Karthika Deepam 2 Sep Today Episode : కార్తీక్.. మోనితకు తాళి కడుతుండగా దీప చూస్తుందా? హాస్పిటల్ లో మోనితను చూసిన దీప ఏం చేస్తుంది? పోలీసులకు పట్టిస్తుందా?

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

Karthika Deepam 2 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ 2 సెప్టెంబర్ 2021, గురువారం లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 1134 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్నాళ్లు మా అందరికీ మీరు ఉన్నారు. కానీ.. ఇప్పుడు మీ అందరికీ మేం ఉన్నాం.. అంటూ కార్తీక్ కు దైర్యం చెబుతుంది దీప. నాకు తెలుసు. పుట్టి పెరిగిన ఇన్ని ఏళ్లకు ఎవరు ఏంటో తెలుసుకున్నాను.. ప్రశాంతంగా ఇంటికి వెళ్లు దీప. పిల్లలకు నేను హాస్పిటల్ లో ఉన్నానని చెప్పకు. అసలే.. రౌడీ జ్వరంతో ఉంది. ఇంకా దిగులు పడుతుంది. హిమ కూడా నన్ను చూడాలని పట్టుబడుతోంది. సరేనా.. అంటూ దీపకు చెబుతాడు కార్తీక్.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

నువ్వు వెళ్లు ఇక అంటాడు. దీంతో మిమ్మల్ని ఈ స్థితిలో వదిలేసి.. ఇలా ఎలా వెళ్తాను డాక్టర్ బాబు అనగానే.. రాత్రంతా నేను నిద్రపోకుండా.. నిన్ను నిద్రపోనీయలేదు.. అనగానే.. డాక్టర్ బాబు మానసిక పరిస్థితి బాగాలేదని అత్తయ్య, మామయ్యకు చెప్పాలి. ఎలాగైనా వాళ్లను ఇక్కడికి తీసుకురావాలి.. అని అనుకొని బయలుదేరబోతుంది దీప.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

ఇంతలో కార్తీక్.. దీప.. నువ్వంటే నాకు చాలా ఇష్టం దీప.. అని అంటాడు. వెళ్లు.. జాగ్రత్తగా వెళ్లు.. అంటాడు. దీంతో దీప.. ఒక చిరునవ్వు నవ్వి.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో ఎస్సై వచ్చి కార్తీక్ అని అంటాడు. దీంతో వాళ్లతో పాటు వెళ్లిపోతాడు కార్తీక్.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

Karthika Deepam 2 Sep Today Episode : తాళి తీసుకొని హాస్పిటల్ వెళ్లేందుకు రెడీ అయిన మోనిత

కట్ చేస్తే.. మోనిత రెడీ అవుతుంది. తాళిని తీసుకుంటుంది. దాన్ని చూసి తెగ మురిసిపోతుంటుంది. తాళి నుంచి కార్తీక్ ఫోటోను చూస్తుంది. కార్తీక్ తనకు తాళి కడుతున్నట్టు.. తనను పెళ్లి చేసుకుంటున్నట్టు ఊహించుకుంటుంది. కానీ.. కార్తీక్ తనకు తాళీ కట్టేసమయానికే.. దీప వచ్చి ఆపండి.. అని అన్నట్టుగా ఊహించుకుంటుంది.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

అయినవాళ్ల అందరి మధ్యన.. అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ తాళిని నీచేత నా మెడలో కట్టించుకోవాలని అనుకున్నా కార్తీక్. కానీ.. దీప వల్ల.. అది తీరని కోరికగానే మిగిలిపోయింది. అయినా నేను వదలను. ఏ తాళిని అయితే నీతో కట్టించుకోవాలని అనుకున్నానో.. అది ఈరోజే నీతోటే ఆసుపత్రిలో కట్టించుకోబోతున్నాను కార్తీక్.. అని తెగ మురిసిపోతుంది మోనిత. ఇది నా మెడలో పడితేనే నువ్వు నాకు దగ్గర అవుతావు. అప్పుడు దీపే కాదు కదా.. ఇంక నన్ను ఎవ్వరూ నీ నుండి నన్ను వేరు చేయలేరు.. అని అనుకుంటుంది మోనిత.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

