Karthika Deepam 20 Sep Today Episode : మోనితకు శిక్ష వేసిన కోర్టు.. జైలులోనే బిడ్డను కనబోతున్న మోనిత.. నేరుగా బిడ్డతోనే నీ ఇంటికి వస్తా అని కార్తీక్, దీపకు చాలెంజ్ చేసిన మోనిత
Karthika Deepam 20 Sep Today Episode : కార్తీక దీపం ఈరోజు సీరియల్ 20 సెప్టెంబర్ 2021, సోమవారం 1149 ఎపిసోడ్ తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ముమ్మాటికీ తండ్రి కార్తీకే అని కుండ బద్ధలు కొట్టి మరీ చెబుతుంది మోనిత. దీంతో మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు.. అని కార్తీక్ కూడా అంటాడు. నా బిడ్డ మీద ఒట్టు వేసి చెబుతున్నా. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి కార్తీకే అని మళ్లీ అంటుంది మోనిత.
ఆ బిడ్డకు నేనెలా తండ్రి అయ్యానో అడగండి లాయర్ గారు.. అని అంటాడు కార్తీక్. ఎందుకంటే నీ రక్తం పంచుకొని పుట్టబోతున్నాడు కాబట్టి అంటుంది మోనిత. మీకిద్దరికి పెళ్లికాకుండా.. అతడు తండ్రి ఎలా అవుతాడు అని అడుగుతాడు లాయర్. దీంతో ఆర్టిఫిషియల్ సిమ్యులేషన్ చేయించుకున్నా అంటుంది మోనిత. విన్నారా యువర్ ఆనర్.. తను డాక్టర్ కాబట్టి.. తనకు తెలిసిన టెక్నాలజీతో కార్తీక్ ప్రమేయం లేకుండా గర్భాన్ని దాల్చింది.. అని చెబుతాడు లాయర్.
Karthika Deepam 20 Sep Today Episode : మోనితతో నాకు ఆవిధమైన సంబంధం లేనే లేదు అని తేల్చి చెప్పిన కార్తీక్
యువర్ ఆనర్.. నాకు మోనితతో ఆవిధమైన సంబంధమే ఉంటే.. తన కడుపులోయ పెరుగుతున్న బిడ్డకు నేనే తండ్రిని అని ఒప్పుకునేవాడిని. కానీ.. నాకు చెప్పకుండా.. నా పర్మిషన్ తీసుకోకుండా.. సిముల్యేషన్ చేయించుకొని.. ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను తండ్రిని అంటే నేనెలా ఒప్పుకుంటాను. ఎప్పటికీ ఒప్పుకోను.. అంటాడు కార్తీక్.
ఏళ్ల తరబడి ఎదురు చూసి చూసి.. సహనం సశించిపోయింది. కార్తీక్ కు చెప్పకుండా.. ఆయన ప్రమేయం లేకుండానే గర్భవతిని అయ్యాను. ఈ విషయాన్ని నేను తొలిరాత్రే చెబుతాను.. అని ఇంత బహిరంగంగా చెప్పడం వెనుక నా ఉద్దేశం ఒక్కటే. రేపటి రోజు.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అనే సమాధానం.. లోకానికి చెప్పడం కోసమే అలా చెప్పాల్సి వచ్చింది. కార్తీక్ దీపను పెళ్లి చేసుకోకముందే నేను ప్రేమించాను. ఆ విషయం అప్పుడే నేను చెప్పాను. అయినా నన్ను కాదని దీపను పెళ్లి చేసుకున్నాడు. నాకు ఏం తక్కువ.. అందం, చదువు, ఆస్తి.. వీటన్నింటితో పాటు.. ఇద్దరం ఒకే వృత్తిలో ఉన్నాం. కానీ.. అతడు నా ప్రేమను గడ్డి పోచతో సమానంగా తీసి పడేశాడు. అయినా.. నాతో అన్నీ షేర్ చేసుకునే వాడు. ప్రతి రోజు నా ఇంటికి వచ్చేవాడు. అందరూ మా మధ్య ఏదో ఉందని అనుకునేవారు. అలా నేను ఇల్లు కూడా మారాల్సి వచ్చింది.. అని మోనిత చెబుతుంది.
