైన ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న భారత India జట్టు ఇప్పుడు…
Health Benefits : పారిజాత మొక్క శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. ఇది సువాసనగల, రాత్రిపూట పుష్పించే చెట్టు.…
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
This website uses cookies.