karthika deepam 21 april 2022 full episode
Karthika Deepam 21 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 ఏప్రిల్ 2022, గురువారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్వాల కోసం ఆటో స్టాండ్ వద్ద ఎదురు చూస్తూ ఉంటుంది హిమ. ఇంతలో ఆటోలో వస్తుంది జ్వాల. ఏయ్ తింగరి.. ఇక్కడికి రమ్మన్నావు ఏంటి అని అడుగుతుంది జ్వాల. దీంతో ఊరికే కలుద్దామని రమ్మన్నా అంటుంది. ఎప్పుడో కుదిరినప్పుడు కలవాలి కానీ.. హాస్పిటల్ వదిలిపెట్టి నా చుట్టు తిరుగుతున్నావు ఏంటి తింగరి అని అంటుంది జ్వాల. దీంతో ఎప్పుడూ హాస్పిటల్ లో ఉండి బోర్ కొడుతోంది. అందుకే కాసేపు అలా తిరగాలని అనిపిస్తోంది అంటుంది హిమ.
karthika deepam 21 april 2022 full episode
మరి.. నువ్వు ఇలా బయటికి వచ్చేస్తే.. హాస్పిటల్ ఎవరు చూసుకుంటారు అంటే.. మీ డాక్టర్ సాబ్ ఉన్నాడు కదా చూసుకోవడానికి అంటుంది తింగరి. దీంతో జ్వాలకు చాలా సంతోషం వేస్తుంది. మరోవైపు ఆనంద రావు పేపర్ చదువుతూ ఉంటాడు. స్వప్న.. చిరాకుగా ఉండటం చూసి ఏమైంది అంటాడు. డాడీ నేను ఇంత ఇరిటేషన్ తో వచ్చి కూర్చున్నాను. అసలు ఏమైంది అని అడగరా అంటుంది. దీంతో అడగడానికి ఏముందమ్మా.. నీకు ఎవరి మీదో కోపం వచ్చి ఉంటుంది.. అంటాడు. అందరి మీద నాకు కోపం వచ్చింది అంటుంది స్వప్న.
దీంతో అందరి మీద నాకు కోపం వస్తోంది అంటుంది స్వప్న. ప్రేమ్, నిరుపమ్.. ఇద్దరూ మీ అల్లుడికి దగ్గరవుతున్నారు అంటుంది స్వప్న. దీంతో అల్లుడికి దగ్గరవడం కాదు.. నీకు దూరం అవుతున్నారు అంటాడు ఆనందరావు. మీ ఆవిడ వాళ్లను మార్చేస్తుంది అంటుంది స్వప్న.
ఎప్పుడో ఏదో అన్నదని.. ద్వేషించడం ఏం బాగుంది చెప్పు. క్షమించవచ్చు కదా అంటాడు ఆనంద రావు. దీంతో తను మాట్లాడిన మాటలకు.. నా కూతురు ఇప్పుడు అమెరికాలో చిత్రవద అనుభవిస్తోంది అంటుంది స్వప్న. మీ భార్య ఏంటి.. ఈ రకంగా నా మీద ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటోందా అంటుంది స్వప్న.
నా కొడుకులను నాకు దూరం చేస్తే నేను చూస్తూ ఊరుకోను అంటుంది స్వప్న. మరోవైపు కారులో సౌందర్య వెళ్తూ ఉంటుంది. ఆటోలో ఆ కారు వెనకే పోతుంటుంది జ్వాల. ఇంతలో తన కారు ఆపుతుంది సౌందర్య. జ్వాల మాత్రం కారును దాటేసి వెళ్లిపోతుంది.
మరోవైపు ఒకావిడకు యాక్సిడెంట్ అయి రక్తం కారుతూ ఉంటుంది. ఆవిడ ఎవరో కాదు.. మోనిత ఇంట్లో ఉండే పని మనిషి. వెంటనే తనను ఆటోలో ఎక్కిస్తుంది. ఇంతలో మంచినీళ్లు కావాలంటుంది. ఓ వ్యక్తి మంచినీళ్ల బాటిల్ తో వెళ్తుండటంతో మంచినీళ్లు బాటిల్ ను తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తుంది జ్వాల.
అప్పుడే సౌందర్య బయటికి వస్తుంది. తనను తాకుతుంది. డాక్యుమెంట్లు అన్నీ కిందపడిపోతాయి. తన మీద నీళ్లు పడిపోతాయి. దీంతో జ్వాల చెంప చెళ్లుమనిపిస్తుంది సౌందర్య. తనను చూసి షాక్ అవుతుంది జ్వాల. ఈ డాక్యుమెంట్స్ ఎంత విలువైనవో తెలుసా. చూసుకోవాలి కదా వేస్ట్ ఫెలో అంటుంది సౌందర్య.
రోడ్డు మీద ఏంటే నీ పరుగులు. బుద్ధుందా నీకు అంటుంది సౌందర్య. అసలే టైమ్ అయిపోయిందని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నువ్వెవరే అంటుంది సౌందర్య. నేను నీ శౌర్యను అని మనసులో అనుకుంటుంది జ్వాల. నానమ్మ ఇక్కడే ఉందంటే.. నా శత్రువు కూడా ఇక్కడే ఉంటుంది.. అని అనుకుంటుంది.
కానీ.. ఇంతలో ఆ ముసలావిడ గుర్తొచ్చి వెళ్లి తనకు మంచినీళ్లు తాగిస్తుంది జ్వాల. కానీ.. ఇప్పుడు ముసలావిడను వదిలేసి వెళ్లేదెలా.. అని అనుకుంటుంది జ్వాల. ఇంతలో కారులో వెళ్తూ ఆ ముసలావిడకు జ్వాల నీళ్లు తాగించడం చూస్తుంది సౌందర్య.
కారు దిగేలోపే ఫోన్ వస్తుంది. మేడమ్ త్వరగా రమ్మని అనడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది సౌందర్య. ఆ తర్వాత ఆటోలో ఆ ముసలావిడను ఆసుపత్రికి తీసుకెళ్తుంది జ్వాల. మరోవైపు ఆ ముసలావిడను నిరుపమ్ ఆసుపత్రికి తీసుకొస్తుంది.
ఆ ముసలావిడను చూసి.. హిమ షాక్ అవుతుంది. ఈవిడ నన్ను చూస్తే నా గురించి శౌర్యకు చెబుతుందేమో అని అనుకుంటుంది. తనకు ట్రీట్ మెంట్ చేయాలంటే భయపడుతుంది. తర్వాత తనకు ట్రీట్ మెంట్ చేస్తారు నిరుపమ్, హిమ.
మరోవైపు హిమ, శౌర్య కలిసి ఉండటం చూస్తారు సౌందర్య, ఆనంద రావు. తన దగ్గరికి వెళ్తారు. తను ఎవరు అని అడుగుతారు. దీంతో తన చేతి మీద ఉన్న హెచ్ అనే అక్షరాన్ని చూపిస్తుంది హిమ. దీంతో సౌందర్య, ఆనంద రావు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
This website uses cookies.