ఇంతలోనే అక్కడికి రత్నసీత వస్తుంది. తాళిని చూసి షాక్ అవుతుంది. ఏంటి రత్నసీత.. అలా షాక్ గా చూస్తున్నావు. ఈ తాళి ఏంటనా? ఈరోజు నేను కార్తీక్ ను పెళ్లి చేసుకోబోతున్నాను.. అనగానే మేడమ్.. మీరేమో కానీ.. నాకైతే చాలా టెన్షన్ గా ఉంది. మీరు ఎప్పుడు ఏం చేస్తారో నాకు అర్థం కావడం లేదు. ఏదైనా జరగరానిది జరిగితే.. మీకే కాదు.. నాకు కూడా ప్రాబ్లమ్ అవుతుంది.. అని చెబుతుంది రత్నసీత.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

డోంట్ వర్రీ రత్నసీత. నువ్వేం భయపడకు. నేను ఇదివరకే నీకు చెప్పా కదా. నీకు ఇంతకంటే మంచి జీతం ఉన్న ఉద్యోగం ఇస్తా అని. ఒకవేళ నేను దొరికిపోతానన్న భయం నీకుంటే.. చచ్చినా నీ పేరు మాత్రం అస్సలు చెప్పను. నన్ను నమ్ము. మనకు మంచిరోజులు రాబోతున్నాయి. నువ్వు హ్యాపీగా స్టేషన్ కు వెళ్లు.. అనగానే.. లేదు మేడమ్ రోషిణి మేడమ్.. ఆసుపత్రిలోనే ఉండమన్నారు.. అని చెబుతుంది రత్నసీత.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

దీంతో ఫుల్ ఖుషీ అవుతుంది మోనిత. అవునా.. అలా అయితే ఇంకా మంచిది. కార్తీక్ తో నాకు జరిగే పెళ్లికి ఏకైక సాక్షివి నువ్వే అని అంటుంది మోనిత. కానీ.. మేడమ్ అని రత్నసీత అనగానే.. ఏం కాదు టెన్షన్ పడొద్దని చెప్పానా? కూల్ రత్నసీత.. కూల్.. నీ మనసులో ఎటువంటి భయాలు.. అనుమానాలు పెట్టుకోకుండా.. హ్యాపీగా వెళ్లు. నేను 11.30 కి అక్కడికి వస్తాను.. సరేనా వెళ్లు.. అంటుంది.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

తనను ఒకసారి కౌగిలించుకొని.. నేను కార్తీక్ ను ఎంతగా ఇష్టపడతానో.. నిన్ను కూడా ఇష్టపడతాను. నా కార్తీక్ కోసం కూడా నేను ప్రాణాలకు తెగించట్లేదు. కానీ.. నా కోసం, నా కార్తీక్ కోసం నేను చెప్పినట్టు చేస్తున్న నీకోసం నా ప్రాణాలు అయినా పణాలు పెడతాను. నేనేదో అవసరం కోసం ఈ మాట అనడం లేదు. మనస్పూర్తిగా చెబుతున్నాను. నేను ఉండగా నీకు ఏం కానివ్వను. వెళ్లు.. నేను 11.30 కి వస్తాను.. అని సంతోషంగా చెబుతుంది మోనిత.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

సరే.. అంటూ వెళ్లిపోతుంది రత్నసీత. ఇన్ని రోజుల నా కల.. ఈరోజు నెరవేరబోతుంది.. అంటూ చాలా సంతోషపడుతుంది మోనిత.

Karthika Deepam 2 Sep Today Episode : డాక్టర్ బాబు ఆసుపత్రిలో ఉన్నాడని సౌందర్యకు చెప్పిన దీప

కట్ చేస్తే.. దీప ఇంటికి వచ్చి జరిగింది చెబుతుంది. ఇంత జరిగితే పోలీసులు మనకు చెప్పాలి కదమ్మా అని దీపతో తన మామయ్య అంటాడు. ఆటైమ్ కు నేను పోలీస్ స్టేషన్ కు వెళ్లాను కాబట్టి చెప్పారు. లేదంటే ఆ విషయం కూడా తెలిసేది కాదు.. అని అంటుంది దీప.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

