Gandhi And Godse Story : జాతిపిత మహాత్మా గాంధీ గురించి మనం చాలా విషయాలు విన్నాం. ఆయన గురించి పాఠ్యపుస్తకాల్లోనూ చదువుకున్నాం. ఆయన అహింసావాది అనే విషయం తెలిసిందే. ఆయన అహింసా సిద్ధాంతంలోనే భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని బ్రిటీష్ వారిని ఇండియా నుంచి వెళ్లగొట్టారని మనం చదివాం. మరి.. ఇంతటి అహింసావాదిని, మంచి వ్యక్తిని ఎందుకని ఒకరు పగబట్టి మరీ చంపాల్సి వచ్చింది. ఆయన్ను చంపేంత తప్పు ఏం చేశారు? అసలు గాంధీని గాడ్సే ఎందుకు చంపాడు? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో గాంధీతత్వానికి కానీ.. ఏ మతానికి కానీ.. వ్యతిరేకం కాదు అని గమనించాలి. మీకు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన, చరిత్రకు సంబంధించిన వీడియోలు కావాలంటే ఈ చానెల్ ను ఫాలో అవండి.
ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మహాత్మా గాంధీకి మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అహింసావాదిగా ఆయనకు మంచి పేరు ఉంది. భారతదేశ పోరాట చరిత్రను తీసుకుంటే ముందుగా వినిపించే పేరు గాంధీదే. మహాత్మా గాంధీ.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి ముందు పరిస్థితులు వేరుగా ఉండేవి. చాలామంది స్వాతంత్ర్యం కోసం పోరాడి అమరులయ్యారు. ఆయన వచ్చిన తర్వాత గాంధీ చేసిన సత్యాగ్రహం, అహింసా పద్ధతిలో పోరాటాలు భారతీయులందరిలో స్ఫూర్తిని నింపి.. భారత దేశ పోరాటంలో పాల్గొనేలా చేశాయి. భారతదేశానికే జాతిపిత లాంటి వ్యక్తిని సొంత దేశంలోనే చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. అసలు గాంధీని ఎందుకు చంపారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. గాంధీని చంపడం కోసం ఒకసారి కాదు చాలా సార్లు ప్రయత్నించారు. అధికారికంగా పోలీసులు 5 సార్లు గుర్తించారు.
ఫస్ట్ అటెంప్ట్ : 1934 లో గాంధీ కారులో పూణెలోని ఒక ఆడిటోరియం దగ్గరికి చేరుకోగా.. ఆయన కారుపై బాంబు విసిరారు. కానీ.. ఆ దాడిలో గాంధీకి ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. అదృష్టవశాత్తు గాంధీ తప్పించుకున్నారు. సెకండ్ అటెంప్ట్ : ఆ తర్వాత పంచగనిలో ప్రార్థనాసమయంలో ఉన్నప్పుడు నాథురాం గాడ్సే అనే వ్యక్తి గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన్ను చంపడానికి గాంధీ వైపు దూసుకొచ్చాడు. దీంతో అక్కడున్న వాళ్లు గాడ్సేను పట్టుకున్నారు. మూడో అటెంప్ట్ : గాంధీ… పాకిస్తాన్ నేత జిన్నాతో చర్చలు జరిపేందుకు సమావేశం కోసం ముంబైకి బయలుదేరుతుండగా కొందరు హిందూ కార్యకర్తల బృందం ఆయన్ను అడ్డుకుంటుంది. అప్పుడు కూడా గాంధీని చంపాలని చూశారు కానీ.. గాంధీ తప్పించుకున్నారు. నాలుగో అటెంప్ట్ : 1948 లో జనవరి 20న గాంధీ ఉన్న స్టేడియం వెనుక కొందరు బాంబును దూదితో కప్పి గోడ మీద ఉంచి ఆ తర్వాత ఆ దూదిని వెలిగించారు. ఆ బాంబు పేలినప్పటికీ బాంబు దాడి నుంచి గాంధీ తప్పించుకున్నారు.
ఐదో అటెంప్ట్ : నాలుగో అటెంప్ట్ జరిగిన 10 రోజుల తర్వాత అంటే 1948, జనవరి 20న గాంధీ బిర్లా హౌస్ లో ప్రార్థనలో ఉండగా.. నాథురామ్ గాడ్సే అనే వ్యక్తి ఈసారి ఏకంగా తుపాకీని పట్టుకొచ్చి గాంధీకి ఎదురుగా వచ్చి మరీ ఆయన్ను అందరి మధ్యలోనే కాల్చి చంపాడు. ఇన్ని ప్రయత్నాల ద్వారా గాంధీ చనిపోయారు.
ఎంతోమంది చంపేందుకు ప్రయత్నించినా.. ఆయన్ను చంపిన వారిలో బయటికి వినిపిస్తున్న పేరు మాత్రం గాడ్సే పేరు మాత్రమే. మహాత్ముడిని చంపిన వ్యక్తిగా ఇతడి పేరు చరిత్రలో ఉండిపోయింది.
అసలు గాడ్సే గాంధీని ఎందుకు చంపారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈయన పూర్తి పేరు.. రామచంద్ర వినాయకరావు గాడ్సే కానీ.. ఇతడిని ఎక్కువగా నాథూరామ్ గాడ్సే అని పిలుస్తారు. ఈయన వినాయక్ దామోదర్ సావర్కర్ ను ఫాలో అయి హిందుత్వ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. తన చదువు పూర్తయ్యాక ఆర్ఎస్ఎస్ లో ఒక మెంబర్ గా చేరాడు.
పాకిస్థాన్ భారత్ నుంచి వేరవడానికి.. భారత్ ముక్కలు అవడానికి గాంధీనే ప్రధాన కారణం అని గాడ్సే విశ్వసించాడు. ఆయనే కాదు.. ఆర్ఎస్ఎస్, హిందూ మహా సభలో ఉన్నవాళ్లు చాలా మంది ఈ విషయాన్ని నమ్మారు. ముస్లింల కొరకు పాకిస్థాన్ ను ప్రత్యేక దేశంగా విభజించి ఇచ్చేలా గాంధీనే చేశాడని గాడ్సే తీవ్రంగా గాంధీపై కక్ష పెంచుకున్నాడు. అందుకే విభజన సమయంలో గాంధీజీ ముస్లింల తరుపున దీక్ష కూడా చేశాడని గాడ్సే తన కోర్టు స్టేట్ మెంట్ లో చెప్పాడు. చాలా విషయాల్లో పాకిస్థాన్ కు అనుకూలంగా గాంధీ నిర్ణయాలు తీసుకోవడంతో ఎలాగైనా గాంధీని చంపాలని పక్లా ప్లాన్ తో గాంధీని గాడ్సే చంపేశాడు.
ఈ వీడియో మీకు ఎంతో కొంత సమాచారాన్ని అందించిందని మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ఈ చానెల్ లో మీకోసం త్వరలో అందిస్తాం.
Health Benefits : పారిజాత మొక్క శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. ఇది సువాసనగల, రాత్రిపూట పుష్పించే చెట్టు.…
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
This website uses cookies.