Karthika Deepam 20 Sep Today Episode : మోనితకు క్లాస్ పీకిన దీప
అతడి మూలంగా సమాజంలో నాకెంతో చెడ్డ పేరు వచ్చింది.. అని మోనిత అంటుండగానే.. అప్పుడు రావద్దని చెప్పొచ్చు కదా. నీ శీలం మీద మచ్చ పడిందని తెలిసినప్పుడు ఎందుకు కార్తీక్ ను మాటిమాటికీ పిలిచావు.. అని దీప ప్రశ్నిస్తుంది. అందరూ మీ మధ్య ఏధో ఉందని అనుకుంటే.. అది నిజం కావాలని.. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కార్తీకే తండ్రి అని అందరూ అనుకోవాలని.. నువ్వు చేసిన కుట్రే ఇందులో కనిపిస్తోంది.. అంటూ దీప.. షాక్ ఇస్తుంది.
నేనూ మోనిత స్నేహితులం. ఆ పరిచయంతోనే నేను తనను తరుచూ కలిసేవాడిని. కానీ.. ఏనాడూ నేను తనను వేరే దృష్టితో చూడలేదు. మా ఇద్దరి మధ్య పవిత్రమైన స్నేహమే ఉందని అనుకునేవాడిని. కానీ.. ఒకానొక దశలో నేను మోనితను పెళ్లి చేసుకుంటా అని చెప్పా. అప్పుడు నేను ఉన్న మానసిక పరిస్థితి వేరు. నా భార్యానేను విడిపోయి ఉన్నాం. మమ్మల్ని కలపాలని మా అమ్మ చేసే ప్రయత్నాలను ఆపడం కోసం.. మోనితను పెళ్లి చేసుకుంటానని బెదిరించానే తప్ప.. నాకా ఉద్దేశం నిజంగా లేదు.. నేను నా భార్య పదేళ్లు విడిగా ఉన్నాం కానీ.. ఏరోజూ నేను మోనిత విషయంలో చలించలేదు. అప్పుడు ఒంటరిగానే ఉన్నాను. ఇప్పుడు నేను.. నా భార్య కలిసిపోయాం. దాన్ని తట్టుకోలేక. ఆర్టిఫిషియల్ ఇన్ సెమ్యులేషన్ ద్వారా గర్భం దాల్చి.. నన్ను బ్లాక్ మెయిల్ చేసింది.. అని కార్తీక్ చెబుతాడు.
Karthika Deepam 20 Sep Today Episode : గర్భాన్ని అడ్డం పెట్టుకొని నన్ను మోనిత టార్చర్ చేసిందని చెప్పిన కార్తీక్
గర్భాన్ని అడ్డం పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకోవాలంటూ నన్ను టార్చర్ పెట్టింది. ఆ తర్వాత చనిపోయినట్టు నాటకం ఆడి.. నన్ను జైలుకు పంపించేందుకు ప్రయత్నించింది. చివరకు డాక్టర్ వేషంలో వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించింది… పెళ్లి చేసుకోకపోతే నా వాళ్లను చంపేస్తానంటూ బెదిరించింది.. ఇది జరిగిన విషయం అని కార్తీక్ కోర్టుకు విన్నవిస్తాడు.
డాక్టర్ కార్తీక్ చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయని.. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మీరే ఒప్పుకున్నారు. ఒకరి జీవితంలోకి బలవంతంగా ప్రవేశించాలని ప్రయత్నించడం.. దాని కోసం ఎంతకైనా తెగించడం.. ఇవన్నీ రుజువు అయ్యాయి. మీరు ఇంకా కోర్టుకు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా.. అని మోనితను జడ్జి అడుగుతాడు.
