Sudigali Sudheer : జబర్దస్త్ కమెడియన్ గా మంచి పేరు దక్కించుకున్న సుడిగాలి సుదీర్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సుధీర్ సినిమాలు చేస్తున్నాడు అంటే ఏదో చిన్నాచితక పాత్రలు కాదండోయ్.. ఆయనే మెయిన్ లీడ్ గా.. హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆయనకున్న క్రేజ్ తో పలువురు నిర్మాతలు వరుసగా సినిమాలు నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు. ఆయన తో సినిమా అంటే కచ్చితంగా టేబుల్ ప్రాఫిట్ అంటూ ప్రతి ఒక్క నిర్మాత నమ్ముతున్నారు. అందుకే మంచి కథలతో సుడిగాలి సుదీర్ వైపుకు చిన్న నిర్మాతలు క్యూ కడుతున్నారు.
సుడిగాలి సుదీర్ కూడా ఎన్ని రోజులని జబర్దస్త్ చేస్తూ ఉంటాను… సినిమాలు కూడా చేద్దాం అన్నట్లుగా వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఒకవైపు జబర్దస్త్ చేస్తూనే మరో వైపు కంటిన్యూగా సినిమాలను కూడా చేస్తున్నాడు. ప్రతి సినిమా ను కూడా మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సుడిగాలి సుదీర్ రెడీ అవుతున్నాడు. ఈ సమయం లో ఆయన ఒక్క సినిమా కు ఎంత పారితోషికం తీసుకుంటాడు అంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు ఆసక్తిగా నెట్ ఇంకా సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. సుడిగాలి సుదీర్ జబర్దస్త్ షో కి అయితే షెడ్యూల్ వారీగా పారితోషకం తీసుకుంటారు. అయితే సినిమా విషయానికి వస్తే కాస్త ఎక్కువగానే ఆయన తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఒక్కో కాల్షీట్ కు ఎనిమిది నుండి పది లక్షల చొప్పున పారితోషికం గా సుధీర్ అనుకుంటున్నట్లుగా బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అంటే ఒక్క రోజుకి సుధీర్ అంత పారితోషకం తీసుకుంటున్నాడు అన్న మాట. ఒక్క సినిమా కోసం సుధీర్ 70 నుంచి 100 రోజులు వర్క్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అతని పారితోషికం దాదాపుగా కోటి ఉంటుందన్న మాట. సుడిగాలి సుదీర్ సినిమా కు కోటి పారితోషికం అంటే తక్కువే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు సక్సెస్ లు పడితే సుడిగాలి సుదీర్ పారితోషకం కోటి నుండి ఒకేసారి 5 కోట్లకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బుల్లి తెరపై సూపర్ స్టార్ అయిన సుడిగాలి సుదీర్ వెండి తెరపై కూడా సందడి చేస్తాడని అభిమానులు నమ్ముతున్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.