karthika deepam 20 november 2021 full episode
Karthika Deepam 20 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 నవంబర్ 2021, శనివారం 1202 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ ఇంట్లో వాళ్లంతా దీపావళి సంబురాలు ఘనంగా జరుపుకుంటారు. అదే సమయంలో దీప.. సౌందర్యకు ఫోన్ చేస్తుంది. ఆంటి.. నేను మోనితను మీ కోడలును అంటుంది. ఎందుకు ఫోన్ చేశావు అంటుంది. పూజ అయిపోతే ఇక ఫోన్ చేయొద్దా ఆంటి. ఎంత కాదనుకున్నా నేను కూడా మీ కోడలునే కదా అంటుంది మోనిత. మీ మనవడికి ఏం బాగోలేదు.. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఒకసారి కార్తీక్ ను రమ్మంటారా అంటుంది మోనిత. లేదంటే మీరైనా ఒకసారి రండి అంటుంది.
దీప జాగ్రత్త చీర కాలుతుంది అని కార్తీక్ అనడం విని మోనితకు చిరాకు వచ్చి ఫోన్ పెట్టేస్తుంది. ఉదయమే మోనిత.. దీప గురించి ఆలోచిస్తుంది. అసలు ఈ దీప ధైర్యం ఏంటి. దీపకు ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది అని ఆలోచిస్తుంది. ఇంత జరిగినా.. కార్తీక్ కు నా మీద ప్రేమ పెరగలేదు.. దీప మీద తగ్గలేదు అని అనుకుంటుంది మోనిత. మరోవైపు కార్తీక్ కూడా తెగ ఆలోచిస్తుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో సౌందర్య, ఆనంద రావు వచ్చి దీప గురించే మాట్లాడుతారు.
తను ఇంతలా నవ్వుతూ కనిపిస్తోందంటూ తను ఏదో బలమైన నిర్ణయమే తీసుకొని ఉంటుంది అంటాడు ఆనంద రావు. దీప బర్త్ డే విషెస్ చెప్పాలన్నా భయమేస్తుంది సౌందర్య అంటాడు ఆనందరావు. నాది అదే పరిస్థితి అంటాడు కార్తీక్. దీప అన్నీ మాట్లాడుతున్నా.. నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను అంటాడు కార్తీక్.ఇంతలో దీప.. పిల్లలు కిందికి దిగుతారు. దీప పిల్లలకు కథ చెబుతూ నవ్విస్తుంది. నాన్నా అమ్మ భలే జోకులు చెబుతుంది తెలుసా అంటుంది రౌడీ. అవును డాడీ ఎన్ని జోకులో అంటుంది హిమ. అత్తయ్య మేము గుడికి వెళ్లి వస్తాం అంటుంది దీప. మీరు వస్తారా అంటుంది. నాన్నా, నానమ్మా.. అమ్మకు హ్యాపీ బర్త్ డే చెప్పరా అంటుంది రౌడీ.
వాళ్లు నాకు ముందే చెప్పేశారురా అంటుంది దీప. ఏం చెప్పారు. ఏం గిఫ్ట్ ఇచ్చారు అంటుంది. చాలా పెద్ద గిఫ్టే ఇచ్చారు అంటుంది దీప. అలాంటి గిఫ్ట్ నాకు ఈ జన్మలో ఎవ్వరూ ఇవ్వలేరు తెలుసా అంటుంది దీప. ఆ ఆనందాన్ని మనసులోనే దాచుకోవాలన్నమాట అంటుంది దీప.అత్తయ్య, మామయ్య ఇద్దరూ నిలుచోండి.. అని చెప్పి నన్ను దీవించండి అంటుంది. మీరెప్పుడూ నా ఆనందాన్ని కోరుకుంటారు లెండి.. అని సౌందర్యతో అంటుంది దీప. డాక్టర్ బాబు.. మీరు కూడా నన్ను దీవించాలి. లేవండి.. అంటుంది. ఇంతలోనే మోనిత కార్తీక్ ఇంటికి వస్తుంది.
హ్యాపీ బర్త్ డే దీపక్క అంటుంది మోనిత. దీంతో అందరూ షాక్ అవుతారు. థాంక్యూ మోనిత అంటుంది దీప. బొకే బాగుంది మోనిత. ఏదేమైనా నీ సెలెక్షన్ సూపర్ గా ఉంటుంది తెలుసా.. అంటుంది దీప. అందరినీ పలకరిస్తుంది మోనిత. కానీ.. ఎవ్వరూ మాట్లాడరు. కార్తీక్ ఏమైంది అనగానే షట్ అప్ మోనిత. ఎందుకు వచ్చావు. వెళ్లు.. గెట్ అవుట్ అంటాడు.దీంతో అదేంటి డాక్టర్ బాబు.. ఇంటికి వచ్చిన వాళ్లను అలా వెళ్లమంటే ఎలా డాక్టర్ బాబు. ఏం మోనిత నీ ఆరోగ్యం బాగుందా. గుడికని బయలుదేరాను. లేక పోతే.. కాఫీటీలు ఇచ్చేదాన్ని. పోనీ.. ఒకపని చేయ్.. నువ్వు కూడా మాతో పాటు గుడికి వచ్చేయ్. ఎంత కాదనుకున్నా.. నువ్వు కూడా నా కుటుంబంలో ఒక దాన్ని అనుకుంటా అంటుంది దీప.
పదా మోనిత గుడికి వెళ్దాం. బర్త్ డే పార్టీ కూడా ఇస్తా అంటుంది దీప. దీంతో నేను గుడిలో దేవుడి కన్నా గుండెల్లో దేవుడిని ఎక్కువగా నమ్ముతాను అంటుంది. అయ్యో మోనిత.. ఇంత మొహమాటపడితే ఎలా చెప్పు.. అంటుంది. నేను గుడికి రాను కానీ.. మీరే రేపు మా ఇంటికి రండి. మా అబ్బాయి బారసాల చేస్తున్నా అంటుంది.అందరూ రావాలి అంటుంది. అయ్యో మరిచిపోయాను. కార్తీక్. నువ్వు కూడా రావాలి అంటుంది. నోర్మూయ్. ఎక్కువ మాట్లాడకుండా బయటికి వెళ్లు.. అంటాడు కార్తీక్. అదేంటి కార్తీక్ అలా అంటావు బాబు.. నా బాబే కాదు కదా.. నీ బాబు కూడా కదా.. అంటుంది మోనిత.
మోనిత నువ్వేం టెన్షన్ పడకు. బారసాలకు నేను తీసుకొస్తాను వీళ్లను అని చెబుతుంది దీప. చెప్పాను కదా.. రేపే నీ కథకు క్లయిమాక్స్ అని మోనితకు చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది. తర్వాత పిల్లలను తీసుకొని షాపింగ్ కు వెళ్లిన దీప ఇంటికి రాదు. ఆతర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.