దీంతో.. ఉంది యువర్ ఆనర్.. ఉంది.. అని అంటుంది మోనిత. నేను ఒక అనాథను. చిన్నప్పుడే నా ఆస్తిని మా బాబాయి చేతుల్లో పెట్టి మా అమ్మానాన్నా పోయారు. మా బాబాయి ఎక్కడో దూరంగా ఉంటాడు. నేనిక్కడ అనాథగానే పెరిగాను. కష్టం.. సుఖం.. బాధ.. దు:ఖం.. ఇవన్నీ పట్టించుకోవడానికి నాన్న తోడులేక ఒంటరిగా బతుకుతున్న నాకు.. అప్పుడు పరిచయం అయ్యాడు కార్తీక్. అతడి ఓదార్పు.. అతడి స్నేహం.. అతడి అండ.. నాలో కోటి ఆశలు రేపాయి. కార్తీక్ ను పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఒంటరితనం మరిచిపోయి.. ప్రశాంతంగా బతకొచ్చని ఆశపడ్డాను. కానీ.. నాకలలు, కోరికలు.. ఆశలు.. నమ్మకాలు అన్నింటినీ కూలదోసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కార్తీక్. మళ్లీ ఒంటరిదాన్ని అయిపోయాను. కనీసం.. నా మెడలో తాళి కడితే చాలు.. అని ఎంతో ప్రాదేయపడ్డాను.. కార్తీక్ కరగలేదు.. కనికరం చూపలేదు.. అందుకే కార్తీక్ బిడ్డకు తల్లిని కావాలనుకున్నాను. అలా అయినా పెళ్లి చేసుకుంటాడు అనుకున్నాను.. ఇదంతా నేరం అని ఘోరం అని పాపం అని అనైతికం అని ఎందరు అనుకున్నా.. ఈ కోర్టు ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. ఆయన కట్టుకున్న భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని కాదు అని 11 ఏళ్ల క్రితం అన్నాడు. ఇప్పుడు నాకడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని కాదు అంటున్నాడు. అప్పుడు వద్దన్న భార్య.. ఇప్పుడు ఆయన పక్కనే ఉంది. ఇప్పుడు నన్ను వద్దంటున్నాడు. ఏమో.. కొన్నాళ్లు పోతే నన్ను కూడా ఆదరిస్తాడేమో.. ఇంకా నాలో ఆశ చావలేదు యువర్ ఆనర్. ఆయన కాదన్నా.. ఎవరు కాదన్నా.. ప్రపంచం అంతా అవునన్నా.. కాదన్నా.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మాత్రం కార్తీకే. ఈ కార్తీకే… నా కార్తీకే… అంటూ నవ్వుతుంది మోనిత.
Karthika Deepam 20 Sep Today Episode : మోనితకు 18 నెలల కఠిన కారాగార శిక్ష విధించిన కోర్టు
ప్రాసిక్యూషన్ వారి కథనాన్ని.. మోనిత వల్ల ఇబ్బందుల పాలు అయినా కూడా.. ముద్దాయి మోనితలో కొంచెం కూడా పశ్చాతాపం లేదని కోర్టు భావిస్తోంది. అందుకే.. మోనితను నేరస్థురాలిగా కోర్టు భావిస్తోంది. గౌరవనీయమైన వృత్తిలో ఉండి.. వైద్య వృత్తిని తన సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం నేరం. అలాగే.. సమాజంలో ఒక ఉన్నతమైన వృత్తిలో ఉన్న వ్యక్తి కీర్తిని దిగజార్చినందుకు గాను పరువు నష్టం కింద ఐదు లక్షల జరిమానా విధించడం జరిగింది. అంతే కాకుండా.. పోలీస్ శాఖను, కోర్టును తప్పుదోవ పట్టించినందుకు.. ముద్దాయికి 18 నెలలు అంటే ఏడాదిన్నర కఠిన కారాగార శిక్ష విధిస్తోంది కోర్టు. అలాగే.. కార్తీక్ స్నేహితురాలు అయిన హిమను హత్య చేయించిందన్న నేరారోపణలో విచారణ కొనసాగించాలని పోలీస్ శాఖ వారిని ఆదేశిస్తూ తీర్పు ముగించడం అయినది.. అని జడ్జి తీర్పు చెప్పి వెళ్లిపోతాడు. దీంతో మోనితను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు పోలీసులు.