మరి నీకు తెలిసిన తర్వాత అయినా మాకు ఫోన్ చేయొచ్చు కదే.. అనగానే.. రాత్రి ఆయన కంగారు చూస్తే మీరు తట్టుకోలేరని చెప్పలేదు అత్తయ్య. మామయ్యతో చెప్పొద్దంటారు. మీకు కూడా చెప్పొద్దంటారు. నాకు జాగ్రత్తలు చెబుతున్నారు. నాకు అంతా అయోమయంగా ఉంది.. అనగానే ఇప్పుడు ఎలా ఉంది. వెళ్దాం పదా.. వాడిని అలా వదిలి ఉండలేం.. అని సౌందర్య భర్త అంటారు. ఎలాంటి సమస్య వచ్చినా.. చాలా ధైర్యంగా ఉండేవాడు. కానీ.. ఇలా మనసు చెదిరినట్టు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు.. అంటుంది సౌందర్య.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

ఇప్పుడు టైమ్ 11 అయింది. ఇప్పుడు బయలుదేరితే 11.30 వరకు అక్కడికి వెళ్లొచ్చు. అప్పటికి డాక్టర్ గారు కూడా వస్తారట. డాక్టర్ తో కూడా మాట్లాడొచ్చు.. అని చెబుతుంది దీప.

నాకెందుకో కంగారుగా ఉంది అత్తయ్య అని చెబుతుంది దీప. డాక్టర్ గారు వస్తారని చెప్పావు కదా. ఆవిడతో మాట్లాడుతాంలే అని చెబుతుంది సౌందర్య. నువ్వేం టెన్షన్ పడకు. బహుశా.. అనుకోని పరిస్థితులు ఎదురయ్యే సరికి.. వాడు ఏమన్నా.. డిప్రెషన్ లోకి వెళ్తున్నాడేమో.. నువ్వు పిల్లలకు చెప్పకుండా బయలుదేరు.. మేం కూడా చెప్పకుండా వస్తాం.. అని చెబుతుంది సౌందర్య.

Karthika Deepam 2 Sep Today Episode : డాక్టర్ బాబు ఏ శిక్ష పడుతుందోనని కంగారుపడ్డ భాగ్య

కట్ చేస్తే.. భాగ్య ఇల్లు తూడుస్తుంటుంది. ఓ పేపర్ కనిపిస్తుంది. అందులో ఓ డాక్టర్ కు హత్యానేరానికి 50 ఏళ్ల శిక్ష పడినట్టు ఉంటుంది. అంటే హత్య చేస్తే జీవిత ఖైదు ఏనా. మా డాక్టర్ బాబుకు కూడా ఇదే శిక్ష పడుతుందా? జీవితాంతం జైలులో ఉండాల్సిందేనా.. అని బాధపడుతుంది భాగ్య.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

ఒసేయ్ మోనిత నువ్వు బతికి ఉన్నప్పుడు నా కూతురు జీవితం నాశనం చేశావు. చచ్చాక కూడా నా కూతురు జీవితం నాశనం చేస్తున్నావు కదే మొదనాష్టపు దానా. నీమూలంగా దేవుడు లాంటి డాక్టర్ బాబు జైలుకు వెళ్లాల్సిన గతి పట్టింది కదే. దేవుడా.. కావాలంటే డాక్టర్ బాబు విడుదలయ్యేదాకా.. ప్రతిరోజు ఒక్కపూటే తిని.. రెండో పూట ఉపవాసం ఉంటాను దేవుడా.. డాక్టర్ బాబుకు ఏం కాకూడదు. దేవుడా నువ్వే మమ్మల్ని కాపాడు తండ్రి.. అని అనుకుంటుంది భాగ్య.

Karthika Deepam 2 Sep Today Episode : తన కోసం అన్నదానం చేస్తున్న డాక్టర్ భారతిని చూసి జాలిపడ్డ మోనిత

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

కట్ చేస్తే.. డాక్టర్ లా రెడీ అయి.. మోనిత హాస్పిటల్ కు బయలు దేరుతుంది. ఇన్ని రోజులు నేను పడ్డ కష్టానికి ఈరోజు ప్రతిఫలం లభించబోతుంది. ఇక డాక్టర్ బాబును నానుంచి ఎవ్వరూ విడదీయలేరు. దీప ఇక నీ చాప్టర్ క్లోజ్.. అంటూ మనసులో ఖుషీ అవుతుంటుంది మోనిత.

