Karthika Deepam 20 April Today Episode : జ్వాల చెంప పగులగొట్టిన సౌందర్య.. తనే శౌర్య అనే నిజం తెలుసుకుంటుందా? ఇంతలో ట్విస్ట్ ఏంటంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 20 April Today Episode : జ్వాల చెంప పగులగొట్టిన సౌందర్య.. తనే శౌర్య అనే నిజం తెలుసుకుంటుందా? ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?

 Authored By gatla | The Telugu News | Updated on :20 April 2022,10:30 am

Karthika Deepam 20 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 ఏప్రిల్ 2022, బుధవారం ఎపిసోడ్ 1331 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఎలా వెళ్తారు అని తినడం పూర్తయ్యాక.. నిరుపమ్, హిమను అడుగుతాడు ప్రేమ్. దీంతో ఎలా వెళ్తారు ఆటోలోనే వస్తారు అని అంటుంది జ్వాల. మేమిద్దరం ఆటోలో వెళ్తాంలే నువ్వు వెళ్లు అంటాడు నిరుపమ్. దీంతో ప్రేమ్.. స్కూటీ మీద వెళ్లబోతూ.. హిమతో వెళ్లాలని అనుకొని బైక్ స్టార్ట్ అవ్వట్లేదని యాక్ట్ చేస్తాడు. దీంతో ఏమైంది అని అడుగుతాడు నిరుపమ్. స్టార్ట్ అవ్వడం లేదు అంటాడు ప్రేమ్. దీంతో నువ్వు కూడా ఆటోలోనే రా బావ అంటుంది హిమ. దీంతో సరే.. మీరు ఇంతగా బతిమిలాడుతున్నారు కాబట్టి వస్తాను అంటాడు ప్రేమ్.

karthika deepam 20 april 2022 full episode

karthika deepam 20 april 2022 full episode

ఆ తర్వాత అందరూ కలిసి ఆటోలో వెళ్తూ ఉంటారు. ఏంటి తింగరి పక్కనే కూర్చుంటావా అంటుంది జ్వాల. తప్పదు కదా అంటాడు ప్రేమ్. మరోవైపు అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఆటోలో వెళ్తుంటారు. అవును.. ఎవరో నీ శత్రువు అన్నావు కదా.. ఆ శత్రువు ఎవరో ఇప్పుడు ఎదురైనా బాగుండు అంటాడు ప్రేమ్. దీంతో ఎక్స్ ట్రా ఇప్పుడు ఆ టాపిక్ తీయకు అంటుంది జ్వాల. మరోవైపు నిరుపమ్ ను చూసి రిలాక్స్ అవుతుంది జ్వాల. జ్వాల.. నిరుపమ్ ను… ప్రేమ్.. మాత్రం హిమను చూస్తూ ఉంటాడు.

మరోవైపు హాస్పిటల్ కు ఆనంద్ రావును తీసుకెళ్తుంది స్వప్న. క్లీనిక్ లో నిరుపమ్ లేడని టెన్షన్ పడుతుంది స్వప్న. ఇంతలో నిరుపమ్, హిమ వస్తారు. చెకప్ కోసం వచ్చాం అని చెబుతుంది. అయినా నువ్వు హాస్పిటల్ లో ఉండకుండా దీనితో బయట తిరగడం ఏంటి.. నాకు అర్థం కావడం లేదు అని అడుగుతుంది స్వప్న.

ఆ తర్వాత అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది హిమ. మరోవైపు సౌందర్య.. హిమ రూమ్ లో ఫ్యాన్లు, లైట్లు ఆన్ చేసి ఉండటం చూసి షాక్ అవుతుంది. ఇంట్లో లేదు.. ఎక్కడికి వెళ్లింది అని అనుకుంటుంది సౌందర్య. హిమ రూమ్ లో ఉన్న చిన్నప్పటి హిమ, శౌర్య ఫోటోను చూస్తుంది. దాని వెనుక వైపే పెద్దయ్యాక జ్వాలతో దిగిన ఫోటో ఉంటుంది. ఆ ఫోటోను మాత్రం సౌందర్య చూడదు.

తర్వాత ఇంటికి వచ్చిన నిరుపమ్ ను భోజనం చేద్దువుదా అని అంటుంది స్వప్న. దీంతో జ్వాల బాక్స్ తెచ్చింది. అక్కడే తినేసి వచ్చాను అంటాడు నిరుపమ్. దీంతో స్వప్నకు చాలా కోపం వస్తుంది. అడ్డమైన వాళ్లు తెచ్చే గడ్డిని నువ్వు తినడం ఏంటి అంటుంది స్వప్న.

Karthika Deepam 20 April Today Episode : నిరుపమ్ కు పెళ్లి సంబంధం చూసిన స్వప్న

అస్తమానం మీరు నన్నే తప్పు పడతారు కానీ.. నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు అని చిరాకు పడుతుంది స్వప్న. మరోవైపు కారులో వెళ్తుండగా.. స్వప్నకు నచ్చజెప్పాలనుకుంటాడు నిరుపమ్. కానీ.. నేను ఎలా ఉండాలో.. ఎలా ఆలోచించాలో నువ్వు చెప్పడం కరెక్ట్ కాదు.. అంటుంది స్వప్న.

ఆ తర్వాత నీకు ఒక పెళ్లి సంబంధం చూశాను అని చెబుతుంది స్వప్న. ఇంతలో కారు ఆగిపోతుంది. ఇంతలో అదే రూట్ లో సత్యం వెళ్తుంటాడు. కారు ఆపి.. ఏమైంది అని అడుగుతాడు సత్యం. బ్యాటరీ డౌన్ అయింది అంటాడు నిరుపమ్. సరే.. నా కారులో రండి.. అంటాడు సత్యం.

దీంతో నేను రాను అంటుంది స్వప్న. మరోవైపు సౌందర్యను చూసుకోకుండా గుద్దుకుంటుంది శౌర్య. దీంతో తన చెంప పగులగొడుతుంది సౌందర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది