
small issue between Sourav Ganguly and Virat Kohli says gambhir
Virat Kohli : టీమిండియా మాజీ కెప్టెన్, ప్రజెంట్ బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని పొగుడుతూనే చురకలు అంటించారు. టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీని వన్డే ఫార్మాట్ నాయకత్వం నుంచి కూడా తొలగిస్తూ బీసీసీఐ డెసిషన్ తీసుకుంది. ఈ విషయమై ప్రకటించింది కూడా. కాగా, విరాట్ కోహ్లీకి ఈ తొలగింపు విషయం చాలా కాలం ముందరే చెప్పామని సౌరవ్ గంగూలీ అంటున్నారు. కానీ, తనకు ఒక గంటన్నర ముందరే విషయాన్ని చెప్పారని కోహ్లీ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. గంగూలీ ఈ విషయాన్ని వదిలేయాలని పేర్కొంటున్నారు.
కానీ, ప్రస్తుతం హాట్ టాపిక్ ప్లస్ చర్చనీయాంశంగా అదే ఉంది.విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా వారు సౌరవ్ గంగూలీని ఎక్కడికెళ్లినా అడుగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గురుగావ్‌లో జరిగిన ఈవెంట్‌లో గంగూలీ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంగూలీకి ఏ ప్లేయర్ యాటిట్యూడ్ ఇష్టమని ఓ విలేకరి అడగగా, తనకు విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ ఇష్టమని తెలిపారు. కానీ, తాను చాలా సేపు ఫైట్ చేయడం మాత్రం తనకు నచ్చదని గంగూలీ తెలిపాడు. అలా విరాట్ కోహ్లీని ఓ వైపున పొగుడుతూనే మరో వైపున తెగుడుతున్నాడు. తన జీవితంలో స్ట్రెస్‌ను ఎలా ఎదుర్కొంటారనే ప్రశ్నకు కూడా సౌరవ్ గంగూలీ సెటైరికల్ రిప్లయి ఇచ్చారు.
Sourav Ganguly comments on virat kohli
తన లైఫ్‌లో ప్రెషర్ అనేది అస్సలు ఉండబోదని, కేవలం వైఫ్, గర్ల్ ఫ్రెండ్ మాత్రమే ప్రెషర్ ఇస్తుంటారని పేర్కొన్నాడు గంగూలీ. ఇకపోతే సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య జరుగుతున్న వ్యాఖ్యలు చూస్తుంటే భారత క్రికెట్‌లో ఇంతకీ ఏం జరుగుతుంది అనే చర్చ క్రీడా, క్రికెట్ అభిమానులలో బయలుదేరుతోంది. గంగూలీ వ్యాఖ్యలకు భిన్నంగా విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు ఉండటం మూలాన ఈ చర్చ జరుగుతున్నది. ఇకపోతే తనకు రోహిత్ శర్మతో ఎటువంటి విభేదాలు లేవని ఇటీవల విరాట్ కోహ్లీ స్పష్టంగా తెలిపాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.