ఇంతలోనే రోడ్డు మీద ఓ టెంట్ వేసి.. తన ఫోటోకు దండ వేసి.. భోజనాలు వడ్డిస్తున్న సీన్ కనిపిస్తుంది. వెంటనే కారు ఆమమంటుంది మోనిత. చూస్తే.. తన ఫ్రెండ్ డాక్టర్ భారతి భోజనాలు వడ్డిస్తుంటుంది. మోనిత ఫోటోను పెట్టి.. మీ ప్రతి ఆలోచన మా గురించే అని మురిసిపోయే వాళ్లం. కానీ మీ ప్రతి ఆలోచన మాకు ఒక జ్ఞాపకంగా మిగులుస్తారని అనుకోలేదు. మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. హాస్పిటల్ స్టాఫ్.. అంటూ తన ఫోటో కింద రాసి ఉండటాన్ని కారులో నుంచే చదువుతుంది మోనిత.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

నేను నిజంగానే చచ్చానని అనుకొని భారతి.. అందరికీ అన్నదానం చేస్తున్నట్టుంది పాపం పిచ్చిది. నేను బతికే ఉన్నానన్న విషయం తెలియదు. అయినా ప్రపంచంలో ఇలాంటిది ఎవ్వరికీ జరగదు. నాకే ఫస్ట్ టైమ్ అనుకుంటా.. ఏం చేస్తాం..అని అనుకొని కారును పోనియ్ అని చెబుతుంది.

Karthika Deepam 2 Sep Today Episode : సౌందర్య, తన భర్తను ఆసుపత్రికి పోకుండా అడ్డుకున్న పిల్లలు

కట్ చేస్తే.. సౌందర్య, తన భర్త కార్తీక్ దగ్గరికి వెళ్లేందుకు సిద్ధమవుతారు. హమ్మయ్య పిల్లలు లేరు అని అనుకుంటారు. కానీ.. ఇంతలోనే ఎక్కడికి అని అడుగుతారు. నాన్న దగ్గరికా.. అమ్మ ఇందాకే వెళ్లింది కదా. అమ్మ బయటే ఉందా? మీరు అమ్మ కలిసి వెళ్తున్నారా? అయితే మమ్మల్ని కూడా తీసుకెళ్లండి. ఏం ప్రశ్నలే అవి ఊపిరి కూడా తీసుకోనీయకుండా.. అని సౌందర్య అంటుంది. మేము పనిమీద బయటికి వెళ్తున్నాం అమ్మా.. అని చెబుతాడు సౌందర్య భర్త. దీంతో సరే.. మేం కూడా వస్తాం. ఇంట్లో ఉండి బోర్ కొడుతోంది.. అంటుంది శౌర్య.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

మేం వెళ్లేది కంపెనీ పని మీద.. అంటుంది సౌందర్య. దీంతో అవును.. మీరు మా నాన్న దగ్గరికి ఎందుకు వెళ్తారు. మీకు చూడాలనిపిస్తే కదా. మాకు చూడాలనిపించినా మమ్మల్ని తీసుకెళ్లరు.. అని అంటుంది శౌర్య. ఇంతలో సౌందర్య.. శౌర్య.. రెండు రోజులు పోతే.. అని అనేసరికి.. మా నాన్న వస్తాడా? అని ఎటకారంగా అంటుంది శౌర్య.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

ఎన్ని రెండు రోజులకు. ఇప్పటికి ఎన్ని రెండు రోజులు పోయాయి. ఇంకా ఎన్ని రెండు రోజులకు వస్తాడు.. అని అడుగుతుంది శౌర్య. మీరు అబద్ధం చెబుతున్నట్టు మాకు అర్థం అయిపోతోంది నానమ్మ. ఇప్పటి దాకా.. మా అమ్మే అబద్ధాలు చెబుతోంది అని అనుకున్నాం. కానీ.. ఇప్పుడు మీరు కూడా మాకు అబద్ధాలు చెబుతున్నారు.. అని అంటారు పిల్లలు.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