ఇంతలో బయట మీడియా వాళ్లు ఉంటారు. మాట్లాడాలంటూ ఒత్తిడి చేస్తారు. పోలీసులు ఏం మాట్లాడరు కానీ.. మోనితను కూడా మాట్లాడాలంటూ అడుగుతారు. మీరు చేసిన తప్పుకు మీ బిడ్డకు కూడా శిక్ష పడింది. మీ బిడ్డను జైలులోనే కంటారా.. అని మోనితను అడుగుతారు. అసలు.. పెళ్లి కోకుండానే మాతృత్వాన్ని కోరుకున్నారు.. దీని వల్ల మీలాంటి వాళ్లు ఏం సందేశం ఇస్తున్నారు. ఇంత చేసి.. జైలు శిక్ష పడ్డాక కూడా మీ ముఖంలో కాస్త కూడా విచారం కనిపించడం లేదేంటి.. అని అడుగుతారు మీడియా వాళ్లు.
దీంతో కాసేపు నవ్వి.. అక్కడే కార్తీక్, దీప ఉండటం చూసి.. వెయిట్ వెయిట్.. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతాను. సినిమాకు ఉన్నట్టే మన జీవితంలో కూడా మూడు భాగాలు ఉంటాయి. ఓపెనింగ్.. ఇంటర్వెల్, క్లయిమాక్స్. ఇది నా జీవితానికి క్లయిమాక్స్ మాత్రం కాదు. ఇంటర్వెల్ బాంగ్ మాత్రమే.. అని అంటుంది మోనిత.
Karthika Deepam 20 Sep Today Episode : బిడ్డతో మళ్లీ వస్తా.. అని మోనిత చాలెంజ్
ఎవ్వరూ ఊహించని విధంగా క్లయిమాక్స్ ఉంటుంది… చూస్తూ ఉండండి.. అని చెప్పి దీప దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది మోనిత. ఇంతలో పోలీసులు వద్దని వారిస్తారు. మా వంటలక్కతో ఒకసారి మాట్లాడి వస్తాను మేడమ్ అంటుంది మోనిత. దీంతో నో వే.. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది చాలు.. ఇక నువ్వు ఎక్కడికీ పోవాల్సిన అవసరం లేదు.. అంటుంది ఏసీపీ రోషిణి. దీపక్కా.. దీపక్కా.. శ్రావ్య నీకు తోడబుట్టిన చెల్లెలు అయితే.. నేను నీకు కార్తీక్ మూలంగా చెల్లెలు అవుతాను గుర్తు పెట్టుకో.. అంటుంది మోనిత. దీంతో దీపకు కోపం వస్తుంది కానీ.. ఊరుకుంటుంది. సౌందర్య ఆంటి.. నా బిడ్డకు బారసాల, నామకరణం.. అన్నీ మీచేతుల మీదుగానే జరగాలి.. లేకపోతే నేను ఊరుకోను.. ఆనందరావు అంకుల్.. నాకు కొడుకే పుడుతాడు.. అందుకే నీ పేరే పెట్టుకున్నా. నీకు అసలైన వారసుడు వస్తున్నాడు.. మోనిత శకం ముగిసిపోలేదు.. రీఎంట్రీ ఇస్తాను.. గుర్తు పెట్టుకోండి. మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి. బిడ్డతో వస్తాను.. ఐలవ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ అని చెప్పి మోనిత అక్కడి నుంచి జైలుకు వెళ్లిపోతుంది.
కట్ చేస్తే.. ఇంట్లో తన తల్లిదండ్రులు, దీపతో కార్తీక్ మాట్లాడుతుంటాడు. నా జీవితం నా చేతుల్లోంచి వెళ్లిపోయింది. నేనే పారేసుకున్నాను.. అంటాడు. ఇప్పటికైనా దాని పీడ విరగడ అయింది కదా.. దాన్ని మనసులో నుంచి తీసేయండి అంటుంది దీప. మరిచిపోవడానికి అదేమన్నా చిన్నవిషయమా దీప. అది జైలుకు ఒంటరిగా వెళ్లి ఉంటే.. నువ్వు చెప్పినట్టే నేను మరిచిపోయేవాడినేమే.. ఆనందంగా ఉండేవాడిని కానీ.. కడుపులో బిడ్డతో వెళ్లింది. ఆ బాంబు ఎప్పుడు ఎలా పేలుతుందో.. దాని వల్ల ఎంత మంది బలి అయిపోతారో అని ఊహించుకోవడానికే భయంగా ఉందని చెబుతాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.