karthika deepam 20 december 2021 full episode
Karthika Deepam 20 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 డిసెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 1227 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కోటేశ్ వాళ్లను ఇబ్బంది పెట్టకండి. నేను డబ్బులు చెల్లిస్తాను అని చెప్పి అగ్రిమెంట్ మీద సంతకం పెడతాడు కార్తీక్. అయితే… ఒకవేళ గడువు లోపు డబ్బులు కట్టకపోతే ఏం చేస్తావు అక్క అంటాడు తన మనిషి. దీంతో వాడిని ఒక దెబ్బ కొట్టి.. ఒరేయ్.. గడువులోగా ఆ డబ్బులు కట్టకపోతే తనకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు కదా. వాళ్లలో ఒకరిని తెచ్చేసుకుంటా.. అని ఈ పత్రాల్లో రాయించా. పాపం.. అగ్రిమెంట్ లో ఏముందో చదవకుండానే సంతకం పెట్టేశాడు. మంచోడు కదా అంటుంది రుద్రాణి. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. పొద్దుపోతున్నట్టుంది ఇక నువ్వు వెళ్లొచ్చు అంటుంది రుద్రాణి.
కట్ చేస్తే పిల్లలు ఇంట్లో పడుకుంటారు. దోమలు కుడుతుంటాయి. వాళ్లకు అస్సలు నిద్ర రాదు. దీంతో దీప లేచి.. వాళ్లకు అట్టతో గాలి ఊపుతుంది. దీంతో వాళ్లు నిద్రపోతారు. ఇంతలో కార్తీక్ ఇంటికి వస్తాడు. రాగానే తన పిల్లలను చూసుకుంటాడు. కార్తీక్ ఇంత లేటు అయిందేంటి. ఈ టైమ్ లో మిమ్మల్ని ఎందుకు రమ్మన్నారు అంటుంది దీప. అక్కడ జరిగిన విషయాలు దీపకు చెబితే తను బాధపడుతుంది. చెప్పి బాధపెట్టడం కంటే చెప్పకపోవడమే మంచిది అని అనుకుంటాడు. దీంతో ఏం లేదు దీప.. మనం డబ్బులు ఇస్తామని అన్నాం కదా. పేపర్స్ మీద సంతకం పెట్టించుకుంది అంటాడు. మరోవైపు మోనితకు ఏం చేయాలో అర్థం కాదు. పడుకున్న ప్రియమణిని లేపి.. నవమాసాలు మోసిన కొడుకు కనిపించడం లేదు.. కార్తీక్ ఎటు వెళ్లాడో తెలియదు అని ప్రియమణితో చెబుతుంది.
karthika deepam 20 december 2021 full episode
మనం వచ్చాం. రెండు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చాం. వాళ్లు భయపడ్డారో.. ఏంటో నాకు అర్థం కాలేదు కానీ.. ఆంటి వచ్చి నా ఫోటోను బద్ధలు కొట్టింది. అసలు ఏంటి వీళ్లు.. వీళ్ల ధైర్యం ఏంటి.. అని తెగ టెన్షన్ పడుతుంది. ఏదో ఒక ప్లాన్ చేయాలి కదా అంటుంది మోనిత.
రాత్రి పడుకున్నాక ఒక్కసారిగా రుద్రాణి ఇంటికి వెళ్లిన విషయం గుర్తుకొస్తుంది కార్తీక్ కు. వెంటనే నిద్రలేస్తాడు. ఉలిక్కిపడతాడు. పిల్లలను ఒకసారి చూసి కూర్చొని ఆలోచిస్తుంటాడు. దీప కూడా లేస్తుంది. ఏం జరిగింది. కార్తీక్ బాబు ఎందుకు అలా ఉన్నాడని అనుకుంటుంది దీప.
ఉదయమే ఆదిత్య.. సౌందర్యతో చెబుతాడు. ఏదో ఒకటి ఆలోచించు మమ్మీ అంటాడు. తనెందుకు ఇక్కడ ఉండాలి అంటాడు. దీంతో దాని సంగతి నేను చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి అంటుంది సౌందర్య. ఇంతలో ప్రియమణి.. అంటూ పిలుస్తూ అక్కడికి వస్తుంది మోనిత.
నా బాబు.. నా బంగారు కొండ ఈ ఫోటోలో ఎలా ఉన్నాడో చూడు అంటుంది మోనిత. ఓపికగా ఉంటేనే విజయాలు సాధించగలుగుతామని పెద్దలు అంటారు. నా బాబు కనిపించడం లేదు కదా. పేపర్ లో వేయించి వాడి కోసం వెతుకుతాను అంటుంది మోనిత.
ఆచూకీ తెలిపిన వారిని నా ఫామ్ హౌస్ రాసిస్తాను అని ప్రకటన ఇవ్వు అంటుంది మోనిత. దీంతో అందరూ షాక్ అవుతారు. మరోవైపు శ్రీవల్లి కొడుకుతో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అతడికి వెనుక పుట్టుమచ్చ ఉంటుంది. అది చూసి అరె.. భలే ఉంది పుట్టుమచ్చ అని అనుకుంటారు.
పిల్లాడిని ఎత్తుకొని కార్తీక్ దగ్గరికి వెళ్తారు పిల్లలు. కార్తీక్ కూడా కాసేపు పిల్లాడితో ఆడుకుంటాడు. మరోవైపు మోనిత ఒక్కతే అద్దం ముందు కూర్చొని ఏడుస్తుంది. తన బాబు గురించే ఆలోచిస్తుంది. నేనూ తల్లినే కదా. నాకు కూడా ఏడుపు వస్తుంది కదా అనుకుంటుంది.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.