మీరు పిల్లలు కాదే పిడుగులు.. అనగానే.. మీరు మాత్రం మమ్మల్ని బాధపెట్టొచ్చా.. అని అంటుంది హిమ. మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ ఇంట్లో మీకు పరాయివాళ్లు ఎవ్వరూ లేరు. అందరం మంచి కోరుకునేవాళ్లమే. మీకు మీ నాన్నంటే ఇష్టం ఉండటంలో తప్పు లేదు. కానీ.. మీ అమ్మంటే మీకు ఎందుకు ఇష్టం పోయిందో మాత్రం అర్థం కావడం లేదు.. అని సౌందర్య భర్త అంటాడు.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

మీకు స్కూల్స్ స్టార్ట్ అయితే తప్ప లాభం లేదు. స్కూల్, ట్యూషన్ హోంవర్క్ లేక ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. మేం వెళ్లేది బయటికే.. అని అంటుంది సౌందర్య. అందుకే.. బయటికి తీసుకెళ్లమని అంటున్నాం. నిజంగా ఇంట్లో ఉండబుద్ధి అవ్వడం లేదు నానమ్మ. అనగానే.. రేపు ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఈరోజు మా పని అయ్యేసరికి చాలా టైమ్ పడుతుంది.. అని చెప్పి ఎలాగోలా తప్పించుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు ఇద్దరు.

కట్ చేస్తే.. దీప ఆటోలో ముందే హాస్పిటల్ కు బయలు దేరుతుంది. వీళ్లు ఖచ్చితంగా నాన్న దగ్గరికే వెళ్తున్నారు.. అని అనుకుంటారు పిల్లలు. ఇంతలో దీప.. తన నానమ్మకు ఫోన్ చేస్తుంది. తన ఫోన్ ఇంట్లోనే మరిచిపోతుంది. ఆ ఫోన్ ను శౌర్య చూసి లిఫ్ట్ చేస్తుంది. అత్తయ్య బయలుదేరారా? మనం ముగ్గురం డాక్టర్ బాబు దగ్గరికి వెళ్తున్నట్టు పిల్లలకు ఏం అనుమానం రాలేదు కదా.. అని అంటుంది దీప. దీంతో శౌర్య.. వచ్చింది.. కానీ అబద్ధం చెప్పి వచ్చింది.. అని అంటుంది.. అని అంటుంది శౌర్య. దీంతో దీప షాక్ అవుతుంది.

Karthika Deepam 2 Sep Today Episode : కార్తీక్ దగ్గరికి వెళ్లి.. తాళి కట్టు అంటూ అడిగిన మోనిత

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

కట్ చేస్తే.. మోనిత ఆసుపత్రికి వెళ్లి నేరుగా కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. 16 ఏళ్లు నువ్వు ప్రేమించా.. ప్రేమించా.. అంటే ఏంటో అనుకున్నాను. కానీ.. 16 ఏళ్లు నీ రాక్షసత్వాన్ని నాకు తెలియకుండా నటించావు.. అని కార్తీక్ మోనితతో అంటాడు. దీంతో షట్ అప్ కార్తీక్.. అని గట్టిగా అరుస్తుంది మోనిత.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

ఇది రాక్షసత్వం కాదు.. ప్రేమ అంటుంది మోనిత. పిచ్చి ప్రేమ కార్తీక్.. అంటుంది. ఇంతలోనే దీపతో పాటు.. తన మామయ్య, ఆదిత్య.. ముగ్గురు ఆసుపత్రికి వస్తారు.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

ఇక.. ఆఖరి ప్రయత్నం ఇది.. అని చెప్పి కార్తీక్ కు తాళి చూపిస్తుంది. తాళి కట్టు అంటుంది. ఆవేశపడుతూ.. కట్టు.. త్వరగా తాళి కట్టు కార్తీక్.. అంటుంది మోనిత. కట్టేసేయ్ కార్తీక్.. అంటుంది.. ఇంతలోనే డాక్టర్ బాబు రూమ్ లోకి వీళ్లు వెళ్లబోతుంటారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే.. శుక్రవారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.

Karthika deepam 2 september 2021 thursday episode 1134 highlights

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago